Tarot Reading: ఈ వారం టారో రీడింగ్.. ఈ రాశి వారు ఇతరులపై ఆధారపడటం మానుకోవాలి..!

First Published Jul 4, 2022, 10:01 AM IST

మీ వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్న కొన్ని పనులు జరుగుతాయి. కాబట్టి మీరు ఈ సమయంలో ప్రతి పనిని సరిగ్గా చేయాలి. మీ ప్రణాళికకు కట్టుబడి ఉండకపోవడం ద్వారా కొన్ని సమస్యలను ఏరికోరి కొనితెచ్చుకుంటారు. 

ఈ టారో రీడింగ్ ని మనకు ప్రముఖ జోతిష్యులు చిరాగ్ దారువాలా అందించారు. ఈ టారో రీడింగ్ లో ఆయనకు దాదాపు 12ఏళ్లకు పైగా అనుభవం ఉంది.
 

మేషం: 
మీ మనస్సులో మీరంటే అసూయపడే వ్యక్తి ప్రయత్నాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే మీరు వారితో మిమ్మల్ని పోల్చుకోవడం మానేస్తారు. ఈరోజు మీకు వ్యతిరేకంగా కొన్ని ఘటనలు జరగవచ్చు. దానిని ఓటమిగా తీసుకోవద్దు. మీరు కార్యాలయంలో ఉన్నత స్థానం లేదా నాయకత్వ ఒప్పందాన్ని పొందుతారు. భార్యా భర్తల మధ్యన జరిగే వివాధాలను కుటుంబ సభ్యుల ముందు చర్చించకండి. లేకపోతే వివాదం ముదిరే అవకాశం ఉంటుంది. కంటి నిండా నిద్రపోవడానికి ప్రయత్నించండి. నిద్రలేమి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. 
శుభ వర్ణం: - ఎరుపు
శుభ సంఖ్య: 3

వృషభం: 
మీ ఆలోచనలో వచ్చిన మార్పు వల్ల మీ వ్యక్తిత్వంలో కూడా మార్పు కనిపిస్తుంది. దృష్టితో నిర్ణయాలు తీసుకోవడం లేదా మీ లక్ష్యాలను సాధించడం ప్రస్తుతం సాధ్యం కాదు. ఒక విషయాన్ని పరిష్కరించడానికి, మార్చడానికి ప్రయత్నించండి. అవసరమైనప్పుడు మీరు ఎప్పటికప్పుడు సహాయం, మార్గదర్శకత్వం పొందుతారు. పనికి సంబంధించిన విషయాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. మీ నైపుణ్యాలు పెరిగినంత మాత్రాన పెద్దగా విజయం సాధించడం సాధ్యం కాదు. మీ జీవిత భాగస్వామితో చర్చిస్తున్నప్పుడు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం అవసరం. డాక్టర్ ఇచ్చిన సూచనలను పాటించండి.
శుభ రంగు: - గులాబీ
శుభ సంఖ్య: 4


జెమిని: 
మీ జీవితానికి సంబంధించిన పరిస్థితిని ఎదుర్కోవడం మాత్రమే మీ విశ్వాసాన్ని బలంగా ఉంచుతుంది. ఏదైనా పెద్ద పనికి బాధ్యత వహించే ముందు మీరు మీ మానసిక స్థితిపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ప్రతిసారీ మీపై అంచనాలను పెంచుకోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మీకు ఆసక్తి ఉన్న విషయాల గురించి ప్రతికూలంగా అనిపించవచ్చు. పనికి సంబంధించిన మార్కెటింగ్‌ని పెంచుకోవడానికి ప్రయత్నించండి. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం సాధ్యమవుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ కొనసాగుతుంది. పిల్లల విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు ఒకరితో ఒకరు చర్చించుకోవాల్సి ఉంటుంది. శరీరం బలహీనత ఉంటుంది. 
శుభ వర్ణం: - పసుపు
శుభ సంఖ్య: 5
 

కర్కాటకం:
మానసికంగా, శరీరకంగా మీకు విశ్రాంతి అవసరం. కొత్త విషయాల గురించి ఆలోచించండి. మిమ్మల్ని మానసిక వేదనకు గురిచేసిన పాత విషయాలు మారతాయి. కానీ ఈ మార్పు మీకు మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. మారుతున్న పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కార్యాలయంలో ఆకస్మికంగా ఉన్నత పదవిని పొందవచ్చు. అవివాహితులు కుటుంబ ఒత్తిడిని ఎదుర్కొంటారు. అశాంతి, చికాకులు పెరగడం వల్ల ఆరోగ్యంలో మార్పులు వస్తాయి.
శుభ వర్ణం: - తెలుపు
శుభ సంఖ్య: 7

సింహం: -
ప్రతి సందర్భంలో  మీరు విజయం సాధిస్తారు. అడ్డంకులు ఉన్నప్పటికీ మీరు ఊహించని విధంగా పనులు జరుగుతాయి. ఇబ్బందులు ఎన్నున్నా.. కొత్త విషయాలను నేర్చుకుంటున్నారు. కొన్ని విషయాలను విస్మరించడం వల్ల జీవితంతో ముడిపడి ఉన్న ప్రతికూల విషయాలపై మీ దృష్టి ఉంటుంది. వైద్య రంగంలో ఉన్న వ్యక్తులకు వారి సామర్థ్యం కంటే ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తే దానిని సీనియర్ అధికారులకు నివేదించండి. జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్థలను తొలగించుకోవడానికి ఇరు పక్షాల నుంచి ప్రయత్నాలు ఉంటాయి. జీర్ణ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
శుభ వర్ణం: - బూడిద
శుభ సంఖ్య: 6

కన్య: - 
కుటుంబంతో గడిపే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులంతా దగ్గరవుతారు. సంతానం వల్ల కుటుంబంలో సంతోషం, శాంతి వాతావరణం ఉంటుంది. అనుకున్నట్లుగానే పిల్లల జీవితాల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయంతో వ్యాపార సంబంధిత ప్రణాళికలు రూపొందించవచ్చు, అయితే ఈ ప్లాన్‌పై పనిచేసేటప్పుడు సంబంధం చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రేమ వివాహం కోసం కుటుంబం నుంచి ఆకస్మిక సమ్మతిని పొందవచ్చు. కంటి మంట, కంటి సంబంధిత సమస్యల బారిన పడతారు. 
శుభ రంగు: - నీలం
శుభ సంఖ్య: 8

తుల: - 
మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడవచ్చు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు మానసికంగా సిద్ధంగా లేకపోయినా, ప్రతి ఫలితం గురించి జాగ్రత్తగా ఆలోచించండి. దీనివల్ల మీరు కొంత రిస్క్ తీసుకోవచ్చు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడండి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. చిన్న చిన్న విషయాలు మీ ఏకాగ్రతకు భంగం కలిగిస్తాయి. ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా సంభవించే సమస్యను అధిగమించడానికి డాక్టర్ సలహాను తీసుకుంటారు. 
శుభ వర్ణం:- ఆకుపచ్చ
శుభ సంఖ్య: 1


వృశ్చికం: 
మీరు సమర్థుడని గ్రహించినప్పటికీ మీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం సాధ్యం కాదు. మీ చుట్టూ ఉన్న వాతావరణం మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఎలాంటి సంఘటనలైనా  మీలో అహంకారాన్ని లేదా ప్రతీకారాన్ని కలిగించనివ్వవద్దు. మీ పనికి సంబంధించిన కొత్త అవకాశాల కోసం వెతకడం ప్రారంభించండి. మీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి జోక్యం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది సంబంధంలో ఉద్రిక్తతను పెంచుతుంది. 
శుభ రంగు: - గులాబీ
శుభ సంఖ్య: 3

ధనుస్సు: - 
ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా తన జీవితానికి బాధ్యత వహించడం నేర్చుకోవాలి. అది డబ్బు లేదా ఆస్తికి సంబంధించినది కావచ్చు. నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన, పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో చర్చించాలి. మీ స్వంత ఆలోచనలను నిజం అని అనుసరించడం కొన్ని తప్పులకు దారితీయవచ్చు. మీరు ఉద్యోగానికి తగిన వ్యక్తులతో సులభంగా కనెక్ట్ అవుతారు. సంబంధ నిర్ణయాలకు తొందరపడకండి. దగ్గు, జలుబు సమస్యలు తగ్గుముఖం పడతాయి.
శుభ రంగు: - నీలం
శుభ సంఖ్య: 2

మకరం: 
మీరు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడే వ్యక్తులతో సరైన సంబంధాలను కొనసాగించడం కీలకం. మీరు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. వెంటనే పెద్ద మార్పులు జరగాలనుకోవడం తప్పు. పనికి సంబంధించిన ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి పట్ల మనసులో అనేక రకాల సందేహాలు తలెత్తవచ్చు. వారు మీపై ఆధిపత్యం చెలాయించరు. ఉదయాన్నే ఆరోగ్యానికి సంబంధించిన మార్పులను గమనించవచ్చు.
శుభ రంగు: నీలం
శుభ సంఖ్య: 9

కుంభం: 
జీవితంలో సమతుల్యంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఇతర వ్యక్తులు అందించే సాయం కోసం ఎదురు చూడకండి. మీ రంగంలో ఉన్నత స్థానం సాధించిన వ్యక్తులు స్ఫూర్తి పొందుతూనే ఉంటారు. భాగస్వామి తీసుకున్న నిర్ణయం అకస్మాత్తుగా పెద్ద మార్పును కలిగిస్తుంది. గొంతుకు సంబంధించి సమస్య ఎక్కువ అవుతుంది. 
శుభ రంగు: పసుపు
శుభ సంఖ్య: 2

మీనం: 
మీ వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్న కొన్ని పనులు జరుగుతాయి. కాబట్టి మీరు ఈ సమయంలో ప్రతి పనిని సరిగ్గా చేయాలి. మీ ప్రణాళికకు కట్టుబడి ఉండకపోవడం ద్వారా కొన్ని సమస్యలను ఏరికోరి కొనితెచ్చుకుంటారు. మీపై కోపంగా ఉన్న వ్యక్తుల మధ్య సంబంధాలు వదిలించుకోవడానికి ప్రయత్నించండి. మార్కెటింగ్ రంగంలో మీరనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదు. మీ జీవిత భాగస్వామి ఏ నిర్ణయంపైనా దృఢంగా లేనందున మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. బీపీలో హెచ్చుతగ్గుల కారణంగా నెర్వస్ గా ఫీల్ అవుతారు.
శుభ వర్ణం: - ఊదా
శుభ సంఖ్య: 2

click me!