Vastu Tips: ఈ వాస్తు మార్పులు.. దంపతుల మధ్య సమస్యలన్నీ పరిష్కరిస్తాయి..!

First Published Jul 4, 2022, 11:46 AM IST

నిత్యం దంపతుల మధ్య ఏదో ఒక చిరాకు, గొడవలు, మనస్పర్థలు ఉండాలని ఎవరూ కోరుకోరు. కానీ.. మనం కోరుకోకున్నా కూడా చాలా మంది దంపతుల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు రావడానికి.. మన ఇంటి వాస్తు దోషం కూడా కారణమయ్యే అవకాశం ఉందట.

Vastu Tips

సంసార జీవితం మూడు పువ్వులు, ఆరు కాయల్లా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఎలాంటి ఆటుపోట్లు, తలనొప్పులు, గొడవలు లేకుండా ఉండాలని అనుకుంటారు. అంతేకానీ.. నిత్యం దంపతుల మధ్య ఏదో ఒక చిరాకు, గొడవలు, మనస్పర్థలు ఉండాలని ఎవరూ కోరుకోరు. కానీ.. మనం కోరుకోకున్నా కూడా చాలా మంది దంపతుల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు రావడానికి.. మన ఇంటి వాస్తు దోషం కూడా కారణమయ్యే అవకాశం ఉందట. అందుకే.. ఆ దోషాన్ని పోగొట్టి.. వాస్తు విషయంలో కొన్ని మార్పులు చేసుకుంటే.. దంపతలు మధ్య జీవితం సవ్యంగా, సాఫీగా.. ఆనందంగా సాగుతుందట. మరి ఆ వాస్తు మార్పులేంటో ఓసారి చూద్దాం..

1.చాలా మంది దంపతుల  మధ్య అన్ని విషయాల్లో క్లారిటీ లేకపోవడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. మీ మధ్య కూడా ఆ విషయంలోనే అభిప్రాయ బేధాలు వస్తున్నట్లయితే.. వాస్తు ప్రకారం ఒక చిన్న మార్పు చేసుకోవాలి. ఇంటికి ఈశాన్య మూలలో పర్పుల్ లేదా.. బ్లూ కలర్ వస్తువులను అమర్చాలి. అలా కాదు అంటే.. ఆ ప్రదేశంలో.. పర్పుల్, బ్లూ రంగు లో ఏదైనా పెయింట్ లాంటివి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంపతుల మధ్య మనస్పర్థలు రాకుండా ఉంటాయి.

2.దంపతుల మధ్య సమస్యలకు బెడ్రూమ్ లోని బెడ్ పొజిషన్ కూడా కారణమౌతుందట. ఇంట్లో బెడ్ కచ్చితంగా.. దక్షిణ దిక్కులో లేదంటే... నైరుతి దిక్కులో బెడ్ ని ఉంచాలి. ముఖ్యంగా మాష్టర్ బెడ్రూమ్ లో బెడ్... ఆ దిక్కులో ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల.. దంపతుల మధ్య గొడవలు లాంటివి జరగకుండా ఉంటాయట.
 

3.ఈ మధ్యకాలంలో చాలా మంది స్టైల్ గా పడకగదిలోని బెడ్ లను రకరకాల మెటీరియల్స్ తో తయారు చేసినవి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా ఇనుము తో తయారు చేసిన బెడ్ లను వాడతారు. అయితే...  ఇలాంటి బెడ్స్ వాడటం వల్ల కూడా .. దంపతుల మధ్య సమస్యలు, గొడవలు, నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయట. అందుకే.. బెడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలట. మెటల్ బెడ్స్ కి బదులుగా... చెక్క మంచం మాత్రమే వాడాలని వాస్తు సూచిస్తోంది.
 

4.ఇక చాలా మంది తమ ఇంటిని రంగురంగులతో నింపేస్తూ ఉంటారు. వారి అభిరుచికి తగ్గినట్లుగా.. రంగులు అద్దుతుంటారు. అందులో తప్పులేదు. కానీ.. ఇంటి గోడలకు ముదురు రంగులు వేయడం వల్ల కూడా దంపతుల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయట.కాబట్టి.. ఇంట్లో గోడలు ఎప్పుడూ లైట్ కలర్ పెయింట్స్ వేసుకోవడం మంచిది.  ఇవి కంటికి ఇంపుగా.. హాయినిస్తాయి.
 

5.ఈ మధ్యకాలంలో చాలా మంది దంపతులు.. బెడ్రూమ్ ని అద్దాలతో అలంకరిస్తున్నారు. కానీ.. బెడ్ పై పడుకున్న సమయంలో.. మనకు మనం అద్దంలో కనపడకూడదట. అలా అద్దంలో కనపడటం వల్ల కూడా దంపతుల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి.. బెడ్ ఎదురుగా అద్దం పెట్టకూడదు. నిజానికి.. అసలు బెడ్రూమ్ లో అద్దం పెట్టకపోవడమే మంచిది. అవసరమైతే... ఒక చిన్న అద్దాన్ని మాత్రమే ఉంచుకోవడం ఉత్తమం.
 

sex

6.ఇక ఇంట్లో వస్తువులు గందరగోళంగా ఉంచకూడదు. ముఖ్యంగా ఈశాన్య మూలలో బరువైన వస్తువులను పెట్టడం.. చిందర వందరగా.. గందరగోళంగా పడేయడం అస్సలు మంచిది కాదు. ఈశాన్య మూల ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.

7.పడక గదిలో ఇండోర్ ప్లాంట్స్ ని ఉంచుకోవడం వల్ల మంచి జరుగుతుందట. ఇండోర్ ప్లాంట్స్, పూలు, పూల మొక్కలను ఇంట్లో పెట్టుకోవాలట. అది కూడా  నైరుతి, దక్షిణం దిక్కులో ఈ మొక్కలను పెంచుకోవడం వల్ల దంపతుల మధ్య గొడవలు రాకుండా ఉంటాయట.

8. ఇక పడక గదిలో ఎలక్ట్రానిక్ వస్తువులు.. ముఖ్యంగా టీవీలు, మ్యూజిక్ బాక్స్ లు లాంటివి పెట్టకూడదట. ఒక వేళ పెట్టినా కూడా.. రాత్రిపూట వాటిని ఏదో ఒక దానితో కవర్ చేయాలట. అలా చేయడం వల్ల దంపతుల మధ్య సమస్యలు రాకుండా ఉంటాయట.

9.ఇంట్లో అలంకరణ వస్తువులు పెట్టుకోవడం అందరూ చేసే పనే. అయితే... ఆ అలంకరణ వస్తువులను ఏదీ ఒక్కటిగా పెట్టకూడదట. పావురం బొమ్మలు,పూల కుండీలు లాంటివి పెడుతూ ఉంటారు. అవి కూడా సింగిల్ గా కాకుండా.. జంటగా పెట్టాలట. అప్పుడు దంపతుల మధ్య సమస్యలు రాకుండా ఉంటాయట.

click me!