Your Weekly Horoscopes: ఓ రాశి ప్రయాణంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాదాలు పొంచి ఉన్నాయి

First Published | Dec 24, 2023, 9:30 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ వారం  వారాంతంలో అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు.

Weekly Horoscope

వార ఫలాలు :24  డిసెంబర్  2023 నుంచి 30  డిసెంబర్ 2023 వరకూ
 
 

  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ  వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ  వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
వారం ప్రారంభంలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్న ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు రాగలవు. ఒక వ్యక్తి వలన మీకు సమాజంలో ఇబ్బందికర పరిస్థితులు రాగలవు. తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేయాలి. కుటుంబ సమస్యలు రాగలవు. అనుకున్నది జరగకపోవడం వల్ల మానసిక అశాంతి ఏర్పడుతుంది. వారం మధ్యలో నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని విధాలా శ్రేయస్కరం గా ఉంటుంది. వారాంతంలో అవసరానికి తగిన డబ్బులు అందక ఇబ్బంది పడవలసి వస్తుంది.


telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

ఈ రాశి వారికి తృతీయాధిపతి ఈ వారం అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం పొందగలరు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. సంఘంలో ఉన్నత స్థితి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వారం మధ్యలో ధన స్థానంలో సంచారం చేత చిన్నపాటి ఆర్థిక సమస్యలు రాగలవు. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తిగా గలవు. భూ గృహ క్రయ విక్రయాలు వారం చివర్లో పూర్తి కాగలవు. సహచరుల వలన అపకారం జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలి. దగ్గర బంధువులతో అకారణ కలహాలు రాగలవు. వారాంతంలో అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు.
 

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

ఈ రాశి వారి ధనాధిపతి చంద్రుడు సంచారం వలన మిశ్రమ ఫలితాలను పొందగలరు . ఆదాయానికి లోటు లేకున్నా అవసరానికి రుణము చేయవలసి వస్తుంది. కొన్ని విషయాల్లో సంమయనం పాటించడం మంచిది. వాహనాలు ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారులు వచ్చిన లాభాలతో సరిపెట్టుకోవడం సంతృప్తి పడడం మంచిది. ఉద్యోగులకు  బాధ్యతలు పెరుగుతాయి. వారం మధ్యలో అనుకూలమైన ఫలితాలు లభించగలవు. సంతోషకరమైన శుభవార్త వింటారు. బహుమానాలు అందుకుంటారు. వారాంతంలో వృధా ఖర్చులు పెరుగును. ఆరోగ్య సమస్యలు.
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2

ఈ రాశి వారి జన్మ రాశ్యాధిపతి చంద్రుడు ఈ వారం అనుకూలమైన సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. ధనధాన్యాది లాభాలు. అభివృద్ధికి సంబంధించిన విషయాలు అమలు చేస్తారు. ఏ పని తలపెట్టిన అవలీలగా పూర్తి చేస్తారు. అధికార వర్గం తో సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగును. గత కొద్ది కాలంగా ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. మీ ఆశయం నెరవేరుతుంది. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వారం మధ్యలో కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. జంతువులతో అపకారం జరిగే ప్రమాదం ఉన్నది. వారాంతంలో శారీరక  మానసిక ఆనందం పొందుతారు. ఆలోచన విధానాలు అన్ని రకాలుగా కలిసి వస్తాయి.

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1

ఈ రాశి వారి వ్యయాధిపతి చంద్రుడు ఈ వారం రాజ్యస్థానం సంచారం ఈ సంచారం లాభ ప్రదమైనది. సత్ప్రవర్తన కలిగి ఉంటారు నూతన ప్రయత్నాలు ఫలించును. వ్యవహారాలలో సానుకూలత వాతావరణం. విద్యార్థులకు విద్యా విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మనోబలం పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో లాభ స్థానంలో సంచారం వలన మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. వారాంతంలో వ్యయ స్థానంలో సంచారం చేత బద్దకంగా ఉండటం. మానసిక బాధలు పెరుగును.

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5

ఈ రాశి వారి లాభాధిపతి చంద్రుడు ఈ వారం భాగ్య స్థానంలో సంచారం ఈ సంచారం వారం ప్రారంభంలో అనారోగ్య సమస్యలు సంతానం తోటి వైరము రాగలవు. ఇతరులతో ఆ కారణంగా విరోధాలు ఏర్పడతాయి. శారీరక శ్రమ పెరిగి బలహీనత గా ఉండును. వారం మధ్యలో రాజ్యస్థానం లో సంచారం చేత ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగాల్లో అధికారుల ఆదర అభిమానం పొందగలరు. దైవ పుణ్య కార్యక్రమం ద్వారా ధనాన్ని ఖర్చు చేస్తారు. విదేశీ ప్రయాణం మరియు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు యోగవంతంగా ఉండును. వారాంతంలో నూతన ప్రయత్నాలు ఫలించును వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండును.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

ఈ రాశి వారి రాజ్యాధిపతి  చంద్రుడు అష్టమ భాగ్య స్థానంలో సంచారం వలన వారం ప్రారంభం నుంచి ఐదు రోజుల పాటు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఇష్టం లేని భోజనం చేయవలసి వస్తుంది. చేయి వ్యవహారాలలో తగిన ప్రణాళిక రూపొందించుకొని వ్యవహరించి నట్లయితే వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి కాగలవు. వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. శారీరకంగా మానసికంగా బలహీన ముగా నుండును. వృత్తి వ్యాపారాల్లో మౌనము మరియు నిదానం వహించడం వలన లాభాలు పొందగలరు. వారాంతంలో అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తారు. ఉద్యోగాల్లో అధికార వృద్ధి. విద్యార్థులకు అనుకూలం.

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ రాశి వారి భాగ్యాధిపతి  చంద్రుడు ఈ వారం కళత్ర స్థానంలో సంచారం అనుకూలమైనది. ఈ సంచారం వలన వారం ప్రారంభంలో నిలిచిన కార్యములన్ని పూర్తిగా కలవు. వివాహ ప్రయత్నములు నెరవేరును. కుటుంబము నందు శుభ పుణ్య దైవ కార్యక్రమాలు జరుగును. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేయి ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో గత వారం కంటే ధనాదాయ మార్గాలు బాగుంటాయి. వారం మధ్య నుండి వారాంతం వరకు కూడా ప్రతికూలంగా ఉంటుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రావలసిన బాకీలు లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ప్రయాణాలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దూరపు బంధువుల తో మనస్పర్థలు రాగలవు
 

telugu astrology

ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ రాశి వారి అష్టమాధిపతి చంద్రుడు ఈవారం షష్ఠమ సప్తమ స్థానం లో ఈ సంచారం ఈ వారం అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలుగుతారు. ఆధ్యాత్మిక దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొంతకాలంగా ఆగిన పనులు పూర్తి కాగలవు. భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. పలు విధాలుగా ధన లాభం పొందుతారు. ఉద్యోగాలలో అనుకూలమైన వాతావరణం. మీ మీద ఉన్న విమర్శలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును.శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానానికి సంబంధించిన విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖుల తో పరిచయాలు. వారాంతంలో అష్టమ స్థానంలో సంచారం వలన ప్రతికూల ఫలితాలు రాగలవు. ఆకస్మత పరిణామాలు వలన మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది.
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ రాశి వారి కళత్రాధిపతి  చంద్రుడు ఈ వారం ప్రారంభంలో పంచమ స్థానమునందు సంచారం వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది. అనుకున్న పనులలో ఆటంకాలు ఏర్పడి మానసిక శారీరక ఇబ్బందులకు గురి అవుతారు. అనారోగ్య సమస్యలు. వారం మధ్య నుండి వారం చివర వరకు అనుకూలమైన ఫలితాలు పొందగలరు. జీవిత భాగస్వామి తోట ఆనందంగా గడుపుతారు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడిన చివరకు శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆగిన ఆర్థిక సంబంధమైన లావాదేవీలు పూర్తి కాగలవు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. శారీరక మానసిక మరియు స్త్రీ సౌఖ్యం పొందగలరు.
 

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ రాశి వారి షష్ఠమాధిపతి చంద్రుడు ఈవారం చతుర్ద పంచమ షష్ట స్థానాలలో సంచారము ఈ సంచారం వలన వారం ప్రారంభంలో మరియు వారం మధ్యలో కూడా ఇబ్బందులు కలుగుతాయి.  మనః చాంచల్యము.ఇతరులతో మరియు ఉద్యోగాల్లో అధికారులతో  అకారణంగా విరోధాలు రాగలవు. అనారోగ్య సమస్యల వలన ఔషధ సేవ చేయవలసి వస్తుంది. శారీరక శ్రమ పెరిగి బలహీనంగా నిరోత్సాహముగా ఉంటారు. రోజు చేసే పనులలో ఆటంకాలు ఏర్పడును. వారాంతంలో గృహ నిర్మాణ పనులు ముందుకు సాగును. కుటుంబానికి సంబంధించిన విషయాలు లో కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ రాశి వారి పంచమాధిపతి  చంద్రుడు ఈవారం తృతీయ పంచమ స్థానాలలో సంచారము. వారం ప్రారంభంలో అనుకూలమైన ఫలితాలు పొందగలరు. తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి కాగలవు. గృహ నికి సంబంధించిన అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. అందరితో సఖ్యతగా ఉంటూ వ్యవహారాలని పూర్తి చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సంతాన అభివృద్ధి విషయాలలో ఒక శుభవార్త వింటారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వారం మధ్యలో నుండి ప్రతికూల ఫలితాలు రాగలవు. వాదోపవాదములకు దూరం గా ఉండాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించాలి. వృత్తి వ్యాపారంలో సామాన్యంగా ఉంటాయి. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడిను.
 

Latest Videos

click me!