Vastu Tips: సాయంత్రం ఇలాంటి పనులు చేస్తే, ధన నష్టం పక్కా..!
ప్రతి ఒక్కరూ కష్టపడేది డబ్బు కోసమే. అయితే.. మనం ఇంట్లో చేసే కొన్ని తప్పుల కారణంగా ధన నష్టం కలుగుతుందని మీకు తెలుసా? మరి, ఆ పనులేంటో చూద్దాం...
ప్రతి ఒక్కరూ కష్టపడేది డబ్బు కోసమే. అయితే.. మనం ఇంట్లో చేసే కొన్ని తప్పుల కారణంగా ధన నష్టం కలుగుతుందని మీకు తెలుసా? మరి, ఆ పనులేంటో చూద్దాం...
ప్రతి ఒక్కరూ కష్టపడేది డబ్బు కోసమే. కానీ, కొందరికి ఎంత కష్టపడి, ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. అలా నిలపడకపోవడానికి ఇంట్లో మనం చేసే తప్పులే కారణం అని మీకు తెలుసా? వాస్తు శాస్త్రం అదే చెబుతోంది.
చాలా మంది ప్రజలు ఇల్లు, దానిలోని వస్తువులు, పరిసరాలు వాస్తు ప్రకారం ఉంటే సంతోషంగా ఉంటారని నమ్ముతారు. వాస్తు ప్రకారం కొన్ని పనులు చేయకూడని సమయాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం సమయంలో కొన్ని పనులు చేయకూడదు. అలా చేస్తే డబ్బు కొరత ఏర్పడుతుంది. లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది.
సూర్యాస్తమయం సమయంలో ఎప్పుడూ తినకూడదు.వాస్తు శాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం సమయంలో ఎవరూ తినకూడదు. ఎందుకంటే ఇది దేవుడిని పూజించే సమయం. ఆ సమయంలో ఆహారం తినడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట.
వాస్తు శాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం సమయంలో లేదా తర్వాత పెరుగును దానం చేయకూడదు. ఇది శుక్ర గ్రహానికి సంబంధించినది. ఇది సంపదకు చిహ్నంగా పరిగణిస్తారు. పెరుగు దానం చేసినా.. ఇంట్లో లక్ష్మదేవి ఉండకుండా వెళ్లిపోతుందట.
పెద్దలు చెప్పేదాని ప్రకారం సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు. సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడం వల్ల ఆరోగ్యం, సంపదపై చెడు ప్రభావం పడుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో చీపురు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఈ సమయంలో చీపురుతో ఊడ్చితే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతుందని నమ్ముతారు.