Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు!

Published : Feb 01, 2026, 07:00 AM IST

Weekly Horoscope: ఈ వార ఫలాలు 1.2.2026 నుంచి 7.2.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. కొన్ని పనులలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పని భారం నుంచి ఊరట లభిస్తుంది.  

313
వృషభ రాశి ఫలాలు

ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత లాభదాయకంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు.

413
మిథున రాశి ఫలాలు

అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభించదు. కొన్ని వ్యవహారాలలో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. పాతమిత్రులను కలుసుకొని కొన్ని విషయాలు చర్చిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నాయి. 

513
కర్కాటక రాశి ఫలాలు

చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. కుటుంబ సభ్యుల విషయంలో తొందరపడి నోరు జారడం మంచిది కాదు. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. 

613
సింహ రాశి ఫలాలు

మీ పని తీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అనుకున్న సమయానికి చేతికి డబ్బు అందుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 

713
కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసివస్తాయి. ఆత్మీయుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తెలివిగా పరిష్కరించుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

813
తుల రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తవుతాయి. కుటుంబ విషయాలలో ఆకస్మికంగా ఆలోచనలు మార్చుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో కొన్ని వ్యవహారాలు చికాకు తెప్పిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. 

913
వృశ్చిక రాశి ఫలాలు

చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అంచనాలు అందుకోవడం కష్టంగా మారుతుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. స్వల్ప ధనలాభ సూచనలు ఉన్నాయి. 

1113
మకర రాశి ఫలాలు

ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంట్లో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.  

1213
కుంభ రాశి ఫలాలు

చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయటా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార సంబంధిత విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. తల్లి తండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. 

1313
మీన రాశి ఫలాలు

చాలాకాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు అందిన సమాచారం సంతోషాన్నిస్తుంది. సోదరులతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories