Ugadi 2025: విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజల జీవితం ఎలా ఉంటుంది?
ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు, కాబట్టి అధికారం పరంగా, రాజకీయంగా, ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది.
ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు, కాబట్టి అధికారం పరంగా, రాజకీయంగా, ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది.
తెలుగు ప్రజలు ఉగాది పండగను కొత్త సంవత్సరం ఆరంభంగా భావిస్తారు. ఈ ఏడాది మార్చి 30, 2025 ఆదివారం నాడు విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. హిందూ జోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరానికీ ప్రత్యేక శక్తులు, ప్రభావాలు ఉంటాయి. ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు, కాబట్టి అధికారం పరంగా, రాజకీయంగా, ప్రభుత్వ వ్యవస్థల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది.
విశ్వావసు నామ సంవత్సరంలో రైతులకు ఎలా ఉండనుంది..?
ఈ సంవత్సరం రైతులకు మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వర్షపాతం తగినంతగా ఉండే అవకాశమున్నా, సాగుకు అనుకూలత తగ్గవచ్చు. మొక్కల పెరుగుదల అంతంత మాత్రమే ఉండటం వల్ల కొంత మేర రైతులు ఇబ్బంది పడవచ్చు. అయితే, పండిన పంటలకు అధిక రేటు లభించే సూచనలు కనిపిస్తున్నాయి, ఇది రైతులకు ఆర్థికంగా లాభదాయకం. అన్ని రకాల ధాన్య పంటల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో రైతులకు ఆదాయం పెరగొచ్చు, కానీ కృషికి తగిన ప్రోత్సాహం లభించాలంటే ప్రభుత్వ విధానాలు, సహకారం అవసరం.
విశ్వావసు నామ సంవత్సరంలో ఆరోగ్యంగా ఎలా ఉండనుంది?
వాతావరణ మార్పుల కారణంగా ప్రజల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు ఎక్కువగా ప్రబలే అవకాశముంది. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో డీహైడ్రేషన్, తలనొప్పి, మానసిక ఒత్తిడి పెరగొచ్చు. కొత్తరకమైన వైరస్ వ్యాప్తి చెందే అవకాశమున్నట్లు పండితులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించి, సరైన ఆహారం, శరీర దారుఢ్యాన్ని పెంచే ఉపాయాలు పాటించాలి.
విశ్వావసు నామ సంవత్సరంలో రాజకీయ, ఆర్థిక ప్రభావం ఎలా ఉండనుంది?
సూర్యుడు అధిపత్యం వహిస్తున్న కారణంగా పాలక వర్గాల్లో కీలక మార్పులు సంభవించే అవకాశం ఉంది. కొందరు నాయకులు పదవులు కోల్పోగా, మరికొందరు నూతనంగా ఎదగొచ్చు. ప్రజాప్రతినిధులు, అధికారులు దురాశతో నడుచుకునే అవకాశాలున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కొంత రాజకీయ అస్థిరత ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే, వ్యాపారరంగానికి మిశ్రమ ఫలితాలే సూచిస్తున్నాయి. కొంతమంది వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం, అయితే నాణ్యతలో రాజీపడకుండా ముందుకు సాగితేనే విజయవంతమవుతారు. స్టాక్ మార్కెట్ ఊహించని మార్పులకు లోనవ్వొచ్చు.
ఉద్యోగ, వ్యాపార రంగంపై ప్రభావం
ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కొన్ని మిశ్రమ పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించినా, కొందరికి ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. కొంత మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశముండటం వల్ల పరిస్థితులను అంచనా వేసుకుని ముందుకు సాగడం అవసరం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కొన్ని కొత్త నియామకాలు ఉండే అవకాశముంది.
వ్యాపారస్తులు తమ కంపెనీల పునర్‌వ్యవస్థీకరణ గురించి ఆలోచించాలి. చిన్న వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం. అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఆర్థిక నిర్వహణపై పూర్తి దృష్టి పెట్టాలి.