శని గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటుంది. శని గ్రహం రాశిని మార్చుకున్న ప్రతిసారీ కొన్ని రాశులకు మేలు జరగగా.. కొన్ని రాశుులకు మాత్రం కష్టాలు తప్పవు. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న ఈ శని గ్రహం... త్వరలోనే మీన రాశిలోకి అడుగుపెట్టనుంది. ఈ ప్రభావం ఆరు రాశులపై స్పష్టంగా పడనుంది. ఆ ఆరు రాశులవారికి కష్టాలు తప్పవు. మరి, ఆ రాశులేంటి..? ఏ రాశివారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం....
2025 మార్చిలో శని గ్రహం.. కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగుపెట్టనుంది. దీని ప్రభావం మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, కుంభ, మీన రాశులపై చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆర్థిక, మానసిక, ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.