Shukra Gochar: శుక్ర గ్రహ నక్షత్ర మార్పు... రెండింతలు కానున్న ఈ రాశుల అదృష్టం..!

Published : Oct 21, 2025, 10:47 AM IST

Shukra Gochar: గ్రహాల, నక్షత్రాల మార్పుల ప్రభావం కొన్ని రాశుల వారిపై చాలా ఎక్కువగా కనిపిస్తుంది. శుక్ర గ్రహం త్వరలో నక్షాత్రి మార్చనున్నాడు. ఆ నక్షత్ర మార్పు... నాలుగు రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులను తీసుకురానుంది. 

PREV
15
శుక్ర గ్రహ నక్షత్ర సంచారం..

గ్రహాలు తరచూ మారుతూనే ఉంటాయి. ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగుపెడుతూ ఉంటాయి. ఒక్కోసారి నక్షత్రాలను కూడా మార్చుకుంటూ ఉంటాయి. జోతిష్యశాస్త్రంలో శుక్రుడిని దయగల గ్రహం అని పిలుస్తూ ఉంటారు. ఈ శుక్రుడు అక్టోబర్ 28 తన నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. అది కూడా అంగారక గ్రహానికి చెందిన చిత్త నక్షత్రం కావడం విశేషం. ఈ ఏడాది ముగిసే వరకు నాలుగు రాశుల అదృష్టం రెట్టింపు కానుంది. మరి, అదృష్టాన్ని పొందనున్న ఆ నాలుగు రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

25
1.మేష రాశి....

మేష రాశిలో జన్మించిన వారికి శుక్ర సంచారం చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఈ శుక్ర సంచారం కారణంగా మేష రాశి వారు వ్యాపారంలో పురోగతి సాధించగలరు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. సమస్యలు తగ్గి.. కుటుంబంతో సంతోషంగా గడపగలరు. కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి సాధిస్తారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. శుక్ర గ్రహ ప్రభావం కారణంగా కళలు, సంగీతంపై ఆసక్తి చూపిస్తారు.

35
2.వృషభ రాశి...

శుక్ర గ్రహ సంచారంతో వృషభ రాశివారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ కాలంలో వృషభ రాశిలో జన్మించిన వారు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈ సమయంలో లైఫ్ చాలా విలాసవంతంగా మారుతుంది. వివాహ జీవితంలో విజయం సాధిస్తారు. చిత్త నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల వృషభ రాశి వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందగలరు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఏవైనా సమస్యలు ఉంటే అవి తగ్గిపోయే అవకాశం ఉంది. ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. ఊహించని వైపు నుంచి లాభాలు పొందుతారు. కోరుకున్న వస్తువులు కొనుగోలు చేస్తారు.

45
3.తుల రాశి...

శుక్ర గ్రహ సంచారం కారణంగా తుల రాశివారికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వివాహం అయిన వారి బంధం కూడా ఆనందంగా మారుతుంది. భాగస్వామి తో అనుబంధం మరింత పెరుగుతుంది. కెరీర్ లో పురోగతి సాధించగలరు. ఈ సమయంలో మీరు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు పొందుతారు. ఆనందం పెరుగుతుంది. ఈ సమయంలో కొత్త ఆస్తులు, భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

55
4.వృశ్చిక రాశి...

వృశ్చిక రాశివారు ఈ సమయంలో శుభ ఫలితాలు పొందుతారు. శుక్రుడు చిత్త నక్షత్రంలోకి అడుగుపెట్టడం వృశ్చిక రాశి అదృష్టం రెట్టింపు అవుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. కోల్పోయిన డబ్బు పొందే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కొత్త ప్రదేశాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories