మిథున రాశికి పదో ఇల్లయిన కర్మ స్థానంలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉన్నాడు. ఇది ఈ రాశి వారి ఉద్యోగం, వృత్తిపై ప్రభావం చూపిస్తుంది. అతి పెద్ద మార్పును తెస్తుంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా, సంగీతం, పెయింటింగ్ వంటి కళా రంగాల్లో ఉన్నవారికి మంచి పేరు వస్తుంది.