మాసఫలాలు: ఓ రాశి వారికి ప్రముఖుల తో పరిచయాలు,వాహన ప్రమాదాలు

First Published | Oct 1, 2023, 8:00 AM IST

ఈ అక్టోబర్ నెల రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ నెల పనులలో  శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో అనవసరపు విరోధాలు ఏర్పడవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. విద్యార్థులు పట్టుదల తోటి చదవాలి .ఆర్థిక సమస్యలు రాగలవు.

daily horoscope 2023 New 10

మాసఫలాలు:  01 అక్టోబర్ 2023 నుండి 31 అక్టోబర్ 2023 వరకూ
  జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
 
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ  మాసం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ... ఈ మాసం  రాశి ఫలాలు లో తెలుసుకుందాం

(కర్కాటక వృశ్చిక మకర కుంభ మీన  రాశులు వారికి అష్టమ అర్దాష్టమ మరియు ఏలినాటి శని జరుగుతున్నది. కావున ప్రతినిత్యం ఈ  శ్లోకమను  11 సార్లు  లేదా శని స్తోత్రం లేదా అష్టోత్రము గాని పారాయణ చేయుట మంచిది.)

శ్లో॥ కోణస్థ పింగళో బభ్రు కృష్ణో  రౌద్రాంతకోయమః ।
సౌరి శనైశ్చరో మందః పిప్పలాదిషు సంస్థితః॥

telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రములు
(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
జన్మ అష్టమాధిపతి అయిన కుజుడు కళత్ర స్థానము నందు సంచారము .ఈ సంచారము ఇబ్బందులు ఎదురవుతాయి.భార్యతో సఖ్యత గా ఉండవలెను. మనస్పర్ధలు మరియు కలహాలు రాగలవు జాగ్రత్త అవసరం. సమాజము నందు సంభాషణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను.

ద్వితీయ సప్తమాధిపతి ఆయన శుక్రుడు పంచమ స్థానమునందు సంచారం. ఈ సంచారం వలన శుభ ఫలితాలు చేకూరును. సమాజంలో ప్రముఖుల తో పరిచయాలు కలసి వస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. సోదర సోదరి మధ్య ఆస్తి వివాదాలు తలెత్తవచ్చు. అకారణంగా కోపావేశానికి లోనవుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.

అశ్విని నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు. ఊహించని ఇబ్బందులు ఎదురవగలవు. శారీరక మానసిక బలహీనత. అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

భరణి నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు .వాద వివాదాలకు దూరంగా ఉండాలి. తలపెట్టిన పనులలో చిన్నపాటి ఆటంకాలు వచ్చినా చివరకు పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కృత్తిక  నక్షత్రం వారికి మాసాధిపతి శని. పనులలో  శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో అనవసరపు విరోధాలు ఏర్పడవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. విద్యార్థులు పట్టుదల తోటి చదవాలి .ఆర్థిక సమస్యలు రాగలవు.
 

Latest Videos


telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రములు
(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు  శత్రు స్థానము నందు సంచారము .ఈ సంచారం.వలన శుభ ఫలితాలు పొందగలరు. సంఘమనందు కీర్తి ప్రతిష్టలు పెరుగును. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారమ నందు ధన లాభం లభిస్తుంది.

జన్మ షష్టమాధిపతి అయిన శుక్రుడు చతుర్ధ స్థానములో సంచారము. ఈ సంచారం అనుకూలమైన ఫలితాలు పొందగలరు.బందు మిత్రులతోటి కలిసి ఆనందంగా గడుపుతారు. శారీరకంగా మానసికంగా బలపడతారు. వ్యవహారాలలో సమయానుకూల సరైన నిర్ణయాలు తీసుకుంటారు.ఉద్యోగం నందు అభివృద్ధి కనబడును. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.ఆదాయ మార్గాలు అన్వేషణ ఫలిస్తాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు శుభవార్త వింటారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధన లాభం కలుగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.

కృత్తిక నక్షత్రం వారికి మాసాధిపతి శని. పనులలో  శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో అనవసరపు విరోధాలు ఏర్పడవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. విద్యార్థులు పట్టుదల తోటి చదవాలి .ఆర్థిక సమస్యలు రాగలవు.

రోహిణి నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు .కోపావేశాలు అదుపు చేసుకుని వ్యవహరించవలెను. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. తలపెట్టిన పనులు మధ్యలో నిలిచిపోవును. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము.

మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు.ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం చేకూరుతుంది. వ్యవహారాలలో బుద్ధి కుశలత పెరుగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రములు
(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:- 3-5-6
అనుకూలమైన వారములు॥ ఋధ -శుక్ర

షష్ఠమ లాభాధిపతి అయిన కుజుడు పంచమ స్థానము నందు సంచారము. ఈ సంచారం వలన వ్యతిరేక ఫలితాలు కలుగును.చేయురాని పనులు యందు ఆసక్తి చూపుతారు. సంతానముతోటి సఖ్యతగా ఉండవలెను

పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు తృతీయ స్థానంలో సంచారం. ఈ సంచారం వలన కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కలుగును.అనవసరపు ఖర్చులు అధికంగా ఉండును. వ్యాపారంలో ధన నష్టం రాకుండా జాగ్రత్త వహించవలెను. అపకారం చేసేవాళ్లు పెరుగుతారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయిమానసికంగా శారీరకంగా బలపడతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగును. కుటుంబం నందు అనుకూలమైన వాతావరణం. ప్రయత్నించిన పనులన్నీ సకాలంలో పూర్తగును. మధ్యవర్తిత్వ ములకు దూరంగా ఉండవలెను. పెట్టుబడి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు.  ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం చేకూరుతుంది. వ్యవహారాలలో బుద్ధి కుశలత పెరుగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు.

ఆరుద్ర నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు. సంతాన మూలక ఆనందం కలుగును. గృహములో  శుభకార్యాలు జరుగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును.

పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలను పొందవచ్చు. ధైర్య సాహసాలతో  అన్ని పనులు సాధిస్తారు. ఆదాయ మార్గాలు బాగుండును. బంధుమిత్రల సహాయ సహకారాలు లభిస్తాయి.
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రములు
(హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

పంచమ రాజ్యాధిపతి అయిన కుజుడు చతుర్ధ స్థానములో సంచారం. ఈ సంచారము వలన వ్యతిరేక ఫలితాలు రాగలవు.అకారణంగా బంధు వర్గముతో విరోధాలు రాగలవు. వ్యాపార నిమిత్తం తెచ్చుకున్న వస్తువులు చెడిపోవడం.

చతుర్ధ లాభాధిపతి అయిన శుక్రుడు ధనస్థానంలో సంచారము. ఈ సంచారము వలన శుభ ఫలితాలు లభిస్తాయి.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు.కుటుంబ అభివృద్ధి ఆనందం కలుగజేస్తుంది. సన్మానాలు బహుమానాలు పొందుతారు. నూతన వస్తు వాహన వస్త్రాది కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలించును. ఎంతటి కష్టమైన పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగును. వివాహది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు.

పునర్వసు నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలను పొందవచ్చు. ధైర్య సాహసాలతో  అన్ని పనులు సాధిస్తారు. ఆదాయ మార్గాలు బాగుండును. బంధుమిత్రల సహాయ సహకారాలు లభిస్తాయి.

పుష్యమి నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు. సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండును. శారీరక సుఖం లభిస్తుంది.

ఆశ్రేష నక్షత్రం వారికి మాసాధిపతి రవి. చిన్న పని చేతనే శరీరం అలసిపోవడం. అధికారులతో విరోధాలు,బంధు మిత్రులతో బేధాభిప్రాయాలు రావడం. తొందరపాటు పనులలో ఆటంకాలు. అనారోగ్య సమస్యలు రాగలవు.

telugu astrology

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రములు
(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన తేదీలు:-1-2-4-7
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ

చతుర్ధ నవమాధిపతి అయిన కుజుడు  తృతీయ స్థానం నందు సంచారం. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు.కీలకమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొంతకాలముగా ఉన్న అనారోగ్య సమస్యలు తీరి ఉపసమనం పొందగలరు.

తృతీయ లాభాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో సంచారము. ఈ వలన శుభ ఫలితాలు కలుగును.మానసిక ప్రశాంతత లభించును. ప్రయత్నించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధన లాభం చేకూరుతుంది. ఇతరుల విషయాలలో దూరంగా ఉండవలెను. కుటుంబ సభ్యుల తోటి ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభించును. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. నూతన వస్తు వస్త్ర ఆభరణాలు లభించును. విలాసవంతమైన జీవితం గడుపుతారు.ప్రయత్నించిన కార్యాలలో కార్యసిద్ధి లభిస్తుంది. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఉద్యోగమునందు అధికార వృద్ధి కలుగును.నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా బలపడతారు. మానసికంగా ఆనందంగా గడుపుతారు. సమాజం నందు కొద్దిపాటి అపవాదములు రాగలవు.

మఘ నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు. ఊహించని ఇబ్బందులు ఎదురవగలవు. శారీరక మానసిక బలహీనత. అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

పుబ్బ నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు. వాద వివాదాలకు దూరంగా ఉండాలి. తలపెట్టిన పనులలో చిన్నపాటి ఆటంకాలు వచ్చినా చివరకు పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఉత్తర నక్షత్రం వారికి మాసాధిపతి శని. పనులలో  శ్రమ అధికంగా ఉంటుంది ఇతరులతో అనవసరపు విరోధాలు ఏర్పడవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. విద్యార్థులు పట్టుదల తోటి చదవాలి. ఆర్థిక సమస్యలు రాగలవు.

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రములు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన తేదీలు:-3-5-6
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం

తృతీయ అష్టమాధిపతి అయిన కుజుడు ధనస్థానము నందు సంచారం. వలన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి.చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. మానసిక భయాందోళనగా ఉంటుంది .తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి ఆగిపోవును. శారీరకంగా బలహీనతగా ఉంటుంది .

ద్వితీయ నవమాధిపతి అయిన శుక్రుడు లాభ స్థానం నందు సంచారము. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగును. కుటుంబము నందు ప్రశాంతమైన వాతావరణము. మానసిక ప్రశాంతత శారీరక సౌఖ్యం పొందగలరు. కీలకమైన సమస్యలను నిర్భయముగా ఎదుర్కొంటారు.
ఆదాయానికి మించి ఖర్చులు చేయవలసి వస్తుంది. దుష్ట సావాసాలు పెరుగును.వ్యాపారము నందు ధన నష్టం వాటిల్లవచ్చు. అనుకోని తగాదాలు వివాదాల వలన మనస్సునందు చిరాకుగా ఉంటుంది. ముఖ్యమైన వస్తువుల జాగ్రత్త అవసరము. వాహన ప్రయాణాల యందు జాగ్రత్తలు తీసుకోవాలి.జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా మెలగవలెను. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు.

ఉత్తర నక్షత్రం వారికి మాసాధిపతి శని. పనులలో  శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో అనవసరపు విరోధాలు ఏర్పడవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. విద్యార్థులు పట్టుదల తోటి చదవాలి. ఆర్థిక సమస్యలు రాగలవు.


హస్త నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు. కోపావేశాలు అదుపు చేసుకుని వ్యవహరించవలెను. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. తలపెట్టిన పనులు మధ్యలో నిలిచిపోవును. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము.

చిత్త నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు.ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం చేకూరుతుంది. వ్యవహారాలలో బుద్ధి కుశలత పెరుగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు.
 

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రములు
(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర

ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో సంచారము .ఈ సంచారం వలన వ్యతిరేక ఫలితాలు రాగలవు.రక్త సంబంధిత అనారోగ్య సమస్యలు రావచ్చు. బంధు వర్గం తోటి విరోధాలు ,అకారణంగా కలహాలు రాగలవు. తలపెట్టిన పనులలో ప్రతిభందకాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు డునుపెరుగును.

జన్మ అష్ఠమాధిపతి అయిన శుక్రుడు లాభ స్థానం నందు సంచారము. ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగును.వృత్తి వ్యాపారము నందు కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించడం కష్టంగా ఉంటుంది. ఉద్యోగము నందు అధికారుల తోటి నిరాదరణ మరియు సమస్యలు ఏర్పడగలవు. శారీరక శ్రమ పెరుగుతుంది. తలపెట్టిన పనులు నెలాఖరులో పూర్తవుతాయి .విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక సమస్యలు ఏర్పడగలవు.

చిత్త నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు.ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం చేకూరుతుంది. వ్యవహారాలలో బుద్ధి కుశలత పెరుగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు.

స్వాతి నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు .సంతాన మూలక ఆనందం కలుగును. గృహములో  శుభకార్యాలు జరుగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును.

విశాఖ నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు .ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలను పొందవచ్చు. ధైర్య సాహసాలతో  అన్ని పనులు సాధిస్తారు. ఆదాయ మార్గాలు బాగుండును. బంధుమిత్రల సహాయ సహకారాలు లభిస్తాయి.
 

telugu astrology


వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రములు
(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ మంగళ-గురు -శుక్ర

జన్మ షష్టమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానమునందు సంచారము. ఈ సంచారము వలన
వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరము. అకారణంగా బంధు వర్గముతో విరోధాలు రాగలవు. వృధా ఖర్చులు పెరుగును. సంఘము నందు అవమానాలు కలగవచ్చు.

వ్యయ సప్తమాధిపతి అయిన శుక్రుడు  రాజ్యస్థానము నందు సంచారం. ఈ సంచారం వలన ఇబ్బందులు కలుగును. మిత్రుల తోటి అకారణంగా కలహాలు రాగలవు. వృత్తి వ్యాపారాల యందు ధన నష్టం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఒక విషయం వలన మానసక ఆందోళన పెరుగును. శారీరక కష్టం పెరిగి బలహీనముగా నుండును. జీవిత భాగస్వామి తోటి మనస్పర్ధలు రాగలవు.ఆరోగ్యం బాగుంటుంది.సంఘము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.సంతాన వృద్ధి ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. శారీరకంగా కొంత శ్రమ పెరుగుతుంది.

విశాఖ నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలను పొందవచ్చు. ధైర్య సాహసాలతో  అన్ని పనులు సాధిస్తారు. ఆదాయ మార్గాలు బాగుండును. బంధుమిత్రల సహాయ సహకారాలు లభిస్తాయి.

అనూరాధ నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు. సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండును. శారీరక సుఖం లభిస్తుంది.

జ్యేష్ట నక్షత్రం వారికి మాసాధిపతి రవి. చిన్న పని చేతనే శరీరం అలసిపోవడం. అధికారులతో విరోధాలు,బంధు మిత్రులతో బేధాభిప్రాయాలు రావడం. తొందరపాటు పనులలో ఆటంకాలు. అనారోగ్య సమస్యలు రాగలవు.

telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రములు:-(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:- 3-6-9
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళవారం

పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు లాభ స్థానం నందు సంచారం .ఈ సంచారం వలన శుభ ఫలితాలు పొందగలరు.వృత్తి వ్యాపారాలలో ఊహించని ధన లాభం కలుగుతుంది. ప్రయత్నించిన కార్యాలలో విజయం సాధిస్తారు. కొద్ది రోజులుగా పడుతున్న అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది.

షష్టమ లాభాధిపతి అయిన శుక్రుడు భాగ్యస్థానము నందు సంచారము. ఈ సంచారం వలన శుభ ఫలితాలు చేకూరుతాయి.కొంత కాలముగా మనసు నందు తలచిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. వ్యవహారాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆనందం శారీరక సౌఖ్యం పొందగలరు. ఆధ్యాత్మిక చింతన పెరుగును. కీలకమైన సమస్యలు పరిష్కారమగును. ఇతరులతో సంభాషణ చేసేటప్పుడు జాగ్రత్త అవసరము. ప్రభుత్వ సంబంధిత పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. బంధు మిత్రులతో సత్కాలక్షేపం చేస్తారు. అధికారులతోటి సత్సంబంధాలు మెరుగుపడతాయి. మిత్రుల తోటి అభివృద్ధి సంబంధిత చర్చలు జరుపుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగును. చేయు వ్యవహారములు దిగ్విజయంగా పూర్తవుతాయి.

మూల నక్షత్రం వారికి మాసాధిపతి రాహువు. ఊహించని ఇబ్బందులు ఎదురవగలవు. శారీరక మానసిక బలహీనత. అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

పూ.షా నక్షత్రం వారికి మాసాధిపతి కేతువు .వాద వివాదాలకు దూరంగా ఉండాలి. తలపెట్టిన పనులలో చిన్నపాటి ఆటంకాలు వచ్చినా చివరకు పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఉ.షా నక్షత్రం వారికి మాసాధిపతి శని. పనులలో  శ్రమ అధికంగా ఉంటుంది .ఇతరులతో అనవసరపు విరోధాలు ఏర్పడవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. విద్యార్థులు పట్టుదల తోటి చదవాలి .ఆర్థిక సమస్యలు రాగలవు.

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రములు
(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 2-3-6-8
అనుకూలమైన వారములు॥ ఆది -సోమ- శని

చతుర్ధ లాభాధిపతి అయిన కుజుడు రాజ్యస్థానం నందు సంచారము. ఈ సంచారం వలనఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులతో అకారణంగా కలహాలు రాగలవు. గిట్టన వారి తోటి అపకారం జరిగే ప్రమాదం.

పంచమ రాజ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానము నందు సంచారం.ఈ సంచారము వలన శుభ ఫలితాలు పొందగలరు. ఆర్థికంగా బలపడతారు. అధికారుల ఆదర అభిమానాల పొందగలరు. అనారోగ్య సమస్యలు తీరి ఆరోగ్యం కుదుటపడుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. సమాజము నందు గౌరవ మర్యాదలు పొందగలరు.బంధుమిత్రుల తోటి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును. ఉద్యోగము నందు అధికారుల యొక్క ఆదరణ పొందగలరు. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. చేయు వ్యవహారము యందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.అకారణంగా కలహాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం.

ఉ.షా  నక్షత్రం వారికి మాసాధిపతి శని. పనులలో  శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో అనవసరపు విరోధాలు ఏర్పడవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. విద్యార్థులు పట్టుదల తోటి చదవాలి. ఆర్థిక సమస్యలు రాగలవు.

శ్రవణం నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు. కోపావేశాలు అదుపు చేసుకుని వ్యవహరించవలెను. ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. తలపెట్టిన పనులు మధ్యలో నిలిచిపోవును. వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము.

ధనిష్ఠ  నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు.ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం చేకూరుతుంది. వ్యవహారాలలో బుద్ధి కుశలత పెరుగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు.

telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రములు
(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన తేదీలు:- 1-2-6-8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ

తృతీయ రాజ్యాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానం నందు సంచారము. ఈ సంచారము అనుకూలము కాదు.అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సమాజము నందు అవమానాలు ఎదురవగలవు. కొన్ని సంఘటనలు మానసిక ఆందోళన కలిగించును.

చతుర్ధ నవమాధిపతి అయిన శుక్రుడు కళత్ర స్థానము నందు సంచారము. ఈ సంచారము అనుకూలమైనది కాదు. చేయ వ్యవహారాల్లో కోపావేషాలు తగ్గించుకుని వ్యవహరించవలెను. కొద్దిపాటి కష్టనష్టాలు రాగలవు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఇతరుల తోట కారణంగా విరోధాలు రాగలవు. వాద వివాదాలకు దూరంగా ఉండాలి.మిశ్రమ ఫలదాయకంగా ఉండును. వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్య భయాలు ఏర్పడును. సంతాన మూలక లాభాలు పొందగలరు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందజేస్తారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. సమాజం నందు కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. వాహన ప్రయాణాలయంలో జాగ్రత్త అవసరం.

ధనిష్ఠ నక్షత్రం వారికి మాసాధిపతి బుధుడు.  ఉన్నత విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం చేకూరుతుంది. వ్యవహారాలలో బుద్ధి కుశలత పెరుగును. అభివృద్ధి ఆలోచనలు చేస్తారు.

శతభిషం నక్షత్రం వారికి మాసాధిపతి గురుడు. సంతాన మూలక ఆనందం కలుగును. గృహములో  శుభకార్యాలు జరుగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారములు లాభసాటిగా జరుగును.

పూ.భా నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలను పొందవచ్చు. ధైర్య సాహసాలతో  అన్ని పనులు సాధిస్తారు. ఆదాయ మార్గాలు బాగుండును. బంధుమిత్రల సహాయ సహకారాలు లభిస్తాయి.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రములు
(దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన తేదీలు:-3-6-9
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ

(మీన రాశి వారికి కుజుడు అష్టము నందు సంచారము చాలా ఇబ్బందులు ఎదురవగలవు. కావున కుజ గ్రహ శాంతి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మంచిది)

ద్వితీయ నవమాధిపతి అయిన కుజుడుఅష్టమ స్థానము నందు సంచారము. ఈ సంచారం వలన అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతారు.రుణ శత్రు బాధలు పెరుగును. ఉద్యోగం నందు స్థానచలనం రాగలదు. దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాలలో ధన నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను.

తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడుశత్రు స్థానం నందు సంచారము. ఈ సంచారం వలన వ్యతిరేక ఫలితాలు రాగలవు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడి పొదుపు చేసిన ధనాన్ని తీసి ఖర్చు చేయవలసి వస్తుంది. పనులలో ఆతురత పెరిగి ఆటంకాలు ఎదురౌతాయి. సమాజంలో అవమానాలు ఎదురవగలవు. రుణాలు చేయవలసి వస్తుంది. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.

పనుల యందు ఆటంకాలు ఏర్పడను.శారీరక శ్రమ పెరుగుతుంది. సమాజం నందు గౌరవ మర్యాదలు తగ్గును. ఇంటా బయటా సామరస్యంగా ఉండవలెను. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరం. ఉద్యోగము నందు స్థాన చలనం. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటుంది .ఆరోగ్య సమస్యలు ఏర్పడగలవు.

పూ.భా నక్షత్రం వారికి మాసాధిపతి చంద్రుడు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ ఫలితాలను పొందవచ్చు. ధైర్య సాహసాలతో  అన్ని పనులు సాధిస్తారు. ఆదాయ మార్గాలు బాగుండును. బంధుమిత్రల సహాయ సహకారాలు లభిస్తాయి.

ఉ.భా  నక్షత్రం వారికి మాసాధిపతి శుక్రుడు సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉండును. శారీరక సుఖం లభిస్తుంది.

రేవతి నక్షత్రం వారికి మాసాధిపతి రవి. చిన్న పని చేతనే శరీరం అలసిపోవడం. అధికారులతో విరోధాలు,బంధు మిత్రులతో బేధాభిప్రాయాలు రావడం. తొందరపాటు పనులలో ఆటంకాలు. అనారోగ్య సమస్యలు రాగలవు.

click me!