Vastu Tips: ట్యాబ్లెట్స్ రోజూ వేసుకోవడానికి అందుబాటులో ఉండాలని.. ఎదురుగా కనిపించేలా పెట్టుకుంటున్నారా? కానీ, వాస్తు ప్రకారం.. ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో పొరపాటున కూడా మందులు పెట్టకూడదని మీకు తెలుసా?
దాదాపు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు రెగ్యులర్ గా ట్యాబ్లెట్స్ వాడేవారు ఉంటారు. థైరాయిడ్, షుగర్, బీపీ ఇలా దేనికో ఒకదానికి మందులు వాడేవారు మీ ఇంట్లో కూడా ఉన్నారా? అయితే.. వాటిని రోజూ వేసుకోవాలి కదా అని చాలా మంది… ఆ మెడిసిన్ ని.. ఎదురుగా కనిపించేలా పెట్టుకుంటారు. కానీ.. వాస్తు ప్రకారం.. మెడిసిన్స్ ని.. ఇంట్లోని కొన్ని ప్రదేశాల్లో పొరపాటున కూడా ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి, ఏ ప్రదేశాల్లో మెడిసిన్స్ ఉంచడం వల్ల ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం….
24
కిచెన్ లో మెడిసిన్స్..
వాస్తు శాస్త్రం ప్రకారం.. వంట గదిని ఇంట్లోని అత్యంత పవిత్రమైన స్థలంగా పరిగణిస్తారు. ఈ ప్రదేశంలో మనం ఆహారం తయారు చేస్తాం. కాబట్టి… ఈ కిచెన్ లో పొరపాటున కూడా మందులు పెట్టకూడదు. కిచెన్ లో మెడిసిన్స్ ఉంచడం వల్ల ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
34
బెడ్ దగ్గర మందులు
చాలామంది రాత్రి పడుకునేటప్పుడు మందులు వేసుకుంటారు. అందుకే బెడ్ పక్కనే మందులు పెట్టుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మంచం పక్కన లేదా తలగడ కింద మందులు పెట్టకూడదు. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన, నెగెటివ్ ఎనర్జీని పెంచుతుంది.
డబ్బులు దాచే ప్రదేశం…
లాకర్, డబ్బులు పెట్టే కప్‌బోర్డ్ లేదా విలువైన వస్తువులు ఉంచే ప్రదేశంలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. ఈ ప్రదేశాలలో మందులు పెట్టడాన్ని వాస్తు శాస్త్రంలో అశుభంగా భావిస్తారు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు, ముఖ్యంగా ఆరోగ్య సంబంధిత ఖర్చులు పెరుగుతాయని నమ్మకం.
వాస్తు ప్రకారం, మందులను పూజ గదిలో కూడా పెట్టకూడదు. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది. దేవుడి గదికి దూరంగా, శుభ్రమైన, ప్రత్యేకమైన కప్‌బోర్డ్‌లో మందులు పెట్టడం ఉత్తమం. వీలైతే, ఇంటికి ఈశాన్య దిశలో ఉన్న కప్‌బోర్డ్‌లో వాటిని సర్దిపెట్టుకోవచ్చని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.