
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
మీ లాంగ్ టైమ్ ఫైనాన్సియల్ గోల్స్ రీచ్ అయ్యే అవకాశం ఈ వారంలో కనపడుతోంది. కాబట్టి మీరు ఏ పని పోస్ట్ ఫోన్ చేయద్దు. వృత్తి వ్యాపారాలలో లాభం. సంఘంలో మంచి పనులు చేస్తారు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. సోదరులతో మనస్పర్ధలు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించవలెను. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో చికాకులు. సంతానం మూలకంగా లాభములు. అనవసరమైన ఖర్చులు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. బంధు మిత్రుల సహకారం లభిస్తుంది. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. వారాంతంలో ఆకస్మిక ధన లాభం.
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఈ వారం మద్యలో ఓ వార్త మిమ్మల్ని కలవర పరుస్తుంది. అయితే అది మీ మంచికే అని కాల క్రమేణా అర్దమవుతుంది. ధనాదాయం మార్గాలు బాగుంటాయి. సోదరుల సహకారంతో చేయు వృత్తి వ్యాపారాల యందు లాభాలు. చేయు పని వారితో చికాకులు. స్థిరాస్తి కొనుగోలు వాయిదా వేసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. కుటుంబంలో పెద్దవారికి ఒక ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవలెను. సంతాన అభివృద్ధి విషయంలో జాగ్రత్తలు తీసుకోవలెను. కుటుంబం తీసుకుని నిర్ణయాలలో జీవిత భాగస్వామి సహకారం తీసుకోవలెను. సంఘంలో ఆచితూచి వ్యవహరించవలెను. ఆకస్మిక ధన లాభం. రుణ శత్రుబాధలు కొంతమేర తొలగును. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఈ వారం మీరు చాలా బిజీగా ఉంటారు. ఇంటా, బయిటా పనులు కనపడాయి. మానసిక శ్రమ ఉన్నా అవసరమైన ఖర్చులకు ధనం సమకూరుతుంది. బంధువులతో సఖ్యతగా మెలగాలి. శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. సంతాన విషయంలో జాగ్రత్త తీసుకోవలేను. రుణ శతృ బాధల నుండి కొంతమేర ఉపశమనం. ఆస్తుల విషయంలో లాభం చేకూరును. స్థిరాస్తి కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారులకు నిరాశ. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు. వారాంతంలో కుటుంబంతో కలిసి అందంగా గడుపుతారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మంచితనం మీకు ఈ వారం అర్దమవుతుంది. ఎవరు ఎలాంటివారో తెలుస్తుంది. అయితే ధనాదాయం మార్గాలు సామాన్యం. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారము నిరాశ. అనవసరమైన ఆలోచనలు. శారీరక శ్రమ. రుణ శత్రు బాధలు కొంతమేర తొలగును. బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగాలి. అనుకున్న పనులు పట్టుదలగా ప్రయత్నిస్తే సఫలీకృతం అవుతాయి. వారాంతంలో అనుకోని ఖర్చులు.
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉత్సాహం, ఉత్తేజంతో పాటు ప్లానింగ్, ఫెరఫెక్షన్ తో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు.ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం సమకూరుతుంది. అన్నదమ్ములతో మనస్పర్ధలు. పని వారితో చికాకులు. స్థిరాసిక్ క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. కుటుంబం నందు పెద్ద వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి వ్యాపారాలకు సామాన్యం. విద్యార్థులు పట్టుదలతో చదవవలెను. రుణబాధల నుండి కొంతమేర ఉపశమనం లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఆటంకాలు. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి.
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఈ వారం మీ జీవితంలో గుర్తుండిపోయే కొన్ని శుభాలను మోసుకు వస్తుంది. చాలా సంతోషంగా కాలం గడుస్తుంది. శుభవార్తలు వింటారు.ధనాధాయ మార్గాలు బాగుంటాయి. భూ గృహ క్రయక్రయాలకు అనుకూలం. ఆర్థిక ఇబ్బందులు తొలగును.సంఘంలో గౌరవ ప్రతిష్టలు. విలువైన వస్తువుల యందు జాగ్రత్త తీసుకోవాలి. సంతాన మూలకంగా లాభములు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగాలి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి వ్యాపారాల యందు లాభం. వారాంతంలో అనుకోని ఖర్చులు.
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
మీరు కూల్ గా,కామ్ గా ఉంటే ఈ వారం మధ్యలో వచ్చే కొన్ని సమస్యలు వాటంతట అవే సమసి పోతాయి. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న అప్పులు తీరును. సంతాన మూలకంగా లాభం. భూ గృహ క్రయవిక్రయాలలో ఆచితూచి వ్యవహరించవలెను. వివాహ ప్రయత్నాలు పట్టుదలతో ప్రయత్నిస్తే సఫలం అవుతాయి. అన్నదమ్ములతో మనస్పర్ధలు. వృత్తి వ్యాపారాలకు సామాన్యం. కొంతకాలంగా ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. స్థానచలనం. అనుకోని ఖర్చులు. వారాంతంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
“మీరు చెప్పింది వినటానికి ప్రపంచం సిద్దపడుతోంది!” అని మీకు ఈ వారం లో జరిగే కొన్ని సంఘటనలు తెలియచేస్తాయి. ఉత్సాహంతో ముందుకు వెళ్లండి. పోయిన వస్తువులు తిరిగి లభించును. సంఘంలో గౌరవం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల కలయిక. భూ గృహ క్రయవిక్రయాలకు సామాన్యం. వివాహ ప్రయత్నాలు సానుకూలం. రుణ శత్రు బాధలు తొలగును. కుటుంబంలోని పెద్ద వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సంతాన అభివృద్ధికి తగు ప్రణాళికలు వేసుకోవాలి. వారాంతంలో ధనలాభం.
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
మీ ఎనర్జీ లెవిల్స్ రెట్టింపు అయ్యే వారం ఇది. మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన పదోన్నతులు. వృత్తి వ్యాపారులకు సామాన్యం. మానసిక ఒత్తిడి. ఆరోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టును. కుటుంబమునందు కలహాలు. స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆకస్మిక ధనలాభం. వివాహ ప్రయత్నాలకు ఆటంకాలు. కొత్త ఆలోచనలు చేస్తారు. వారాంతంలో అనుకోని ఖర్చులు.
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
మీరు సరైన దారిలో ఉన్నారని కొన్ని సూచనలు, శకునాలు ఈ వారం అందుతాయి. వాటిని మీరు అర్దం చేసుకుని ధైర్యంగా ముందుకు వెళితే... శుభవార్తలు వింటారు. తలపెట్టిన కార్యాలు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల మన్నన. అనుకోని ప్రయాణాలు. వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు. వృత్తి వ్యాపారాల యందు సామాన్యం. గృహ విక్రయాలకు అనుకూలం. సంతాన విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. గృహ భూ క్రయవిక్రయాలకు అనుకూలం. కోపతాపాలకు దూరంగా ఉండండి. దీర్ఘకాలిక వ్యాధులు కొంత బాధించును. పనులు ఆటంకాలు ఏర్పడినప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో మనస్పర్థలు. వారాంతంలో బుద్ధిచాప్ల్యతచే కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు.
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
మీరు ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలం పాటు మీ జీవితంపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏ పనైనా చేయండి. అప్పుడు మాత్రమే ...ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం. బంధుమిత్రుల సహకారంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనదాయ మార్గాలు బాగుంటాయి. విద్యార్థులకు ఉత్తమమైన మార్గాలు ఏర్పడతాయి. స్థల గృహ వాహన క్రయ విక్రయాలకు అనుకూలం. జీవిత భాగస్వామితో ఇబ్బందులు. అనుకోని ఖర్చులు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవును. వారాంతంలో కుటుంబం నందు ప్రతికూల వాతావరణం.
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
మీరు ఈ వారంలో చేసే కొన్ని పనులు మీ కుటుంబ సభ్యులు, మీ కోవర్కర్స్ సహకారం అవసరం. అందరితో మంచిగా ఉండండి. గ్రహాలు బాగోలేనప్పుడు మానవ ప్రయత్నంతో వాటిని దాటే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తొలుగును. కుటుంబం నందు ఆహ్లాదకరమైన వాతావరణం. సంతానం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సామాన్యం.రుణ శత్రుబాధలు కొంతమేర తొలగును. వివాహ ప్రయత్నాలు అనుకూలించును. సంఘంలో గౌరవం.ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు. అనవసరమైన ఖర్చులు. పనులలో జాప్యం. వారాంతంలో ఆకస్మిక ధన లాభం ,మనశాంతి లభించును.
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం. - ఫోన్: 8523814226 (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)