వార ఫలాలు: ఓ రాశివారికి వారాంతంలో అనుకోని ధన లాభం

Published : Dec 25, 2022, 10:00 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం  వృత్తి వ్యాపారాలు యందు ధనలాభం కలుగుతుంది. వారాంతంలో ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండటం మంచిది. సమాజము నందు గౌరవం తగ్గును. మనసునందు అనేక ఆలోచనలు కలుగుతాయి. మిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడతాయి.

PREV
114
 వార ఫలాలు: ఓ రాశివారికి  వారాంతంలో అనుకోని ధన లాభం

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం

214
Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి  ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం

314
Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ వారం మీకు అన్ని విధాలా మేలు కలుగుతుంది.అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. గృహమునందు ప్రశాంతత వాతావరణ ఏర్పడుతుంది. ఉద్యోగమునందు అధికారులు ఒత్తిడిలు శ్రమ తగ్గి ప్రశాంతత లభిస్తుంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరిగి దాంపత్య జీవితం ఆనందంగా గడుస్తుంది. భూ గృహ క్రయ విక్రయాలు అనుకూలించను. అభివృద్ధి కార్యక్రమాలకు మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. సమాజము నందు ప్రతిభకు తగ్గ గౌరవం లభించును. సంతానం మూలంగా అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగును. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాలు యందు ధనలాభం కలుగుతుంది. వారాంతంలో ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండటం మంచిది. సమాజము నందు గౌరవం తగ్గును. మనసునందు అనేక ఆలోచనలు కలుగుతాయి. మిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడతాయి.

414
Zodiac Sign


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. మానసికంగా శారీరకంగా బలహీనపడతారు. సంతానం తోటి ప్రతికూలత వాతావరణ ఉద్యోగమునందు పని ఒత్తిడి పెరుగును అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి సమాజం నందు కీర్తి ప్రతిష్టలు తగ్గించును చేయి పనులయందు అలసత్వం వహిస్తారు వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి అనాలోచిత పనుల వలన ఇబ్బందులు కలుగును గృహం నందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను మీరంటే గిట్టని వారు తోటి దూరంగా ఉండటం మంచిది. దూరపు ప్రయాణాలు ఏర్పడవచ్చు. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. వారాంతంలో అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. సమాజములో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

514
Zodiac Sign


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కొన్ని విషయాలు బాధ కలిగించెను మానసికంగా వేదనకు గురి అవుతారు ఇతరులతోటి విరోధాలు ఏర్పడవచ్చు. అనుకోని కొన్ని కీలకమైన సమస్యలు ఏర్పడతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువుగా నుండును. సంతానం తోటి ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. గృహమునందు సమాజము నందు గౌరవం తగ్గుతుంది. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రావచ్చు. ఆస్తి వివాదాలు ఏర్పడతాయి. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడను. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరము. చేయు ఖర్చు యందు ఆచితూచి ఖర్చు చేయవలెను. వారాంతంలో తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. గృహము నందు ప్రశాంతత  వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగమునందు అధికారుల యొక్క సఖ్యత తోటి అధికారం కలుగును. జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు.

614
Zodiac Sign


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ వారం మీకు మంచి ఫలతాలు సూచిస్తున్నాయి. అన్ని విధాలా ఆర్థికంగా బలపడతారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.  శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు యందు ధనలాభం కలుగుతుంది. .ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహ నిర్మాణ పనులు ముందుకు సాగును. రావలసిన బకాయిలు చాకచక్యంగా వసూలు చేసుకోవాలి. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు.  కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి.  వారాంతంలో ఇతరులతోటి గొడవలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. శారీరక శ్రమ  పెరుగుతుంది. బలహీన పడవచ్చు. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త అవసరం. వచ్చిన అవకాశాలను అందుపుచ్చుకొనవలెను.

714
Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ వారం శుభవారం. గృహమనందు శుభకార్యాలు జరుగును.   శారీరకంగా మానసికంగా బలపడతారు. కుటుంబం నందు ఆహ్లాదకరమైన వాతావరణం. సమాజం నందు కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. తలచిన పనులు అనుకున్నది అనుకున్నట్లుగా సకాలంలో పూర్తవుతాయి. రావలసిన బాకీలు వసూలు అగును. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారం  పెట్టుబడులకు తగ్గ ధన లాభం కలుగుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు. దాంపత్య సంతోషం పొందుతారు. వారాంతంలో కొద్దిపాటి అనారోగ్యంగా ఉండుట. మానసిక ఉద్రేకతలు. కొన్ని వార్తలు వలన బాధ కలుగును. కొన్ని సంఘటనలు ఇబ్బందికరంగా మారుతాయి. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడను.

814
Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ వారం మీరు కొద్ది పాటి ధైర్యంతో సమస్యలను దాటుతారు. మానసికంగా బాధ భయంగా ఉండుట. చేయ పనుల యందు అలసత్వం పెరుగుతుంది. నిరాశ నిస్పృహలకు లోనవుతారు. వృత్తి వ్యాపారాలు యందు ధన నష్టం వాటిల్లుతుంది. ఉద్యోగమునందు అధికారులతోటి మనస్పర్ధలు ఏర్పడతాయి. వచ్చిన అవకాశాలు అందుపుచ్చుకొనవలెను. దీర్ఘకాలిక అనారోగ్యము ఇబ్బందిగా మారుతాయి.  వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబం నందు సమాజము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. అనాలోచితంగా పనుల వలన కొన్ని కొత్త సమస్యలు ఏర్పడవచ్చు.   ముఖ్యమైన వస్తువుల యందు జాగ్రత్త అవసరము. రుణ బాధలు పెరుగును. వారాంతంలో ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుడు యొక్క సహాయ సహకారాలు లభించును. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది.

914
Zodiac Sign


తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కపడుతున్నాయి.చేయ పనుల యందు  బుద్ధి కుశలత తగ్గును. మనసునందు అనేక ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. ఇతరులతోటి కలహాలు ఏర్పడుతాయి. మనసునందు భయంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు యందు ధననష్టం ఏర్పడను.   అనుకోని ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఊహించని అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. సమాజము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగమునందు పని ఒత్తిడి పెరుగుతుంది. వాహనం ప్రయాణాలయందు తగు జాగ్రత్త అవసరం. వారాంతంలో ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతోటి సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించును. నూతన వస్తూ వాహనాది కొనుగోలు చేస్తారు.

1014
Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ వారం శుభవారం.  తలపెట్టిన పనులు పనులలో విజయం సాధిస్తారు నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు మానసికంగా శారీరకంగా బలపడతారు చేయి పనులలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు సమాజము నందు సన్మానాలు బహుమానాలు అందుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశాలు ఫలించును కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉండును కీలకమైన సమస్యలు పరిష్కారమై ప్రశాంతత లభిస్తుంది వృత్తి వ్యాపారాలు యందు లాభసాటిగా జరుగుతాయి. భూ గృహ నిర్మాణ  క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. వివాహాది ప్రయత్నాలు ఫలించును. ఆర్థికంగా బలపడతారు. సమాజం నందు మృదువుగా మాట్లాడుతూ ఇతరులను ఆకట్టుకుంటారు. వారాంతంలో మనస్సు నందు అనేక విధములుగా బాధలుంటాయి. పనుల యందు బుద్ధి స్థిరత్వం లేకపోవడం వల్ల ఆటంకాలు ఏర్పడను.  నిరాశ. సమాజము నందు అవమానాలు జరుగవచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.

1114
Zodiac Sign

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ వారం కొద్దిపాటి జాగ్రత్తలతో సమస్యలు దాటచ్చు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. దీర్ఘకాలిక అనారోగ్యం వలన ఇబ్బందులుంటాయి. గృహమునందు సమాజము నందు గౌరవం తగ్గుతుంది. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.  అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. శారీరక శ్రమ పెరిగి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయిజరుగుతాయి. ఉద్యోగమునందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావచ్చు. అకారణంగా కలహాలు ఏర్పడును. వాహన ప్రయాణముల యందు జాగ్రత్త అవసరము. మానసికంగా బలహీనపడతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. వారాంతంలో అనుకూలమైన ఫలితాలు ఏర్పడును. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.

1214
Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ వారం మీకు అనుకూలమైన గ్రహ సంచారం జరుగుతోంది.  శారీరక శ్రమ తగ్గి సౌఖ్యం లభించును. సమాజం నందు ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది సన్మానాలు బహుమానాలు అందుకుంటారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మిత్రుల యొక్క ఆదరణ అభిమానాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. కుటుంబ అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. గృహము నందు శుభకార్యాచరణ. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగ అభివృద్ధి రుణ శత్రు బాధలు తీరి ప్రశాంతత లభిస్తుంది. తలపెట్టిన కార్యాలలో విజయం లభిస్తుంది. వివాహాది ప్రయత్నాలు ఫలించును కీలకమైన సమస్యలలో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వారాంతంలో ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మనస్సునందు అనేక విధములుగా ఆలోచనలతోటి చికాకుగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. పనులలో ఆటంకాలు ఏర్పడను.

1314
Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గృహమునందు సమాజము నందు అవమానాలు ఏర్పడుతాయి. మనసు నందు ఉద్రేకంగా ఉండును. ఇతర యందు అనసూయ  ద్వేషాలు ఏర్పడతాయి. మిత్రులతోటి మనస్పర్ధలు రావచ్చును. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనులలో పట్టుదలతో పూర్తి చేయాలి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను రుణ శత్రు బాధలు పెరుగుతాయి ఇతరులతోటి కలహాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మానసికంగా శారీరకంగా బలహీనపడతారు. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి. వారాంతంలో అనుకోని ధన లాభం కలుగుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం కలుగును.

1414
Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4): 

ఈ వారం మీకు అన్ని విధాలా అనుకూలమైనది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు ధన లాభం కలుగుతుంది. ఉద్యోగమునందు పని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభించును. మనస్సునందు ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. చేయు పనులలో కుశాగ్ర బుద్ధి ఉపయోగించి పనులు చక్కబెట్టుకుంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజము నందు ప్రతిభ తగ్గ గౌరవం లభించును .ఆర్థిక అభివృద్ధి కలుగును. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. బంధం బంధువర్గంలో మీయొక్క మాటకు విలువ పెరుగుతుంది. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన బాకీలు వసూలు అగును. వారాంతంలో ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వలెను. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ప్రయాణాలు ఏర్పడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories