డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం వ్యాపారాలలో ముందడుగు వేసి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో క్లిష్టసమస్యల నుంచి గట్టెక్కుతారు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పట్టుదల, కృషితో కొన్ని విజయాలు సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. పాతస్మృతులు గుర్తుకు వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్థిరాస్తుల కొనుగోలు నిలిపివేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. కళారంగం వారికి ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యయప్రయాసలను ఎదుర్కొంటారు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామికవర్గాల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని రుణాలు తీరే సమయం. ఒక సమస్య నుంచి నేర్పుగా బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు అనూహ్యంగా పదవులు లభించే వీలుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. చాతుర్యంతో ఎదుటవారిని సైతం ఆకట్టుకుని పనులు చక్కదిద్దుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీలో పట్టుదల పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం స్వయంకృషితో పనులు చక్కదిద్దుతారు. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. విద్యార్థుల కృషి ఫలించే సమయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరిగి మీ మాటే చెల్లుబాటు కాగలదు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబసభ్యులతో వివాదాలు. మానసిక అశాంతి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి అనుకున్నరీతిలోనే కొనసాగుతుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. కళారంగం వారికి శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. కుటుంబంలో సమస్యలు. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. ఆకస్మిక ధనలబ్ధి. విలువైన సమాచారం అందుతుంది. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. సోదరులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణం, కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరం. పారిశ్రామికవర్గాలకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. వారం ప్రారంభంలో సోదరుల నుంచి ఒత్తిడులు. వృథా ధనవ్యయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వాహన యోగం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం ఉద్యోగాలలో కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. ఆర్థికంగా మరింత బలపడతారు. కొన్ని రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తులు కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. సోదరుల నుంచి ఆస్తుల విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అదనపు భారం తగ్గి ఊరట చెందుతారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో మిత్రులతో కలహాలు. విలువైన వస్తువులు జాగ్రత్తపర్చుకోండి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో సమస్యలు పరిష్కరించుచకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం బంధువుల నుంచి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని మిత్రులతో పంచుకుంటారు. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రారంభంలో చిక్కులు నెలకొన్నా క్రమేపీ సర్దుకుంటాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించే వీలుంది. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కొన్ని సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారికి కార్యసిద్ధి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగల సూచనలు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. ధనవ్యయం. ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.