మీన రాశిలోకి శుక్రుడు...ఈ నాలుగు రాశుల పంట పండినట్లే..!

Published : Jan 29, 2025, 03:34 PM IST

శుక్ర గ్రహం  కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగుపెట్టింది. ఈ మార్పులు... నాలుగు రాశులవారి తలరాతను మార్చనుంది. ఈ  రాశులకు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..  

PREV
15
మీన రాశిలోకి శుక్రుడు...ఈ నాలుగు రాశుల పంట పండినట్లే..!

గ్రహాలు తరుచూ మారుతూ ఉంటాయి. తాజాగా శుక్ర గ్రహం కుంభ రాశి నుంచి మీన రాశి లోకి అడుగుపెట్టింది. శుక్ర గ్రహాన్ని డబ్బు, ఆసక్తి , కుటుంబ సుఖానికి సంబంధించినదిగా సూచిస్తారు. కాగా... ఈ శుక్ర గ్రహం జనవరి 28వ తేదీన మీన రాశిలోకి ప్రవేశించాడు. కాగా, ఈ ప్రభావం  నాలుగు రాశులపై ఎక్కువగా ఉంటుంది.  ఆ నాలుగు రాశుల జాతకం మారిపోతుంది. పట్టుకుందల్లా బంగారమే అవుతుంది. వారు కోరుకున్నదల్లా జరుగుతుంది. మరి, ఆ అదృష్ట రాశులేంటో చూద్దాం...

 

25
వృషభ రాశి..

శుక్ర గ్రహం రాశి  మార్పు.. వృషభ రాశివారి జీవితంలో పంట పండిస్తుంది. ఇప్పటి వరకు వారు పడిన ఆర్థిక కష్టాలు మొత్తం తీరుతాయి.  వారి సంపాదన పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబంలో ఎవరితోనైనా ఆస్తి సమస్యలుు ఉన్నా అవి కూడా తీరిపోతాయి. ప్రేమ  జీవితం కూడా ఆనందంగా సాగుతుంది.

 

35
సింహ రాశి..

శుక్ర గ్రహం కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగుపెట్టడం సింహ రాశివారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. వీరి ఆర్థిక సమస్యలు కూడా పెరుగుతాయి. ఈ రాశివారికి డబ్బుతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది. పిల్లల వల్ల ఈ రాశివారు శుభవార్తలు అందుకుంటారు.

 

45
తుల రాశి..

శుక్రగ్రహం కుంభ రాశిని వీడి.. మీన రాశిలోకి అడుగుపెట్టడం.. తుల రాశివారి జీవితాన్నే మార్చేయనుంది. ఈ రాశివారు ఈ సమయంలో మంచి శుభవార్తలు అందుకుంటారు.  గతంలో ఆగిపోయిన పనులు పూర్తౌతాయి. షేర్ మార్కెట్లో లాభాలు చూస్తారు.

 

55
మకర రాశి..

మొన్నటి వరకు శని గ్రహం కారణంగా సమస్యలు ఎదుర్కొన్న మకర రాశివారికి శుక్ర గ్రహం అదృష్టాన్ని అందించనుంది. ఇప్పటి వరకు వారు పడిన కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అపార ధనం చూస్తారు. కొత్తగా ఆస్తులు కూడా కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో ఏవైనా సమస్యలు ఉంటే.. వాటిల్లో కూడా విజయం  అందుకుంటారు. భార్య నుంచి సుఖం లభిస్తుంది. మీకు అన్ని విషయాల్లో అండగా నిలుస్తారు.

 

click me!

Recommended Stories