Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి అన్నింటా విజయమే...!

First Published Mar 18, 2022, 8:42 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం వీరికి అన్నింటా విజయమే. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. 

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం బంధువులు, స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. వస్ర, వస్తులాభాలు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.  శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  సభలు, సమావేశాలలో పాల్గొంటారు.  వ్యాపారాలు మరింత విస్తరిస్తారు.  ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బంది కలిగించినా అవసరాలకు లోటు ఉండదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. కాంట్రాక్టర్లకు శుభదాయకంగా ఉంటుంది. వివాహాది వేడుకలలో పాల్గొంటారు. భూవివాదాలు తీరతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. లాభాలు తథ్యం. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి శ్రమ ఫలిస్తుంది. సత్కారాలు జరుగుతాయి. వారం చివరిలో  వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం బంధువుల నుంచి ఆసక్తికరమైన సమాచారం. అవసరాలకు డబ్బు అందుతుంది. కాంట్రాక్టర్లకు అనుకూలం. కొత్త పనులు చేపడతారు. ఉన్నత విద్యావకాశాలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.  వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  ప్రముఖుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం బంధువులతో సంతోషంగా గడుపుతారు. మీపై  అపవాదులు తొలగుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. గృహం, వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.  స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు.  మిత్రులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

  
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. ఆర్థిక లాభాలు. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. నూతన పరిచయాలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పాతజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు కొత్త అవకాశాలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. అందరిలోనూ గౌరవం పొందుతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు.  వ్యాపారవర్గాలకు ఊహించని లాభాలు అందుతాయి.  ఉద్యోగవర్గాలకు అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు నూతన పదవులు. వారం చివరిలో  ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొత్త మిత్రులు పరిచయమవుతారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. పరపతి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. సోదరులతో ఆస్తి వ్యవహారాలపై చర్చలు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.  వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి.  ఉద్యోగాలలో నూతనోత్సాహం, పదోన్నతులు దక్కవచ్చు. కళాకారులకు సన్మానయోగం, విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో కలహాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం  ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం నూతన ఉద్యోగవకాశాలు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్థలాలు, వాహనాలు కొంటారు. దూరపు బంధువుల కలయిక. కొత్త పనులు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమం లభిస్తుంది. కొన్ని పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కోర్టు కేసులు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. , ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. రాజకీయవేత్తలకు పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో వివాదాలు. మిత్రులతో విభేదాలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు.  ఆర్థిక పరిస్థితి  మెరుగ్గా ఉంటుంది. రుణాల నుంచి విముక్తి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆప్తుల ద్వారా ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు ఢోకా ఉండదు. ఉద్యోగవర్గాలకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో  వ్యయప్రయాసలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం వీరికి అన్నింటా విజయమే. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థుల యత్నాలు సఫలం. కొత్త విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.  వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్యం. బంధువర్గంతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.  చిన్ననాటి సంఘటనలు నెమరువేసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

డా.యం.ఎన్.ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151
 

గమనిక :-  ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. ఆచార్య
 

click me!