కిచెన్ లో చాలా వస్తువులు ఉంటాయి. పప్పులు, ఉప్పులు, కూరగాయలు, పండ్లు.. గిన్నెలు.. ఇతర వస్తువులతో కిచెన్ నిండి ఉంటుంది. ఒక్కోసారి.. వంట చేస్తున్న సమయంలోనో.. లేదో ఏదైనా అవసరమై తీసుకుంటున్నప్పుడో.. ఒక దానిని తీస్తున్నప్పుడు.. మరోటి కింద పడిపోతూ ఉంటాయి. పొరపాటున చేయ్యి జారి కిందపడుతూ ఉంటాయి. అయితే.. కిచెన్ లో కొన్ని వస్తువులు నేలపాలు అయితే.. అది ఇంటికి అరిష్టమట. భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఇవి సూచనలట. మరిర అలాంటి పదార్థాలేంటో ఓసారి చూద్దాం..