
వార ఫలాలు : 11-2-2024 నుండి 17-2-2024 వరకు
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
మేషం (అశ్విని భరణి కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
చేయు వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారస్తులు వ్యాపారములు విస్తరించుట కై చేయు ఆలోచనలు ఫలిస్తాయి. అవసరానికి తగు ధనము చేతికి అందుతుంది. గొప్ప గొప్ప వ్యక్తుల తో పరిచయాలు ఏర్పడతాయి. మిత్రుల సహకారంతో ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి.అన్ని విషయాల్లోనూ స్నేహితులు మీకు అండగా నిలుస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబము నందు ఉత్సాహం ఆనందం పరిణవిల్లుతుంది. నూతనమైన వస్తు వాహనములను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
ఎటువంటి పనినైనా గట్టి ప్రయత్నం పట్టుదలతో పూర్తి చేస్తారు.గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు మూలంగా ధనము ఖర్చు చేస్తారు. ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేయువారికి మంచి అవకాశాలు లభిస్తాయి. పనుల్లో చిన్నపాటి ఆటంకములు ఏర్పడిన వ్యయప్రయాసలు చే విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు అనుకున్న చోటుకు బదిలీ లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు లో విజయం సాధిస్తారు. మనస్సు నందు ఉన్న ఆందోళన లు తొలగుతాయి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచి ఆరోగ్యంతో పాటు శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర , పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
ఏ వృత్తి వారికి ఐనా ఈ వారం పరీక్షా సమయం. ఒత్తిడి లను తట్టుకొని ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇతరుల విషయాల్లో వ్యవహారాలలో మధ్యవర్తిత్వం చేయకూడదు.విమర్శలు చేసేవారు అధికం గా ఉంటారు. ఎంత కష్టపడినా ఫలితం శూన్యముగా నుండును. తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శత్రువర్గం వారితో జాగ్రత్త అవసరం.ఆస్తి వ్యవహారాలు చేయుటకు మంచి సమయం కాదు. చేతికి రావలసిన ధనం సమయానికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు అవసరం.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
వృత్తి వ్యాపారాలు సామాన్యంగా నుండును. ఇతరుల విషయంలో తనకు మించిన వ్యవహారములు మాట ఇచ్చుట చేయకూడదు. తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యవహారములలో పొరపాటున నోరు జారకూడదు. ప్రయాణంలో ఒకింత జాగ్రత్త పడాలి. బాహ్య పరమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం శ్రేయస్కరం కాదు. ఇతరుల యొక్క మాటలు అవమానాలు పట్టించుకోరాదు. ఈ కాలం అనేక రకాల అనుమానాలకు దారితీస్తుంది. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితం లభించక నిరుత్సాహము కలుగును. విద్యార్థులు చదువుపై ఒకింత ఎక్కువ శ్రద్ధ పెట్టవలెను. దూర ప్రయాణాలు కలిసి రావు.
సింహం (మఖ , పుబ్బ, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
సమాజంలో ఉన్నతమైన వ్యక్తులతో సత్సంగం ఏర్పడుతుంది. గతంలో వాయిదా వేసిన పనులు ముందుకు సాగుతాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలికంగా పరిష్కారం కాని ఆర్థిక విషయాలు పరిష్కారం అవుతాయి. కుటుంబము నందు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. విద్యా వినోద కాలక్షేపాలలో పాల్గొంటారు. అన్ని విధాల సౌకర్యాలు పొందుతారు. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఉద్యోగ సంబంధమైన విషయాలు లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి.
కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
నూతనంగా ప్రారంభించిన పనులు లో క్రమక్రమముగా మేలు చేకూరుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నములు సంతోషాన్ని ఇస్తాయి. ఎటువంటి సమస్యనైనా ధైర్యంతో ఎదుర్కొంటారు. పూర్తికాని పనులు ప్రయత్నములు చేత పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో నలుగురికి ఉపయోగపడే వారి వలె ఉంటారు. ఆరోగ్యపరమైన సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు కు ఈ సమయం మంచి ప్రయోజనకరం అవుతుంది.
తుల (చిత్త 3 4, స్వాతి , విశాఖ 1 2 3)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఇష్టం లేని కార్యక్రమములు తల పెట్టవలసి వస్తుంది. సరియైన ప్రణాళిక లేకుండా ఏ పనులు తలపెట్టరాదు. ఖర్చులు మితిమీరి ధనము ఇచ్చువారుకై అన్వేషణలు చేస్తారు.అందివచ్చిన అవకాశములను ప్రయోజనం చేకూరే విధంగా మలుచుకో లేక పోతారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వివాహాది ప్రయత్నములకు ఈ సమయం అంతగా అనుకూలించదు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విషయాల నిమిత్తమై మనస్పర్థలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లోపిస్తాయి. ఇతరులతో కలహాలకు దూరంగా ఉండండి.శారీరకంగా మానసికంగా అధికంగా శ్రమిస్తారు. సుఖశాంతులు లోపిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
ఆకస్మికమైన ప్రయాణములు కు దూరంగా ఉండండి.వృత్తి వ్యాపారాలు చేయువారికి ఒకింత నిరుత్సాహము ఉంటుంది.శత్రువర్గం వారు పరోక్షముగా అలజడులు సృష్టిస్తారు.వారి విషయంలో జాగ్రత్త తప్పనిసరి. విద్యార్థులకు ఈ వారం ప్రయోజనకరం కాదు. ఆరోగ్య సమస్యలు విషయంలో శ్రద్ధ వహించవలెను. ఉద్యోగస్తులు సహోద్యోగులతో లౌక్యంగా వ్యవహరించుట ఉత్తమము. ధనము ఖర్చు పెట్టే విషయంలో ఆడంబరాలకు పోరాదు. కోపావేశము లు నియంత్రణలో ఉంచుకోవాలి. సోదరులతో అభిప్రాయ భేదాలు కలుగుతాయి. దొంగతనాలు నుండి జాగ్రత్త పడాలి.
ధనస్సు (మూల ,పూ.షాడ , ఉ.షాడ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఇతరులకు మీ పట్ల గౌరవం నమ్మకం ఏర్పరచుకోవడం లో సఫలం అవుతారు. తలపెట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు ఏర్పడిన లక్ష్యసాధకులై ముందుకు సాగుతారు. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞులైన వ్యక్తుల యొక్క సహాయ సహకారములు పొందుతారు. ఆర్థికపరమైన లావాదేవీలు తెలివిగా వ్యవహరిస్తారు. సమయానికి ధనం సర్దుబాటు అయ్యి ఉపాధి అవకాశాలను మెరుగు పరుచు కుంటారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్య అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
ఉద్యోగస్తులు అధికారులు కు సంజాయిషీలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ప్రతి విషయము నందు తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టలేరు. పనులన్నీ మందకొడిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. ఆర్థికంగా ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది .కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. శ్రమకు తగిన ప్రయోజనం అంతంత మాత్రంగా ఉంటుంది. అనవసరమైన విషయాల్లో పట్టువిడుపు మంచిది. మీ యొక్క వ్యతిరేకులు బలపడుతారు. ఆరోగ్యం విషయంలో వైద్యుల యొక్క సలహాలు సూచనలు తప్పక పాటించాలి.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
వృత్తి ఉద్యోగాలు లో సానుకూల వాతావరణం. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రయత్నాలు వేగవంతం చేసుకుంటారు. అన్నదమ్ముల నుంచి కలిసి వస్తుంది. ఎంతటి సమస్యనైనా ధైర్యముగా ఎదుర్కొంటారు. సకాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు యోగిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు అనుకూలిస్తాయి.వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతృప్తికరమైన ఆనందదాయకమైన జీవితాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భగవంతునిపై భక్తి పెరుగుతుంది.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ప్రారంభించిన పనులు కాస్త మందకొడిగా సాగుతాయి. ప్రభుత్వ సంబంధిత ప్రోత్సాహకాలు తగు సమయానికి అందవు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం ఉత్తమం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవు. ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందులు కలుగుతాయి. గృహము నందు చిన్నపాటి చిరాకులు ఉంటాయి. ఇంట బయట మర్యాదగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి అధికమగును. అనవసరపు మాటలు పడవలసి వస్తుంది. నమ్మినవారు నుండి మోసపోవటం జరుగును. నూతన పెట్టుబడులు అనుకూలించవు. మనో చాంచల్యం ఎక్కువగా ఉండును. శారీరక శ్రమ అధికముగా చేయవలసి వస్తుంది. ఆర్థిక పరమైన విషయంలో అధికముగా రుణము చేయవలసి వచ్చును. మనసునందు ఆందోళన పెరుగుతుంది.