వారఫలితాలు తేదీ మే 14 శుక్రవారం నుండి 20 గురువారం 2021

First Published May 14, 2021, 8:58 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం శుభకార్యాలపై ఇంట్లో చర్చిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే... ఆనందం అనేది డబ్బులోనే.. లగ్జరీ వస్తువుల్లోనూ ఉండదు. అది మనుషుల మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. కొందరు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. వాళ్లని చూసి ఎదుటివారు వీళ్లకి బాధలంటూ ఏమీ ఉండవా అనే సందేహం కలుగుతుంది. అయితే.. వాళ్లు చిన్న చిన్న విషయాల్లోనూ ఆనందాన్ని వెతుక్కుంటారు. అందుకే వారు అలా ఉండగలుగుతున్నారట. రాశిచక్రం ప్రకారం కూడా.. ఐదు రాశులవారు ఎప్పుడూ తమ జీవితం సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..
undefined
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం వ్యాపారాలు విస్తరిస్తారు, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు. కళారంగం వారికి కొంత అనుకూల సమయం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం శుభకార్యాలపై ఇంట్లో చర్చిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం, పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. పారిశ్రామికరంగం వారికి అన్నింటా విజయవంంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఇంటిలో శుభకార్యాలపై ప్రస్తావన, హడావిడి. కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. దైవకార్యాలు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వాహనయోగం. ఒకప్రకటన నిరుద్యోగులకు వరంగా మారనున్నది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం ప్రారంభంలో వివాదాలు. అనారోగ్యం. ఇంటిలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో మీపై గౌరవం పెరుగుతుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలు మరింతగా ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో కొన్ని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విశేష యోగదాయకంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటంబసభ్యులతో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. కొత్త పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. బంధువులతో వివాదాలు తీరతాయి. కొన్ని ఆశయాలు నెరవేరతాయి. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వాహనయోగం. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది..
undefined
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. కళాకారులకు ప్రోత్సాహకరమైన కాలం. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. ఆప్తుల నుంచి ఒత్తిడులు. చేపట్టిన కొన్ని పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా కొంత ప్రగతి ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత తగ్గవచ్చు. కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం వ్యాపారాలలో అంచనాలకు తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు వివాదాలు, సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. పనులు సకాలంలో పూర్తి చేసి మీ సత్తా చాటుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకుంటే కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులు, బంధువులతో వివాదాలు కొంత పరిష్కరించుకుని, వారిలో సన్నిహితంగా మెలుగుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మానసిక అశాంతి. కుటుంబంలో కొన్ని సమస్యలు. స్వల్ప అనారోగ్యం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు కొంత నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు, సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. విద్యార్థులకు శ్రమ తప్పదు. ఇంటి నిర్మాణయత్నాలు నత్తనడకన సాగుతాయి. మీ అభిప్రాయాలను కుటుంబంలో వ్యతిరేకిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. వారం చివరిలో ఆరోగ్యం మందగిస్తుంది. సోదరులతో అకారణంగా విభేదాలు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బం«ధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట చెందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
click me!