Venus Transit: శుక్ర మహాదశ మొదలైంది.. ఈ మూడు రాశులకు కుబేరులు అయ్యే సువర్ణ అవకాశం

Published : Jun 12, 2026, 08:50 AM IST

Venus Transit: శుక్రుడు అనుగ్రహం ఉన్నవారికి డబ్బుకి ఎప్పుడూ లోటు రాదు. సంపద, శ్రేయస్సుకు అధిపతి అయిన శుక్రుడు.. తాజాగా నక్షత్రాన్ని మార్చుకున్నాడు. దీని కారణంగా, మూడు రాశులకు ఉద్యోగ, వ్యాపారాల్లో అపారమైన విజయాన్ని మోసుకొస్తుంది. 

PREV
14
సంపదలను ఇచ్చే శుక్రుడు...

జోతిష్య శాస్త్రంలో శుక్రుడును అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తారు.ఈ రాశి అనుగ్రహం పొందిన వారికి సకల సౌఖ్యాలు లభిస్తాయి. ఈ గ్రహం సంపదకు అధిపతి. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే.. సంపద వారిని వెతుక్కుంటూ వస్తుంది. కాగా.. తాజాగా ఈ శుక్ర గ్రహం తన నక్షత్రాన్ని మార్చుకుంది. పుష్యా నక్షత్రంలోకి అడుగుపెట్టింది. జూన్ 23 వ తేదీ వరకు అదే నక్షత్రంలో ఉంటుంది దీని కారణంగా మూడు రాశులకు అద్భుతంగా కలిసిరానుంది. ముఖ్యంగా పట్టిందల్లా బంగారమే అవుతుంది. అంటే.. వీరికి కుబేర యోగం కలుగుతుంది. ఎటు నుంచి డబ్బులు వస్తున్నాయో కూడా తెలీకుండా వచ్చి చేరతాయి. మరి, ఆర్థిక సమస్యలు తీరి.. ఆనందంగా మారే ఆ రాశులేంటో చూద్దాం..

24
వృషభ రాశి..

శుక్ర గ్రహ నక్షత్ర మార్పు వృషభ రాశివారికి సంపదలు మోసుకువచ్చేలా చేస్తుంది. శుక్రుడు ఈ రాశి మూడో ఇంట్లో నుంచి సంచరిస్తున్నాడు. కాబట్టి.. ఈ సమయంలో మీరు పడిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. చాలా కాలంగా ఏవైనా సమస్యల నుంచి బాధపడుతున్నట్లయితే.. వాటికి పరిష్కారం లభిస్తుంది. ఈ సమయంలో మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా చేయగలను అనే నమ్మకం పెరుగుతుంది. ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తారు. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇక.. డబ్బు విషయంలో ఇప్పటి వరకు ఉన్న చింతలు అన్నీ తీరిపోతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. జీవితం ఆనందంగా మారుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు.

34
కర్కాటక రాశి..

శుక్ర గ్రహ నక్షత్ర మార్పు.. కర్కాటక రాశివారికి కూడా చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు పొందుతారు. ఈ పనిని ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు. వైవాహిక జీవితం ఒక్కసారిగా ఆనందంగా మారుతుంది. జీవితంలో సర్వ సుఖాలు ఈ సమయంలోనే లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తులు కొనగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జీవితంలో ఎదుర్కొన్న చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

44
తుల రాశి..

శుక్ర గ్రహ నక్షత్ర మార్పు..తుల రాశివారికి ఊహించని ప్రయోజాలను అందిస్తుంది. శుక్ర మహా దశ వీరి లైఫ్ లో మొదలౌతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ పనిని అందరూ ప్రశంసిస్తారు. ముఖ్యమైన బాధ్యతలు చేపడతారు. ఉన్నత విద్య చదవాలనే కోరిక నెరవేరుతుంది. ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories