Mango Tree Vastu: మామిడి చెట్టు ఇంటి ముందు పెంచితే ఏమవుతుంది?

Published : May 02, 2026, 01:48 PM IST

Mango Tree Vastu: మొక్కలు పెంచాలంటే అందరికీ ఇష్టమే. కానీ వాస్తు ప్రకారం ఏ చెట్టు ఎక్కడ ఉండాలో కూడా ముఖ్యం. మన ఆచారం ప్రకారం మామిడి పండ్లు, ఆకులకు ప్రాధాన్యత ఉంది. కానీ ఇంటి ముందు మామిడి చెట్టు పెంచడం మంచిదేనా ? వాస్తు నిపుణులు ఏం చెప్తున్నారంటే.. 

PREV
16
వాస్తు ప్రకారం మామిడి చెట్టు ఇంటి ముందు పెంచితే ఏమవుతుంది?

మన జీవితంలో వాస్తు ఎంత కీలకమో అందరికీ తెలుసు. సరైన పద్ధతిలో పాటిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందకరమైన జీవితం సొంతమవుతుంది. ఒకవేళ వీటిని పట్టించుకోకపోతే మాత్రం అనవసరమైన చిక్కులు పడతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుందట.

26
మంచిదా? కాదా?

వాస్తు ప్రకారం చెట్లను నాటే స్థలం, వాటి దిక్కులు చాలా ముఖ్యమైనవి. ఇంటి ఆవరణలో కొన్ని చెట్లు ఉండటం వల్ల కుటుంబంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. మన ఆచారాల్లో మామిడి చెట్టును అత్యంత పవిత్రంగా భావిస్తాం. కానీ దానిని ఎక్కడ పెంచాలనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా  పాటించాలని వాస్తులు నిపుణులు సూచిస్తున్నారు.

36
శుభమా? అశుభమా?

చాలా మంది తమ ఇంటి ఆవరణలో మామిడి చెట్టును పెంచుకుంటారు. మరికొందరు పెరట్లో పెంచుతారు. ఇంటి ముందు చెట్లు ఉంటే స్వచ్ఛమైన గాలి వస్తుందని, పండ్ల చెట్లు ఉండటం చాలా మంచిదని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తు ప్రకారం కొన్ని చెట్లు అశుభం. మరి మామిడి చెట్టు సంగతేంటి?

46
చెట్టు నీడ ఇంటిపై పడకూడదు
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి ముందు మామిడి చెట్టు ఉండటం అంత మంచిది కాదు. ఇది అనేక సమస్యలకు దారితీస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకే ఇంటికి కొంచెం దూరంగా, చెట్టు నీడ ఇంటిపై పడని చోట మామిడి చెట్టును నాటడం ఉత్తమం.
56
నెగెటివ్ ఎనర్జీ ప్రభావం
ఇంటి ముందు మామిడి చెట్టు ఉండటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు, కుటుంబంలో కలహాలు, సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇంటి ముందు మామిడి చెట్టు ఉంటే నెగెటివ్ ఎనర్జీ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అందుకే ఇంటి ముందు మామిడి చెట్టు నాటవద్దని పండితులు సూచిస్తున్నారు.
66
నైరుతి దిక్కులో నాటితే శుభం

మామిడి చెట్టు శుభప్రదమైందే. దీని ఆకులతో ఇంటికి తోరణాలు కడతాం, పండ్లను దేవుడికి నైవేద్యంగా పెడతాం. అందుకే ఇంటి ముందు ఉంటే మంచిదని నమ్ముతారు. కానీ వాస్తు ప్రకారం ఇది సరైంది కాదు. ఒకవేళ మీరు ఇంటి ఆవరణలో మామిడి చెట్టు నాటాలనుకుంటే, దానిని నైరుతి దిక్కులో నాటడం చాలా శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. 

ఈ సమాచారం కేవలం పండితులు, నిపుణుల అభిప్రాయం ఆధారంగా ఇచ్చాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గమనించగలరు.

Read more Photos on
click me!

Recommended Stories