మీ ఇంట్లో డబ్బు ఉంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి

First Published | Nov 1, 2024, 5:10 PM IST

ప్రతి ఒక్కరి ఇంట్లో డబ్బు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ డబ్బు రెట్టింపు కావాలంటే మాత్రం మీరు కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. అవేంటంటే?

డబ్బు వాస్తు చిట్కాలు

రోజూ పనిచేస్తూ.. బాగా డబ్బును సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాగే ఎలాంటి కష్టాలు రాకుండా, ఎంతో కొంత డబ్బును వెనకేసుకోవాలని ఆశపడుతుంటారు. ఇందుకోసం రేయింబవళ్లు కష్టపడేవారు చాలా మందే ఉన్నారు. 

సంపాదించిన డబ్బును ఖర్చులకు పోగా మిగిలినది ఆదా చేయడం వల్ల భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదు.ఈ డబ్బు అత్యవసరాల్లో మనల్ని కాపాడుతుంది. అంతేకాదు మన అభివృద్ధి మనం ఆదా చేసే డబ్బు  మీదనే ఆధారపడి ఉంటుందంటారు పెద్దలు.

కానీ కొంతమంది ఎంతో కష్టపడి పనిచేస్తారు. బాగా డబ్బును సంపాదిస్తారు. అయినా వారు డబ్బును ఆదా చేయరు. ఎప్పటికప్పుడు డబ్బు అయిపోతూనే ఉంటుంది. ఇది మీ దరిద్రాన్ని సూచిస్తుంది. అందుకే దీని నుంచి ఎలా బయట పడి డబ్బును ఎలా పోగొయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

నిజానికి పైసలు పర్మనెంట్ ఆస్తి అయితే కాదు. కానీ ఇది మనిషికి చాలా అవసరం. ఇప్పుడు ధనవంతుడిగా ఉన్న వ్యక్తి రేపు నిరుపేదగా మారొచ్చు. ఎందుకంటే విధిని మనం ఊహించలేం. అందుకే సంపాదిస్తున్నప్పుడే  డబ్బును ఆదా చేయడం చాలా అవసరం.

ఇదే మనల్ని ఆపదలో కాపాడుతుంది. సంపాదించిన డబ్బున కేవలం ఖర్చు మాత్రమే పెట్టకుండా.. పోగొయ్యడం నేర్చుకోవాలి. అలాగే ఆదాగా కాకుండా పెట్టుబడిగా కూడా కొంత ఉండాలి. మీ దగ్గర ఉన్న మొత్తం డబ్బును ఖర్చు చేసే అలవాటును మానుకుంటేనే మీరు ఎంతో కొంత వెనకేసుకోగలుగుతారు. 

డబ్బు వాస్తు చిట్కాలు

మీ ఇంటి ప్రతి మూలలో డబ్బు ఉండేలా చూసుకోవాలంటారు జ్యోతిష్యులు, డబ్బు మొత్తాన్ని ఖర్చు చేయడం గానీ, పర్సులోనే ఉంచుకోవడం గానీ చేయకూడదంటారు జ్యోతిష్యులు. అయితే మీరు డబ్బు పెట్టే చోట నోట్లతో పాటుగా చిల్లర కూడా ఉండాలి. ప్రతి ఒక్క గదిలో ఎంతో కొంత డబ్బు ఉండేలా చూసుకోవాలంటారు జ్యోతిష్యులు. అన్నపూర్ణ ఉండే వంటగదిలో కూడా డబ్బును ఉంచాలి. 

ఒకప్పుడు ఆడవాళ్లు వంటగదిలో ఉండే పోపు డబ్బాలు, బియ్యం డబ్బాల్లో ఖచ్చితంగా డబ్బును దాచుకునేవారు. మసాలా డబ్బా నుంచి బియ్యం బస్తా వరకు.. వంటింట్లో చాలా చోట్ల డబ్బును దాస్తుంటారు. డబ్బును ఆదా చేసే నియమం ఒకటి ఉంది. దీన్ని ఫాలో అయ్యే ఇండ్లలో డబ్బులకు ఎలాంటి లోటు ఉండదు.

అయితే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండకూడదంటే మాత్రం ఇంట్లో ఉన్న డబ్బును తరచుగా లెక్కించకూడదు. ఇలా తరచుగా లెక్క పెట్టినా ఇంట్లో డబ్బు ఉండదనే నమ్మకం ఉంది.


డబ్బు వాస్తు చిట్కాలు

ఇంట్లో ఒక్కరు మాత్రమే డబ్బును ఆదా చేయకుండా.. ఇంట్లో ఉన్న పెద్దలు, పిల్లలు అందరూ ఇలా విడివిడిగా డబ్బును ఆదా చేయాలంటారు జ్యోతిష్యులు. మీకు తెలుసా? పిల్లలకు చిన్న వయసులోనే డబ్బును ఆదా చేయడం నేర్పించాలి. గుడికి వెళ్ళడానికి ఎప్పుడూ మట్టి  కిడ్డీ బ్యాంక్ లో డబ్బు దాచుకోండి. ఇకపోతే గుడి హుండీల్లో చిల్లరను మాత్రమే కాకుండా, అప్పుడప్పుడూ నోట్లను కూడా వేయండి. 

డబ్బు ఆదా చేసే పద్ధతి

డబ్బు ఆదా చేసే పద్ధతి; 

డబ్బును ఎప్పుడూ కూడా ఎవ్వరికీ తెలియకుండా దాచి ఆదా చేయాలి. డబ్బును చాకచక్యంగా దాచి ఉంచే వారికి డబ్బు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. మీరు గమనించారో లేదో కానీ డబ్బు అన్ని వేళలా ఉండదు.  అందుకే అది ఉన్నప్పుడే జాగ్రత్తగా దాచుకోవాలి. 

వంటింట్లో డబ్బును ఆదా చేసే అలవాటున్న ఆడవాళ్ల చేతిలో డబ్బు ఎక్కువగా ఉంటుంది. జ్యోతిష్యుల ప్రకారం.. ఆడవాళ్ల చేతుల్లో శుక్రుడు ఉంటాడని చెప్తారు. శుక్రుని అనుగ్రహం ఉన్న ఆడవాళ్లు డబ్బును ఆదా చేయడంలో  జాగ్రత్తగా ఉంటారు. వీరిలో డబ్బును ఆదా చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. 

డబ్బు ఆదా కావాలంటే చేయకూడని తప్పులు

డబ్బు ఆదా కావాలంటే చేయకూడని తప్పులు; 

వంటగదిలో డబ్బును ఆదా చేసే ఆడవారు వండిన ఆహారాన్ని వృధా అస్సలు చేయకూడదు. అలా చేస్తే మీ చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. అలాగే వంట చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం మాడిపోనివ్వకూడదు. ఇలా అయితే మీ ఇంట్లోకి దరిద్రం వస్తుంది. 

దీనివల్ల ఇంట్లో డబ్బు ఆదా కాకుండా బాగా ఖర్చవుతూనే ఉంటుంది. వంట చేసేటప్పుడు తరచుగా ఫుడ్ మాడిపోవడం, వంటకు వాడే దుస్తులు కాలిపోవడం వంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. ఇలాంటివి తరచుగా జరిగితే ఇంట్లో డబ్బు నిల్వ ఉండదు. 

ఇంట్లో పాలను కాచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పాల పాత్రలను ఎప్పుడూ కూడా శుభ్రంగా కడిగి పాలను కాయాలి. పాలు గిన్నెలో అడుగంటిపోవడం, పాలు విరిగిపోవడం వంటివి చెడుకు సంకేతాలు. వండే అన్నం మెత్తగా అవడం, కూరల్లో ఉప్పు ఎక్కువగా కావడం వంటివి చేయడం వల్ల మీ ఇంట్లోకి దరిద్రం వస్తుంది.

ఇలా తరచుగా జరిగితే మీ ఇంట్లో డబ్బు నిల్వ ఉండదంటారు జ్యోతిష్యులు. అందుకే ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోండి.

Latest Videos

click me!