వారఫలాలు: ఓ రాశి వారికి భూ గృహ క్రయ విక్రయాల కలిసి వస్తాయి

First Published Oct 1, 2023, 10:00 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం ఆర్థిక , కుటుంబ విషయాలలో అభివృద్ధి కనబడుతుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు.వారాంతం లో  తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు రాగలవు. 

daily horoscope 2023 New 05


వార ఫలాలు :1-10-2023 to 7-10-2023 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ... ఈ వారం  రాశి ఫలాలు లో తెలుసుకుందాం

telugu astrology

మేషం(అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక1)
నామనక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ వారం చతుర్దాది పతి అయిన చంద్రుడు జన్మ రాశి లో మరియు తృతీయ స్థానము లో సంచారం. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు. జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. వాగ్దానాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఆలోచించి వాగ్దానాలు చేయాలి. ఇష్టమైన ప్రయాణాలు చేస్తారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. పలురకాల మార్గాలు ద్వారా ఆదాయం లభించును. సమాజం లో మంచి వారు అనిపించుకుంటారు. భూ గృహ క్రయ విక్రయాల కలిసి వస్తాయి. తలపెట్టిన కార్యాలలో మిత్రుల సహాయ సహకారాల తో పూర్తి చేయగలుగుతారు . ఆర్థిక , కుటుంబ విషయాలలో అభివృద్ధి కనబడుతుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు.వారాంతం లో  తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు రాగలవు. వ్యవహారాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించాలి.

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

ఈ రాశి వారికి ఈ వారం తృతీయాధిపతి అయిన చంద్రుడు వ్యయస్థానం మరియు ధన స్థానము లో సంచారం. ఈ సంచారము వ్యతిరేక ఫలితాలు కలుగును. స్థిరాస్తి విషయంలో అన్నదమ్ముల తో మనస్పర్ధలు రాగలవు. ఉద్యోగాలలో అధికారులతో విభేదాలు రావచ్చు. వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త అవసరము.ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. సమాజములో ప్రతికూలత వాతావరణ. కొన్ని సందర్భాల్లో మిత్రుల వలన నష్టము కలగవచ్చు. ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు. చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మానసిక ఆందోళన పెరుగును. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించాలి.వారాంతం లో  శరీర సౌఖ్యం లభిస్తుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అన్ని రంగాలు వారు అభివృద్ధి చెందుతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రములు
(కా-కి-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఈ రాశి వారికి ఈ వారం ధనాధిపతి అయిన చంద్రుడు లాభ స్థానము మరియు జన్మరాశి  లో   సంచారము. ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందుతారు. ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన వస్తు వాహన కొనుగోలు చేస్తారు. భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. రుణ బాధలు తీరును. అప్రయత్నముగా ధన లాభం పొందగలరు. మంచి మాట తీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఉద్యోగాల్లో మీ యొక్క సామార్థ్యాన్ని చూపిస్తారు. కుటుంబ సమస్యల తీరి ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.ఆరోగ్యం సమకూరి ప్రశాంతత లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం కలుగుతుంది. ఉద్యోగాలలో అధికారుల అభిమానాలు పొందగలరు. అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు.వారాంతం లో అనవసరమైన ఖర్చులు పెరుగును. అనారోగ్య సమస్యలు రాగలవు. సమాజం లో అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును.

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రములు (హీ-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2

ఈ రాశి వారికి జన్మరాశ్యాధి పతి అయిన చంద్రుడు ఈ వారం రాజ్యస్థానము  మరియు వ్యయస్థానములో  సంచారం. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. శారీరక పటుత్వం మరియు సౌఖ్యం లభించును. మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. కీలకమైన సమస్యలు పరిష్కారమగును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును.సమాజంలో ఉన్న అపవాదములు తొలగి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. విదేశీ ప్రయాణాలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరమైన ఖర్చుల యందు జాగ్రత్త వహించాలి .ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.కోర్టు సమస్యలు అనుకూలంగా ఉండును.అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు. కుటుంబము నందు సంతోషకరమైన వాతావరణం. ఉద్యోగమునందు అధికారవృద్ధి పొందగలరు.వారాంతం లో మానసికంగా భయాందోళన గా ఉంటుంది. చేయు పనులలో బుద్ధి కుశలత తగ్గును. తలపెట్టిన కార్యాలలో ప్రతిబంధకాలు ఏర్పడగలవు.

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రములు (మా-మీ-మూ-మే-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1

వ్యయాధిపతి అయిన చంద్రుడు భాగ్యస్థానం మరియు లాభ స్థానము లో సంచారం. ఈ సంచారం వలన మిశ్రమ ఫలితాలు కలుగును. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసిక చింతన పెరుగును. సమాజములో అవమానాలు కలగకుండా చూసుకోవాలి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి.వృథా ఖర్చులు అదుపు చేయాలి. వృత్తి వ్యాపారములలో ఆదాయం స్థిరంగా ఉండును. ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా మెలగవలెను.ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరము.శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. అభివృద్ధి కార్యక్రమాలకు గూర్చి ఆలోచనలు చేస్తారు. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వారాంతం లో  స్త్రీ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలించును. వృత్తి వ్యాపారాలలో ధనలాభం పొందగలరు.

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రములు (టో-పా-పి-పూ-షం-ణా-ఢ-పే-పో)
అదృష్ట సంఖ్య॥ 5
లాభాధిపతి అయిన చంద్రుడు అష్టమ స్థానము  మరియు రాజ్యస్థానము లో  సంచారం. ఈ సంచారం వలన ప్రతికూల ఫలితాలు కలుగును.ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.పై అధికారులతో  సమస్యలు ఏర్పడగలవు . ఇతరులతో మాట్లాడేటప్పుడు  జాగ్రత్తగా మాట్లాడాలి . ఇబ్బందులను ఎదుర్కొంటారు . కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు బాధ్యతలు పెరుగుతాయి. చేయు పనులలో శ్రమ అధికంగా ఉండును.ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు రాగలవు. పరామర్శ చేయవలసి వస్తుంది. మానసిక ఆవేదన వ్యక్తం చేస్తారు. ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.వారాంతం లో  ఉద్యోగాలు లో అధికార అభివృద్ధి కలుగును. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అగును.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రములు (రా-రి-రూ-రే-రో-త-తీ-తూ-తే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6

ఈ రాశి వారికి ఈవారం రాజ్యాధిపతి అయిన చంద్రుడు కళత్ర స్థానము  మరియు  భాగ్యస్థానం లో సంచారం. ఈ సంచారం వలన మంచి శుభ ఫలితాలు పొందుతారు.చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి అగును. నూతన  వ్యాపార ఆలోచనలు చేస్తారు. ఆదాయం మార్గాలు బాగుంటాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దల సహకారంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తారు. వివాహాది శుభకార్యాలు లో పాల్గొంటారు. సంతాన విషయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటారు వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం పొందగలరు. చేపట్టిన కార్యాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.వారాంతం లో  శారీరక పీడ. అనవసరమైన ఖర్చులు పెరుగును. చేయు పనులలో అలసత్వం పెరుగుతుంది. మానసిక భయాందోళన.
 

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రములు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9

ఈ రాశి వారికి ఈ వారం భాగ్యాధిపతి అయిన చంద్రుడు శత్రు స్థానం మరియు ఆయుః స్థానం లో సంచారము. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. గత కొద్దిరోజులుగా ఉన్న అనారోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. తలపెట్టిన పనులు సజావుగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారుల యొక్క గౌరవం లభించును.రావలసిన బాకీలు వసూలు అగును. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఆర్థికంగా బాగుంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో పనులు సజావుగా పూర్తి చేయగలుగుతారు.వారాంతం లో  మానసిక ఉద్రేకతలు పెరుగును. ఆకస్మిక పరిణామాలు ఎదురవుతాయి. ఇతరులతోటి వాదోపవాదమునలకు దూరంగా ఉండటం మంచిది.
 

telugu astrology


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు
(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈ రాశి వారికి ఈవారం అష్టమాధిపతి అయిన చంద్రుడు పంచమ స్థానము  మరియు కళత్ర స్థానము లో సంచారము. ఈ సంచారము వలన వ్యతిరేక ఫలితాలు రాగలవు. మానసికంగా భయంగా ఉండుట. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదురౌతాయి. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉండును. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో చికాకులు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు రాగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉండును. వ్యవహారాలు స్తంభించును.బంధుమిత్రులతో  మాటపట్టింపులు రాగలవు. ఉద్యోగాలలో అధికారులతో కలహాలు రాగలవు.చేయు కార్యాలలో నిరాశ స్పృహలకు గురి అవుతారు. సమాజము నందు అవమానాలు కలగవచ్చు. వ్యవహారమంతా తికమకగా ఉండును.వారాంతం లో  సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. శరీర సౌఖ్యం లభిస్తుంది. కుటుంబ సమస్యల తీరి ప్రశాంతత లభిస్తుంది.సంతోషకరమైన ప్రయాణాలు చేస్తారు. వ్యాపారము లో ధన లాభం పొందగలరు.

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ రాశి వారికి ఈవారం కళత్రాధిపతి అయిన చంద్రుడు చతుర్థ స్థానము మరియు శత్రు స్థానం లో సంచారం.ఈ సంచారం వలన అనేక ఇబ్బందులు కలుగును. భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు రాగలవు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడను. వ్యాపార భాగస్వామ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాద వివాదాలకు దూరంగా ఉండవలెను. కాంట్రాక్టులు అగ్రిమెంట్లు విషయాలలో తగు జాగ్రత్త అవసరము. మానసికంగా భయాందోళన గా ఉంటుంది. చేయు పనులలో బుద్ధి కుశలత తగ్గును. తలపెట్టిన కార్యాలలో ప్రతిబంధకాలు ఏర్పడగలవు. కుటుంబంలో పెద్దవారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. వారాంతం లో  వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8

ఈ వారం షష్ఠమాధిపతి అయిన చంద్రుడు తృతీయ స్థానము  మరియు పంచమస్థానం లో సంచరించును. ఈ సంచారం వలన అనుకూల శుభ ఫలితాలు పొందగలరు. నూతన వస్తు ఆభరణాలు లభించును. తలపెట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారుల యొక్క గౌరవం లభించును.రావలసిన బాకీలు వసూలు అగును.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ఆర్థికాభివృద్ధి చేకూరుతుంది .కోర్టు కేసులు అనుకూలంగా ఉండును.మానసిక ప్రశాంతత లభిస్తుంది. అన్ని విధాల ప్రయోజనకరంగా ఉంటుంది. ధైర్య సాహసాలతో కీలకమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. శత్రువులపై పై చేయి సాధిస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.భూ గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.వారాంతం లో అనవసరమైన ఖర్చులు చేయవలసిన వస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగించును.అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3

ఈవారం పంచమాధిపతి అయిన చంద్రుడు ధన స్థానము  మరియు మాతృ స్థానము లో చంద్రసంచారం.ఈ సంచారము వలన కొద్దిపాటి ఇబ్బందులు కలుగును. అనవసరమైన ఖర్చులు పెరుగును. అనారోగ్య సమస్యలు రాగలవు.అనవసరమైన విషయాలలో దూరంగా ఉండడం మంచిది. బంధు మిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. చేయు పనులలో శ్రమాదికంగా ఉంటుంది. అనవసరమైన ఆలోచనలు కలుగును .కీలకమైన సమస్యలను కుటుంబసభ్యులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సమాజం నందు అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు పుట్టించును. పొదుపు చేసిన ధనాన్ని తీసి ఖర్చు చేయవలసి వస్తుంది. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అకారణంగా అన్నదమ్ముల తో మనస్పర్ధలు రాగలవు.వారాంతం లో  అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతోటి అకారణంగా విరోధాలు రాగలవు.
 

click me!