రోడ్డుపై పడేసిన నిమ్మకాయల్ని తొక్కితే ఏమౌతుందో తెలుసా?

First Published | Nov 1, 2024, 3:39 PM IST

మూడు బాటల దగ్గర నడకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, కుంకుమ, పసుపుపై నుంచి దాటకూడదని ఇంట్లో పెద్దలు చిప్పిన మాట వినే ఉంటారు. ఇలా ఎందుకు చెప్తారో తెలుసా? 

ఇప్పటికీ పెద్దలు కొన్నింటిని బాగా నమ్ముతారు. ముఖ్యంగా రోడ్డుపై వేసిన పసుపు, కుంకుమలతో ఉన్న నిమ్మకాయపై దాటకూడదని, మూడు బాటల దగ్గర నడవకూడదని ఇలా కొన్ని విషయాలను ఖచ్చితంగా పాటిస్తారు. పొరపాటున వీటిపై నుంచి దాటితే మాత్రం ఖచ్చితంగా జ్యోతిష్యుల దగ్గరికి వెళుతుంటారు.

వీటివల్ల తమకు ఏదో చెడు జరుగుతుందని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. నిజానికి వీటికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ వాస్తవాలు లేవు. కానీ జ్యోతిష్యంలో ఈ విషయాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం.. రోడ్డుపై పడేసిన ఏయే వస్తువులపై దాటకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

=

రోడ్డుపై పడున్న చనిపోయిన జీవిపై నుంచి దాటొద్దు

జ్యోతిష్యం ప్రకారం.. చనిపోయిన జీవిపై  పొరపాటున కూడా కాలు పడటం మంచిది కాదు. దీనివల్ల మీరు పాపం చేసిన లెక్కకిందికే వస్తుంది. అంతేకాదు చనిపోయిన జీవి శరీరం నుంచి వెలువడే ప్రతికూలత కూడా మీపై ప్రభావం చూపుతుందని చెప్తారు. 

కాలిన కట్టె 

కాలిన కట్టె రెండు విషయాలకు ప్రతీక. ఒకటి ఆ కట్టెతో మనుషులను దహనం చేయడం. లేదా ఆ కట్టె నుంచి ఏదైనా తాంత్రిక ప్రయోగం చేయొచ్చు. అందుకే రోడ్డుపై ఉన్న సగం కాలిన కట్టెపై పొరపాటున కూడా అడుగు వేయకూడదని జ్యోతిష్యులు చెప్తారు. 
 

Latest Videos


Hindu beliefs

వెంట్రుకలు

జ్యోతిష్యుల ప్రకారం.. మంచైనా లేదా చెడైనా ఈ శక్తి రెండూ ముందుగా తల నుంచే శరీరంలోకి ప్రవేశిస్తాయని అంటారు. అందుకే ఇలాంటి పరిస్థితిలో.. ఒక శక్తి జుట్టులో కూడా పెరుగుతుందని నమ్ముతారు. కాబట్టి రోడ్డుపై పడున్న వెంట్రుకలపై అడుగు వేయకండి. 

Hindu beliefs

ఆహారం 

ఏదిఏమైనా సరే ఆహారాన్ని మాత్రం అగౌరవపరచకూడదు. ఆహారాన్ని అగౌరవపరచడం దేవునినే అగౌరవ పరచడంగా పరిగణిస్తారు. అందుకే ఆహారాన్ని తొక్కకూడదంటారు. వీటితో పాటుగా ధాన్యాలను మాంత్రికానికి కూడా ఉపయోగిస్తారు. కాబట్టి రోడ్డుపై పడి ఉన్న ఆహారంపై అడుగు వేయడం, దానిపై నుంచి దాటడం చేయకండి. 
 

Hindu beliefs

రోడ్డుపై పడి ఉన్న ఇలాంటి వాటిపై కూడా దాటొద్దు

పెద్దలు చెప్పినట్టుగా గాజులు, కుంకుమ, పసుపు, కర్పూరం, నల్ల దుస్తులు, చిరిగిన బూట్లు, నిమ్మకాయ, కారం, లవంగాలు మొదలైనవి రోడ్డుపై ఉంటే వాటిపై పొరపాటున కూడా తాగకండి. పాదాలను ఆనించకండి. లేదంటే నెగెటివ్ ఎనర్జీ శరీరంలోకి ప్రవేశిస్తుంది.

click me!