ఈ వారం రాశిఫలాలు( 19 మార్చి నుంచి 25 మార్చి వరకు)

First Published Mar 19, 2021, 9:26 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం కొన్ని ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల నుంచి ఒత్తిడులు తగ్గుతాయి. మీలోని దానగుణం వెలుగులోకి వస్తుంది

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
undefined
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జైశ్రీమన్నారాయణ.
undefined
మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలబ్ధి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తుల కొనుగోలు, విక్రయాలలో అవాంతరాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా పడతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొన్ని ఆరోగ్య సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల నుంచి ఒత్తిడులు తగ్గుతాయి. మీలోని దానగుణం వెలుగులోకి వస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ మాటే చెల్లుబాటు కాగలదు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం కొత్త కాంట్రాక్టులు దక్కే అవకాశం. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో కొన్ని రాజీమార్గాలు అనుసరిస్తారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలులో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సమర్థత, సామర్థ్యం వెలుగులోకి వస్తాయి. పారిశ్రామికవేత్తలు పూర్వానుభవాలతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. స్వల్ప అనారోగ్యం. ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. కొన్ని వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఒక సమాచారం మీలో కొంత మార్పునకు సహకరిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఊహించని వ్యక్తి ద్వారా సహాయం అందవచ్చు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగుపడుతుంది. ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీకు అనుకూలమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పెద్దల సలహాల మేరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం ఆస్తుల కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. ధనలబ్ధి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు పెరుగుతాయి. ఆత్మీయులతో విభేదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు నెలకొని కొంత ఇబ్బంది పడతారు. పనులు కొంత నిదానిస్తాయి. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖ వ్యక్తుల పరిచయాలు ఏర్పడవచ్చు. ఇంటి నిర్మాణయత్నాలు నిలిపివేస్తారు. ఆరోగ్యసమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు, రుణయత్నాలు సాగిస్తారు. చిన్ననాటి మిత్రుల సలహాలు పొందుతారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలను మధ్యలో విరమిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. రాజకీయవేత్తలకు చికాకు పరుస్తాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం కుటుంబంలో మీపై ఆదరణ పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు, ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు నూతన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో సోదరులతో కలహాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యూహాత్మక వైఖరితో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారంతో ఊరట చెందుతారు. నూతన పరిచయాలతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ మెరుగుపడతాయి. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు దక్కించుకునే వీలుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరే సమయం. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. పారిశ్రామికవేత్తల యత్నాలు సానుకూలమవుతాయి. వారం మధ్యలో వివాదాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాభావంతో ముందుకు సాగి ప్రశంసలు పొందుతారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో అంది అవసరాలు తీరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సమయానికి విస్తరిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. ఆరోగ్యం మందగించి వైద్యసేవలు పొందుతారు. చిన్ననాటి కొన్ని విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కళాకారులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. వారం మధ్యలో ఆత్మీయుల నుంచి పిలుపు. ధనలబ్ధి. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తుల వివాదాలు నెలకొంటాయి. బంధువులు, మిత్రులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు హోదాలు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయవేత్తలకు విజయాలు వరిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో సమస్యలు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల చేయూతతో ముందడుగు వేస్తారు. మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం కుటుంబానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవేత్తలు క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడతారు. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం. ఇంటాబయటా గందరగోళం. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. సోదరులు, మిత్రులతో మనస్పర్థలు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. భూవివాదాలు పరిష్కారదశకు చేర తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
undefined
click me!