వార ఫలాలు: ఓ రాశివారికి అనుకోని ప్రయాణాలు

First Published | Jan 15, 2023, 10:15 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ వారం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. నూతన వస్తు వాహనాలకు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. 

Horoscope

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరు నష్టపోతున్నారు. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ వార ఫలాలు లో తెలుసుకుందాం
 

Vijaya Rama krishna

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి  ఈ వారం ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 


Zodiac Sign

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
వృత్తి వ్యాపారం నందు అనుకోని ధన లాభం కలుగుతుంది. సమాజం నందు మీ ప్రతిభ తగ్గ గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది.తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. నూతన వస్తూ వాహనాది  కొనుగోలుకు సంబంధించిన విషయాలలో జాగ్రత్త వహించాలి. మిత్రులు సహాయంతో అధికార ప్రాప్తి కలుగుతుంది.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. రావలసిన పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణాధి పనులు ముందుకు సాగును.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను అందించండి.వారాంతంలో దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది.సంతానం తోటి మనస్పర్ధలు ఏర్పడతాయి.

Zodiac Sign

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజం నందు మీ మాటతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారమునందు పెట్టుబడులకు తగ్గ ధన లాభం కలుగుతుంది. శరీర ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. జీవిత భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు. మిత్రుడు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. నూతన వస్తు వాహనాలకు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. సంతోషకరమైన విషయాలు తెలియడం వలన మనసు నందు ఆనందకరమైన వాతావరణ ఏర్పడను. స్థిరాస్తి వృద్ధి చేయు ఆలోచనలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణ పనులు సజావుగా సాగును. ఉద్యోగమునందు అధికారుల ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వారాంతంలో మానసిక ఉద్రేగత మరియు ఆందోళనగా ఉంటుంది. ఇతరులతోటి వాదనలకు గొడవలకు దూరంగా ఉండండి. అనుకోని ప్రయాణాలు ఏర్పడతాయి. కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తాయి.

Zodiac Sign

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
మనస్తనందు అనేక బాధలతోటి భయంగా ఉంటుంది. తలపెట్టిన పనుల యందు ఆటంకాలు ఏర్పడతాయి. వచ్చిన అవకాశాలను తెలివిగా అందుపుచ్చుకొనవలెను. కొన్ని సంఘటనలు వలన నిరాశ నిస్పృహలకు గురవుతారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని వలెను. సమాజం  నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారాల యందు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగమనందు అధికారుల ఒత్తుడులు పెరుగుతాయి. జీవిత భాగస్వామి తోటి సఖ్యతగా ఉండవలెను. వాహన ప్రయాణాలయందు తగు జాగ్రత్త అవసరము. ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు. వారాంతంలో అనుకోని ధన లాభం కలుగుతుంది. శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభిస్తుంది. చేయ పనులలో మిత్రులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

Zodiac Sign

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
మనసునందు అనేక ఆలోచనలు తోటి తికమకగా ఉండను. బంధుమిత్రులతోటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. భూ గృహ నిర్మాణ పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. ఉద్యోగం నందు అధికారులతోటి గొడవలు రావచ్చు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొనవలెను. భార్య భర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి. చేయు వ్యవహారం నందు కోపాన్ని అదుపులో ఉంచుకుని వ్యవహారాన్ని ఇతరుల యొక్క విషయాలలో జోక్యం చేసుకోవద్దు ఈ కారణం చేత మీయొక్క గౌరవం తగ్గుతుంది. ఆరోగ్య సమస్యల మీద తగు శ్రద్ధ తీసుకొనవలెను. వారాంతంలో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజము నందు ప్రతిపకు తగ్గ కీర్తి ప్రతిష్టల లభిస్తాయి.

Zodiac Sign

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
తలపెట్టిన పనులు అనుకున్నట్లుగా అనుకూలంగా జరుగును. చేయ వ్యవహారాల యందు మృదువగా సంభాషణ చేస్తూ వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటారు. నూతన వస్తా వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబం నందు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. పొదుపు పథకాల మీద దృష్టి సారిస్తారు. ఉద్యోగమునందు అనుకూలమైన మార్పులు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాల యందు ధనలాభం కలుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. సమాజం నందు ప్రతిభ తగ్గ గౌరవం లభిస్తుంది. పాత బాకీలు వసూవులను. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వారాంతంలో ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది. వచ్చిన అవకాశాలని విడుస్తారు. అనవసరమైన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.

Zodiac Sign


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
చేయ ఖర్చుయందు ఆలోచించి ఖర్చు చేయవలెను. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు తగ్గును. తలపెట్టిన పనులు ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన పర్యాయాలు వలన చికాకుగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు యందు పెట్టుబడి విషయంలో పెద్దల యొక్క ఆలోచనలతోటి నిర్ణయం తీసుకోనవలెను. ఉద్యోగమునందు అధికారుల యొక్క ఒత్తిడిలు ఎక్కువగా నుండును. ఇతరులతోటి వాదోపవాదములకు దూరంగా ఉండండి. మానసికంగా శారీరకంగా బలహీనపడతారు. వారాంతంలో విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న అవసరానికి ధనం చేకూరుతుంది. చేయ పని వారితో ఇబ్బందులు కలగవచ్చు. దాంపత్య జీవితం ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. దురాలోచనలకు దూరంగా ఉండండి.

Zodiac Sign

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
సమాజము నందు సన్మానాల అందుకుంటారు. వృత్తి వ్యాపారం నందు ధన లాభం కలుగుతుంది. వాయిదా పడిన పనులు పూర్తి అవుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. కీలకమైన సమస్యలు పరిష్కార మార్గాలు అన్వేషణ చేస్తారు. ఉద్యోగమునందు అధికారులతోటి స్నేహ సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగును. గృహ నిర్మాణ క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. వారాంతంలో సమాజము నందు కీర్తి ప్రతిష్టలు తగ్గును. తలపెట్టిన పనులలో  ఆటంకాలు ఏర్పడతాయి. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను.
 

Zodiac Sign

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతరులతోటి గొడవలకు దూరంగా ఉండండి. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు తగ్గును. మిత్రుల తోటి సఖ్యతగా ఉండవలెను. ఖర్చు చేయు విషయంలో జాగ్రత్తలు తీసుకొనవలెను. కొన్ని కీలకమైన సమస్యలు బుద్ధిబలంతోటి పరిష్కరించుకోవాలి. తలపెట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేయాలి. అసూయ ద్వేషాలకు దూరంగా ఉండండి. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందించండి. ప్రయాణమునందు తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. వృత్తి వ్యాపారం యందు పెట్టుబడులు ఆచి తూచి పెట్టవలెను. నిరాశృహలకు గురివుతారు. కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. గృహవనందు పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. వారాంతంలో జీవిత భాగస్వామి ఆనందంగా గడుపుతారు. మిత్రుల యొక్క ఆదరణ అభిమానాలు పొందగలరు. అదృష్టం కలిసి వస్తాయి. కుటుంబ అభివృద్ధి కలుగును.

Zodiac Sign


ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
శుభవార్తలు వింటారు. వృత్తి వ్యాపారం నందు ఊహించని ధన లాభం కలుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చేస్తారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభించును. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవును. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు కలుగును. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు నిమిత్తం అధిక ధనం ఖర్చు చేస్తారు. ఉద్యోగమునందు తన ఒత్తిడిలు ఎక్కువగా ఉన్నా అధిగమించి ఉత్సాహంగా పనిచేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుపుతారు. కుటుంబం నందు ఆనందకరమైన చక్కటి వాతావరణ ఏర్పడుతుంది. నూతన గృహ నిర్మాణ పనులు సజావుగా సాగును. వారాంతంలో సమాజము నందు ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. మనసునందు అనేక ఆలోచనలు తోటి తికమకగా  ఉంటుంది. ఊహించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అనుకోని సమస్యలు ఎదురవుతాయి.

Zodiac Sign


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాధిస్తారు. ఉద్యోగం నందు అధికార వృద్ధి కలుగును. వాయిదా పడిన పనులన్నీ పూర్తగును. దేహారోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. దూరపు ప్రయాణాలు లాభిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై ప్రశాంతత లభించును. బంధుమిత్రుల యొక్క సత్ సంబంధాలు బలపడతాయి. దాంపత్య జీవితం సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. భూ క్రయవిక్రయాలు కలిసి వస్తాయి. వ్యాపారం నందు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఊహించని లాభం పొందుతారు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు. వారాంతంలో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. వచ్చిన అవకాశాలు చేజారుతాయి. అసూయ ద్వేషాలకు దూరంగా ఉండండి. మిత్రుల తోటి సఖ్యతగా ఉండవలెను. ఖర్చు విషయం నందు ఆలోచించి ఖర్చు చేయవలెను.

Zodiac Sign


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
సమాజము నందు కలహాలు ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సంతానం తోటి ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. ఉద్యోగమునందు అధికారుల ఒత్తుడులు ఎక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ పెరిగి బలహీనపడతారు. అపకారం చేయవారు ఎక్కువగా నుందురు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. సంఘం నందు కీర్తి  ప్రతిష్టలు తగ్గును. పదోపవాదములకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక ఆలోచనలు కలుగుతాయి. ముఖ్యమైన పనులలో అవాంతరాలు ఏర్పడతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగును. వృత్తి వ్యాపారాలు యందు ధనష్టం రావచ్చు. కీలకమైన సమస్యల యందు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబం ప్రతికూలత వాతావరణ ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్ధలు ఏర్పడతాయి. వారాంతంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు యందు ధనలాభం కలుగును.

Zodiac Sign

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4): మానసిక వేదన పెరుగును. దీర్ఘకాలిక అనారోగ్యాలు ఇబ్బంది పడతాయి. ఇతరులతోటి విరోధాలు రావచ్చు. కొన్ని సంఘటన వలన ఉద్రేకం చెందుతారు. సంతానం ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ అభివృద్ధి కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకొనవలెను. ప్రమాదకరమైన వస్తువులకు పనులకు దూరంగా ఉండండి. ప్రయాణాలయందు జాగ్రత్త అవసరము. తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగమునందు పై అధికారులతోటి గొడవల రావచ్చు. వృత్తి వ్యాపారం నందు కష్టానికి తగిన ప్రతిఫలం లభించును. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టవలెను. సమస్యల విషయంలో ధైర్యంగా ముందడుగు వేయండి. వారాంతంలో ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగును.

Latest Videos

click me!