Venus Retrograde: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, త్వరలో శుక్రుడు తన సొంత రాశి అయిన తుల రాశిలో వక్రమార్గంలో ప్రయాణించనున్నాడు. దానివల్ల విపరీత శుక్ర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి ఊహించని ధనలాభం, అదృష్టం తీసుకురానుంది. మరి ఆ రాశులేవో చూడండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు సమాయానుసారం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తుంటాయి. ఇతర గ్రహాలతో కలిసి శుభ, అశుభ యోగాలు ఏర్పరుస్తుంటాయి. అక్టోబర్ 3 న శుక్రుడు తన సొంత రాశి అయిన తుల రాశిలో వక్రమార్గంలో ప్రయాణించనున్నాడు. దానివల్ల విపరీత శుక్ర యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో, శుక్రుడు కొన్ని రాశులవారికి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాడు. మరి ఆ రాశులేవో తెలుసుకోండి.
25
వృషభ రాశి
వృషభ రాశికి అధిపతి శుక్రుడు కావడం వల్ల ఈ రాశివారికి శుక్రుడి వక్ర సంచారం మరింత మేలు చేస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కేసులలో ఊహించని గెలుపు లభిస్తుంది. చాలా కాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగంలో సహోద్యోగుల మద్దతుతో కొత్త విజయాలు సాధిస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇంటా బయటా మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది.
35
మిథున రాశి
మిథున రాశికి ఐదవ ఇంట్లో శుక్రుడి వక్ర సంచారం జరుగుతుంది. దీనివల్ల, ప్రేమ వ్యవహారాల్లో ఉన్న అపార్థాలు తొలగిపోయి, సాన్నిహిత్యం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాతో లాభాలు పొందుతారు. కళలు, మీడియా, సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి ఊహించని కొత్త ఒప్పందాలు, ప్రశంసలు లభిస్తాయి. పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు చూస్తారు. ఉద్యోగాలలో మీరు ఆశించిన ఫలితాలు దక్కే సూచనలు బలంగా ఉన్నాయి.
సింహ రాశికి మూడవ ఇంట్లో శుక్రుడు వక్రించడం వల్ల మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. సోదరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి. కొత్త లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది.
55
ధనుస్సు రాశి
ధనుస్సు రాశికి లాభ స్థానమైన పదకొండవ ఇంట్లో శుక్రుడి సంచారం జరగడం వల్ల భారీ ధన లాభం కలుగుతుంది. చాలా కాలంగా ఉన్న కోరికలు, కలలు నెరవేరుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో మీరు ఆశించిన శుభవార్త అందుతుంది. వ్యాపారంలో కొత్త భాగస్వాముల ద్వారా భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. స్నేహితుల ద్వారా కొత్త అవకాశాలు పొందుతారు.