భారతదేశంలో అతిముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. ముఖ్యంగా ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. కాగా ఈ పండుగ రోజున సూర్యుడు మకర సంక్రాంతిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రాంతిని కేరళలో మాఘ్ బిహు అని, హిమాచల్ ప్రదేశ్ లో మాఘ్ సాజి అని, జమ్మూలో ఉత్తరాయణం అని, తమిళనాడులో పొంగల్ అని, హర్యానాలో సారకత్ అని, బీహార్ లో దహీ చురా అని, ఉత్తరప్రదేశ్ లో కిచిడీ, ఒడిషాలో మకర సంక్రాంతి అని అంటారు. ఈ సారి మకర సంక్రాంతిని 2023 జనవరి 15న అంటే నేడు జరుపుకుంటున్నాం. మకర సంక్రాంతి రోజున సూర్యభగవానుడిని నిష్టగా పూజిస్తారు. అంతేకాదు ఈ రోజున మహాపుణ్యకాలంలో స్నానం చేయడం, దానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు దానం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. అసలు ఏ రాశిచక్రం వారు ఏయే వస్తువులను దానం చేయడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..