వారఫలితాలు ఏప్రిల్ 30 శుక్రవారం నుండి మే 6 గురువారం 2021 వరకు

First Published Apr 30, 2021, 9:43 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి   ఈ వారం ఆర్థిక వ్యవహారాలు ఆశించినరీతిలో ఉంటాయి. కొన్ని రుణబాధలు తొలగుతాయి.  వాహనాలు, స్థలాలు కొంటారు.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు పొందుతారు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
undefined
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతన అవకాశాలు. వారం చివరిలో అనారోగ్యం. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కొన్ని ఆశయాలు నెరవేరతాయి. ఆప్తుల సలహాల మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో సోదరులు చేయూతనందిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. కొన్ని సమస్యలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఊరట లభిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక వ్యవహారాలు ఆశించినరీతిలో ఉంటాయి. కొన్ని రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు పొందుతారు. రాజకీయవర్గాల ఆశలు ఫలించే సమయం. వారం ప్రారంభంలో మనశ్శాంతి లోపిస్తుంది. సోదరులతో విభేదాలు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. కొన్ని ఉత్సవాలకు హాజరవుతారు. జీవిత భాగస్వామి నుంచి స్వల్ప ఆస్తిలాభ సూచనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది, మంచి పేరు గడిస్తారు. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభకార్యాలపై బంధువులతో చర్చిస్తారు. ప్రముఖులతో ముఖ్య విషయాలు గ్రహిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. కొన్ని కాంట్రాక్టులను చేజిక్కించుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో అధిక లాభాలు దక్కుతాయి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం వ్యాపారాలలో అనుకోని లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. కొత్త పనులు చేపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. శుభకార్యాల నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరం చేస్తారు. అనుకోని విధంగా కాంట్రాక్టులు పొందుతారు. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు మరింత మెరుగుపడతాయి. కొన్ని సమస్యలు తీరి ఊర ట లభిస్తుంది. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం వ్యాపారాలలో కొత్త సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగి సవాలుగా మారవచ్చు. కళారంగం వారికి సామాన్యంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఊహించని ఆహ్వానాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారి రుణాలు చేస్తారు. కాంట్రాక్టులు కొన్ని చేజారతాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. చేపట్టిన పనులు మధ్యలోనే ముగిస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కే సూచనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. రుణాలు తీరతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాలకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలులో ప్రతిబంధకాలు తొలగుతాయి. కోర్టు వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో అనుకోని లాభాలు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఒక సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం, ఒత్తిడులు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. కాంట్రాక్టర్ల యత్నాలలో కదలికలు ఉంటాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు నెరవేరే సమయం. వారం చివరిలో బంధువిరోధాలు. ఆరోగ్య సమస్యలు. ఆర్థిక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ప్రత్యర్థులు సైతం మీపై ప్రేమాభిమానాలు చూపుతారు. పరిస్థితులు మరింతగా అనుకూలిస్తాయి. అందరిలోనూ మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. కోర్టు కేసుల నుంచి విముక్తి పొందుతారు. దూరపు బంధువుల రాక ఉత్సాహాన్నిస్తుంది. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం అందరిలోనూ ప్రత్యేకత నిలుపుకుంటారు. వ్యాపారాలలో మరింత ప్రగతి ఉంటుంది. భాగస్వాముల చేయూత లభిస్తుంది. ఉద్యోగాలలో అనుకోనిæ పోస్టులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. అనుకోని విద్యావకాశాలు విద్యార్థులకు ఊరటనిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి విషయంలో వివాదాలు పరిష్కరించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. ధనవ్యయం. వ్యవహారాలలో ఒత్తిడులు. బంధువులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సమయానికి పూర్తి చేస్తారు. గృహ, వాహన యోగాలు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు. విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నిలిచిన ప్రమోషన్లు దక్కవచ్చు. కళారంగం వారికి ఊహించని అవకాశాలు లభించే సూచనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఆర్థికంగా మరింత అనుకూల పరిస్థితి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు సమకూరతాయి. ఎటువంటి వ్యవహారమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. కొత్త నిర్ణయాలను అంతా సమర్థిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగాలలో పనిభారం నుంచి బయటపడతారు. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమ తప్పదు. ఇంటాబయటా మరింత ప్రోత్సాహం. కొత్త వ్యక్తుల పరిచయాలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. అనుకున్న పనులు కొంత కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
click me!