ఈరోజు రాశిఫలాలు: ఓ రాశి వారి ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి.

First Published Nov 27, 2022, 4:21 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు శ్రమ పెరుగుతుంది. పనిచేయు వారి తోటి ఇబ్బందులు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారం నందు ధన నష్టం ఏర్పడవచ్చును.అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తారు. 

Daily Horoscope 2022 New 01

పంచాంగం      
తేది :27 నవంబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ
ఆయనం : దక్షిణాయణం
మాసం : మార్గశిర
ఋతువు : హేమంత
పక్షం : శుక్లపక్షము                                                                                         
వారము: ఆదివారం
తిథి :   చవితి రాత్రి 8.33 వరకు
నక్షత్రం :.     పూర్వాషాడ సా 5.04 ని  వరకు
వర్జ్యం:    రాత్రి 12.31ల 1.59    వరకు
దుర్ముహూర్తం:సా.0 3. 51ని. నుండి సా. 4.35ని. వరకు                               
రాహుకాలం:సా.04.30ని నుండి సా.06.00ని వరకు.                                                                
యమగండం:మ.12.00ని. నుండి మ.01.30ని. వరకు.                                                                              
సూర్యోదయం : ఉ.06.14ని.లకు
సూర్యాస్తమయం: సా.05.20ని.లకు
 

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు నక్షిత్ర వివరాలు, సమస్యలు వాట్సప్ లో ఇదే నెంబర్ కు పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు . బంధుమిత్రులతో  కలిసి ఆనందంగా గడుపుతారు . పాత బాకీలు వసూలు అగును .  మిత్రుల సహకారం మేలు చేస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యం చేకూరి మనసు ప్రశాంతత లభించును . సంఘము నందు గౌరవ ప్రతిష్టలు పెరుగును . వృత్తి వ్యాపారము నందు ధన లాభం చేకూరుతుంది . అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి . పెద్దల యొక్క సహాయ సహకారములు  లభించును . ఈరోజు చాలా ప్రశాంతత గా గడుస్తుంది .  ప్రయాణాలు . ఉద్యోగము నందు పై అధికారుల మన్నన పొందుతారు.  లక్ష్మీ ఆరాధన శుభప్రదం.

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
అనవసరమైన పనులు యందు దూరంగా ఉండటం మంచిది. శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది. పనిచేయు వారి తోటి ఇబ్బందులు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారం నందు ధన నష్టం ఏర్పడవచ్చును.అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తారు. చేతికి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి.  కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును. సంఘము నందు  అవమానాలు. చేయు ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు స్నేహాల వలన కొద్దిపాటి సమస్యఏర్పడును. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

Zodiac Sign

 
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
శుభవార్తలు వింటారు.గృహము నందు ఆనందకరమైన వాతావరణం. చేయు పని యందు మిత్రులు యొక్క సహాయ సహకారములు లభించును. మీ ప్రతిభకు  ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు.సంఘము నందు మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారములు అందిస్తారు. ఆరోగ్యంసమకూరి ప్రశాంతంగా ఉండును. వృత్తి వ్యాపారములు అధిక ధన లాభం చేకూరును. ఉద్యోగము నందు ఆనందంగా  గడుస్తుంది. పెద్దల యొక్క స్నేహాలు లాభించును. విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. శివపార్వతులను పూజించడం మంచిది. 

Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
సంఘము నందు కీర్తి ప్రతిష్టల పెరుగును . తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అగును . మిత్రుల సహకారం మేలు చేస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఇతరులకు మీ వంతుసహాయ సహకారములు  అందిస్తారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగును . శుభకార్యాలలో పాల్గొంటారు . రావలసిన బాకీలు వసూలు అగును . ప్రయాణాలు అనుకూలం.ఉద్యోగము నందు పెద్దవారి యొక్క సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు . దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు .  సూర్య నమస్కారం వల్ల శుభఫలితాలు ఉంటాయి.

Zodiac Sign


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
పై అధికారులతో కొద్దిపాటి విరోధాలు. కుటుంబం నందు ప్రతికూల వాతావరణం. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది. మిత్రుల సహకారం మేలు చేస్తుంది. .  అనవసరమైన ఖర్చులు చేస్తారు . బంధుమిత్రులతో మాట పట్టింపులు రావచ్చును . మనస్సు నందు ఆందోళనగా ఉంటుంది . ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడును . అనవసర ప్రయాణాలు . తలపెట్టిన పనులు పనులలో ఆటంకాలు ఏర్పడతాయి .   వృత్తి వ్యాపారాలు యందు కొద్దిపాటి ధన నష్టం కలుగును . మీ కోపాన్ని తగ్గించుకుని అందరితో మంచిగా ఉండండి . కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు  ఇబ్బంది కలిగిస్తాయి.  శ్రీవేంకటేశ్వర శరణాగతి స్తోత్రం చదవడం శుభకరం.

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చేయ పనుల యందుపూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు శ్రమ పెరుగుతుంది. మిత్రుల సహకారం మేలు చేస్తుంది. కొత్తవారితో స్నేహం వలన కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇంటా బయట గొడవలు గా ఉండును. సోదరులు తో మనస్పర్ధలు ఏర్పడవచ్చును. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారములు యందు ధన నష్టం ఏర్పడును. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మనస్సు నందు ఆందోళన. ధనాధాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.  శివపార్వతులను పూజించడం మంచిది. 

Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఇంట బయట కూడా కొద్దిగా ప్రతికూల వాతావరణ ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. పనిచేయు వారి తోటి కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి.సంఘము నందు వాదోపవాదాలుకుదూరంగా ఉండండి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు. తలపెట్టిన పనులు యందు ఆటంకాలు ఏర్పడతాయి.  ప్రయాణాల యందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం.బంధువుల తోటి కొద్దిపాటి కలహాలు.జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.

Zodiac Sign


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
అనుకోని కలహాలు తోటి మనసు చికాకులు గా ఉండుట ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. చెడు స్నేహితులను  దూరంగా ఉండాలి . చేయు వ్యాపారం నందు అభివృద్ధి సంబంధిత పనులలో ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటుంటారు . పట్టుదల తోటి చేయ పనులలో విజయం సాధిస్తారు . మనస్సునందు ఆందోళనగా ఉంటుంది .వృత్తి వ్యాపారాలు యందు అధిక శ్రమ.సంఘము నందు వివాదాలకు దూరంగా ఉండడం . పెద్దలు పట్ల గౌరవం గా . సమయానుకూలంగా  తెలివిగా ముందుకు . ప్రయాణాల యందు తగు జాగ్రత్త అవసరం. లక్ష్మీ ఆరాధన శుభప్రదం.

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మీ ప్రతిభకు  ప్రశంసలు లభిస్తాయి.  మీ ఆలోచనలను ఆచరణలో పెడతారు. విద్యార్థులు  అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలెను. తలచిన పనులలో విజయం సాధిస్తారు. ఇతరులతోటి వాదోపవాదములు వేయకండి ఇంకా బయట మీకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగమునందు పని వత్తడి ఎక్కువగా ఉండును. వృత్తి   వ్యాపారములు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించును.   లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈరోజు ఆనందంగా గడుపుతారు. సంఘంలో  గౌరవ కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు తప్పవు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. రావలసిన బాకీలు వసూలు అగును. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగును. ధనాన్ని వృద్ధి చేయు పథకాలను ఆలోచిస్తారు. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు లకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అగును.విందు వినోదాలలో పాల్గొంటారు.నూతన పరిచయాలు కలిసి వస్తాయి. ప్రయాణాలు అనుకూలం.  సూర్య ఆరాధన శుభప్రదం.

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
భావోద్వేగాలు తో చేసే పనులు కొత్త సమస్యలు ఏర్పడను. ఉద్యోగులు  ఎదురైన సమస్యలు పరిష్కరించుకుంటారు. నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు.  వృత్తి వ్యాపారములు సాధారణంగా ఉంటాయి. జీవిత భాగస్వామి తోటి కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చును. కొన్ని కీలకమైన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వస్తువుల యందు తగు జాగ్రత్త వహించవలెను. వాహన ప్రయాణాలు విషయంలో తగు జాగ్రత్త తీసుకొని వలెను .శ్రీఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొంటారు. ఆదాయం అంతగా కనిపించదు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది.  ఇతరుల యొక్క విషయాలలో జోక్యం చేసుకోవడం  కొత్త సమస్యలు ఏర్పడగలవు. వివాదాలకు దూరంగా ఉండండి. కోపంతో  కాకుండా ప్రశాంతంగా మీ యొక్క సమస్యలను  పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి.  బంధుమిత్రుల యొక్క కలయిక. ఉద్యోగం నందు కొద్దిపాటి ఒడిదుడుకులు ఇబ్బంది కలగచేస్తాయి. కొన్ని కీలక మైన సమస్యలను జీవిత భాగస్వామి యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.  సుబ్రహ్మణ్య స్వామి ధ్యానం శుభప్రదం.

click me!