
వార ఫలాలు : 16 ఏప్రియల్ 2023 నుంచి 22 ఏప్రిల్ 2023 వరకు
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
కొద్దిపాటు రుణాలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. విద్యార్థులు విద్య యందు ప్రతిభ పాటలు కనబరుస్తారు.సంఘంలో గౌరవం మర్యాదలు పొందగలరు. ఆరోగ్యం బాగుంటుంది. శారీరక మానసిక శాంతి చేకూరును.చేయు వ్యవహారమునందు సరైన ఆలోచనలతోటి వ్యవహరిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉత్సాహంగా గడుపుతారు.. విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. వృత్తి,వ్యాపారాలు లాభసాటికా జరుగును. ఇతరుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో ఆనందంగా గడుపుతారు. వారాంతంలో అనవసరమైన ఖర్చులు పెరుగును. ఉద్యోగము నందు అధికారులతోటి విభేదాలు రావచ్చు. శారీరకంగా అలసట పొందుతారు.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
శుభవార్తలు వింటారు. బంధు మిత్రుల సహకారంతో పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సోదరుల సహకారం అందుతుంది. ధనాదాయం మార్గాలు బాగుండును. శుభకార్యములకు ధనం ఖర్చు చేస్తారు.
అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు .రావలసిన బకాయిలు వసూలు అగును. పోయిన వస్తువులు లభించును. ఉద్యోగమునందు అధికారుల ఆదర అభిమానములు పొందగలరు. వారాంతంలో ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. భార్య తోటి ఆ కారణంగా మనస్పర్ధలు విరోధాలు ఏర్పడ గలవు.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ ఆది- గురు -శుక్ర
ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. చేయు పని యందు అధిక శ్రమ పెరుగుతుంది. బంధువులతో స్వల్ప విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. సంఘమునందు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.సోదరులతో విభేదాలు తలెత్తవచ్చు జాగ్రత్త అవసరము. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో అపవాదములు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగాలలో చికాకులుగాఉంటుంది. మిత్రులతో మాట పట్టింపులు రాగలవు. అనారోగ్యం సమస్యలు ఏర్పడగలవు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం. కొన్ని పనులు వాయిదా వేయుట మంచిది.కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకొనవలెను. వారాంతంలో ధన ధాన్యాలు లాభాలు పొందగలరు. ప్రయత్నించిన కార్యాలు కార్యసిద్ధి సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉండను.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
తలచిన పనులలో ఇబ్బందులు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారములు మందకొడిగా సాగును. విద్యార్థులు తగిన జాగ్రత్తలు వహించడం ద్వారా విద్యలో రాణిస్తారు. సమాజం నందు అవమానాలు ఏర్పడగలవు. వచ్చిన అవకాశాల్ని సద్విని చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. మానసిక ఒత్తిడికి గురి కావచ్చు. శారీరక శ్రమ పెరుగును. ప్రయాణాల యందు జాగ్రత్త అవుసరం. దూరాలోచనలకు దూరంగా ఉండవలెను.ఆర్థిక సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. అదనపు ఆదాయం కోసం ప్రయ త్నాలు ప్రారంభిస్తారు. ఖర్చులు తగ్గించుకొని పొదుపుపాటించడం మంచిది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అపార్ధాలు తలెత్తుతాయి.కుటుంబంలో సమస్యలు. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వారాంతంలో వృత్తి వ్యాపారం నందు కష్టనదగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అనవసరమైన వివాదాలు విరోధాలకు దూరంగా ఉండడం మంచిది.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
అనుకూలమైన వారములు॥ ఆది- సోమ
అనుకున్న కార్యములలో సఫలత చేకూరుతుంది. మిత్రులు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తారు. మనసులో తలచుకున్న అన్ని కార్యాలు నెరవేరుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. నూతన ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని విధాల ప్రోత్సాహకరంగా ఉండును. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగము నందు పై అధికారులతోటి సత్కారాలు పొందగలరు. వైవాహక జీవితం ఆనందంగా గడుపుతారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. సంతోషకరమైన వార్తలు వింటారు. సుఖ సౌఖ్యములు మొదలగు అన్ని లభించును. వారాంతంలో అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సమాజము నందు అపకీర్తి ఏర్పడగలదు. మనసునందు ఆందోళనగా ఉంటుంది.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అనుకూలమైన వారములు॥ బుధ- శుక్రవారం
చేయు పనులయందు లాభం పొందుతారు. సంతోషంగా గడుపుతారు. భూ గృహ క్రయ విక్రయాల యందు లాభం. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు ప్రతిభ కనబరుస్తారు. కుటుంబ సభ్యులతో కలిసిసంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభం. సంతానం అభివృద్ధి సంతోషం కలిగించును. పోగొట్టుకున్న వస్తువులు దొరుకును.
సంఘంలో గౌరవం. రావలసిన ధనం తిరిగి వచ్చును. భూ గృహ క్రయ విక్రయాలకు అనుకూలంగా ఉంటుంది. అన్నదమ్ముల సహకారంతో ధనాధాయ మార్గములు కనబడుట. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వారాంతంలో మానసిక వేదన ఉద్రేకతులు పెరుగును. ఆకస్మిక పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
అనుకూలమైన వారములు॥ మంగళ -గురు- శుక్ర
తలచిన కార్యములు ఆలస్యం కాగలవు. సమాజము నందు గౌరవం తగ్గును. శారీరక పీడ పెరుగుతుంది. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరము. తోబుట్టులతో విభేదాలు ఏర్పడగలవు. అన్ని విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. వ్యవహారమునందు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు కలుగవచ్చు.కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది.వృత్తి వ్యాపారులు, పరిశ్రమల వారికి మిశ్రమ ఫలితాలు లభించును. ఖర్చులు రాబడికి తగినట్లే ఉండటంతో ఇబ్బందులు కలుగును. మానసికంగా భయాందోళనగా నుండును. ఇతరులతో విరోధాలు ఏర్పడగలవు. అనవసరమైన ఖర్చులు పెరుగును. వారాంతంలో సమాజము నందు గౌరవ మర్యాదలు పొందుతారు. మనసునందు సంతోషంగా ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
అనుకూలమైన వారములు॥ మంగళ- గురు -శుక్ర
చేయు పనులలో శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగమునందు ప్రభుత్వ అధికారులతోటి కలహాలు ఏర్పడగలవు. అకారణంగా ఇతరులతోటి విరోధాలు ఏర్పడవచ్చు. సమాజము నందు అపకీర్తి రాకుండా జాగ్రత్తలు పాటించవలెను. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు కలుగును. దూరపు ప్రయాణాలు చేయవలసి వచ్చును జాగ్రత్తగా మెలగాలి. ఇతరుల మీద అసూయ ద్వేషాలు పెరుగును. తలపెట్టిన పనులు మధ్యలో నిలిచిపోవును. ఇంటా బయట వ్యతిరేకతగా ఉండును. వారాంతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేయు వ్యవహారం నందు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు -శుక్ర- మంగళ
వ్యవహారమునందు అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి. ఈవారం జీవన విధానం అనుకూలంగా ఉంటుంది. కీలకమైన సమస్యలు పరిష్కారాలు లభిస్తాయి. ప్రతి పని ధైర్యసహసాల తోటి పూర్తి చేస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారములు లాభసాటిక జరుగును.. వారాంతంలో సంతానం తోటి కలహాలు ఏర్పడను. చేయపనలలో సరైన ఆలోచన లేక ఇబ్బందులు కలుగును. అనవసరమైన పనులు చేస్తారు. అనారోగ్య సమస్యలు రాగలవు. అనవసరమైన ఖర్చులు పెరిగి ఆందోళన కలుగును.అనేక ఆలోచనలు మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. కొద్దిపాటి ఆర్థిక ఇబ్బంది ఏర్పడవచ్చు. వారాంతంలో చేయ వ్యవహారమునందు ప్రతికూలత వాతావరణ. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతోటి గొడవలు ఏర్పడ గలవు.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
వాహన ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. గృహ నిర్మాణ పనులు మందంగా సాగును. భూ స్థిరాస్తి కొనుగోలు విషయాలలో ఆచితూచి వ్యవహరించవలెను. సంతానం తోటి అకారణంగా కలహం ఏర్పడును. చేయప్పనలలో బుద్ధి సూక్ష్మత తగ్గి ఇబ్బందులు ఎదురవుతాయి. గృహమునందు పెద్దవారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మనసునందు భయాందోళనగా ఉండును. వృత్తి వ్యాపారములు యందు జాగ్రత్తలు పాటించవలెను. మనసునందు అనేక ఆలోచనలతోటి చికాకులుగాఉంటుంది. సమాజము నందు అవమానాలు కలగ గలవు. వ్యవహారమంతా తికమక గానుండను. వారాంతంలో ఆరోగ్యం అనుకూలించను. సంతోషకరమైన వార్తల వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతంలో అప్పుల నుండి రోగము నుండి విముక్తి పొందగలరు. మంచి సౌకర్యాలు లభిస్తాయి. ఆనందంగా గడుపుతారు.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అనుకూలమైన వారములు॥ శని- ఆది -సోమ
స్థిరాస్తి విషయాలు చికాకు పుట్టించును. మనసునందు ఆందోళనగా ఉంటుంది. సంతానము నుండి ప్రతికూలత వాతావరణం. చేయపనలలో సరైన ఆలోచనతోటి నిర్ణయాలు తీసుకొనవలెను. మానసిక బాధలు పెరుగును. శత్రువుల వలన అవమానాలు కలుగును. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ముఖ్యమైన వస్తువులందు జాగ్రత్తలు తీసుకొనవలెను. సోదర సోదరులతో కలహాలు ఏర్పడగలవు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపించవలెను. ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యలను చాకచక్యంగా వ్యవహరించి పరిష్కరించవలెను. వారాంతంలో సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మనస్సునందు ఆనందంగా ఉంటుంది. చేయ ప్రయాణాలు లాభిస్తాయి. వారాంతంలో శారీరక మానసిక ఆనందమునకు కొదువ ఉండదు. వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. సంఘమనందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
అనుకూలమైన వారములు॥ గురు- శుక్ర -మంగళ
వృత్తి వ్యాపారములు సామాన్యంగా ఉండును. ఉద్యోగము నందు అధికారులతోటి సమస్యలు రాగలవు . స్థిరాస్తి క్రయ విక్రయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకొనవలెను.. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాక ఇబ్బందులు కలుగును. బంధుమిత్రులతో కొద్దిపాటి విరోధాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాలు యందు జాగ్రత్త అవసరము. చేయు పని యందు ఎక్కువుగా కష్టపడాల్సి ఉంటుంది.అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండవలెను . బద్ధకంగా ఉండును.కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగును. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. వారాంతంలో వస్త్రాభరణ కొనుగోలు చేస్తారు. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. తక్కువ శ్రమతో అధిక లాభం పొందగలరు.