ఫిబ్రవరి నెల ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ నెలలోనే ప్రేమికుల రోజు వస్తుంది కావట్టి. ఈ వాలెంటైన్స్ డే కోసం ప్రేమికులు ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూస్తారు కూడా. ప్రేమికులు తమ మనసులోని మాటలను చెప్పడానికి బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజును మరింత ప్రత్యేకం చేయడానికి మీ రాశిచక్రం.. ప్రకారం మీ భాగస్వామికి బహుమతులు ఇస్తే.. మీ బంధం మరింత బటపడుతుంది. మరి ఏ రాశి వారికి ఎలాంటి బహుమతి ఇవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వృషభ రాశి: వాలెంటైన్స్ డే రోజున ఈ రాశివారికి మీరు పెన్ డ్రైవ్ ను ఇవ్వడం వారికి మంచిది. వీటితో పాటుగా మీరు గాడ్జెట్లు, కుక్ బుక్స్, స్కార్ఫ్ లు, బ్రాండెడ్ దుస్తులు, ఇంటి అలంకరణ వస్తువులు, స్వెట్టర్లు మొదలైనవి వాటిని కూడా బహుమతిగా ఇవ్వొచ్చు.
మేష రాశి : మీ భాగస్వామి మేష రాశి వారైతే వారికి గడియారాలు, దుస్తులు, రంగురంగుల నెక్లెస్ లు, జాకెట్లు, గాడ్జెట్లు, చెవిపోగులు మొదలైన వాటిని బహుమతిగా ఇవ్వొచ్చు.
మిథున రాశి : వాలెంటైన్స్ డే రోజున మిథున రాశి వారికి మొబైల్ ఫోన్, ఆభరణాలు లేదా వాచ్, జంప్ సూట్, షార్ట్స్, కంప్యూటర్, బూట్లు, స్పోర్టీ డ్రెస్, షర్ట్ ను బహుమతిగా ఇవ్వొచ్చు.
కర్కాటక రాశి : వాలెంటైన్స్ డే రోజున మీరు మీ భాగస్వామికి వాచ్, పెర్ఫ్యూమ్, పెర్ల్ నెక్లెస్, బ్రాస్ లెట్, హెల్త్ గ్యాడ్జెట్, దుప్పటి, బట్టలు, హస్తకళలను బహుమతిగా ఇవ్వొచ్చు.
సింహ రాశి: ఈ ప్రేమికుల రోజున మీ భాగస్వామి సింహరాశి వారైతే మీరు వారికి జాకెట్, చెవిపోగులు, బ్రాండెడ్ వాచ్ లేదా పెండెంట్లు, దుస్తులు, బూట్లను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.
కన్యారాశి : వాలెంటైన్స్ డే రోజున మీరు మీ కన్యా రాశి భాగస్వామికి దుస్తులు, బూట్లు, చెప్పులు, వ్యక్తిగత సంరక్షణ, బాడీ కేర్, హెయిర్ స్పా ట్రీట్మెంట్ గిఫ్ట్ వంటి వోచర్లను బహుమతిగా ఇవ్వొచ్చు.
తులా రాశి: ఈ ప్రేమికుల రోజు మీరు మీ భాగస్వామికి టై, షర్ట్, నెక్లెస్, లెదర్ బ్యాగ్, జాకెట్, పెర్ఫ్యూమ్, బ్రాస్లెట్, గాడ్జెట్, పర్స్ / వాలెట్ లేదా పురాతన వస్తువులను బహుమతిగా ఇవ్వొచ్చు.
వృశ్చిక రాశి: ప్రేమికుల రోజున మీ భాగస్వామికి మీరు బ్లాక్, గోధుమ రంగు చొక్కాలు, టూర్ ప్యాకేజీలు, గాజులు లేదా ఉంగరాలు, పురాతన ఆభరణాలు లేదా సుగంధ ద్రవ్యాలు, నెక్లెస్లలో ఏదో ఒకటి బహుమతిగా ఇవ్వొచ్చు.
ధనుస్సు రాశి: వాలెంటైన్స్ డే రోజున ధనుస్సు రాశి వారికి నావిగేషన్ సిస్టమ్, ట్రావెల్ బ్యాగ్, టూర్ ప్యాకేజీ, స్పోర్ట్స్ షూస్, యోగా డెస్టినేషన్ ప్యాకేజీ, పెర్ఫ్యూమ్ మొదలైనవి బహుమతిగా ఇవ్వొచ్చు.
మకర రాశి : ప్రేమికుల రోజున మకర రాశి భాగస్వామికి స్వెట్టర్లు, బూట్లు, సూట్లు, మొబైల్స్, ల్యాప్టాప్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ డైరీలు, దుస్తులు, హెల్మెట్లు, గ్లౌజులు, బహుమతులు, ట్రాక్సూట్లు, అందమైన నైట్ లైట్లు, షూస్, నైట్ గౌన్లను బహుమతిగా ఇవ్వొచ్చు.
కుంభ రాశి : వాలెంటైన్స్ డే రోజున మీ కుంభ రాశి భాగస్వామికి స్మార్ట్ ఫోన్, లేటెస్ట్ గాడ్జెట్స్, ల్యాప్ టాప్, మంచి దుస్తులు, లేటెస్ట్ టీవీ, అల్ట్రా పవర్ కంప్యూటర్, జువెలరీ, మేకప్ కిట్, ఏదైనా ఫ్యాషన్ ఐటమ్ లేదా పెర్ల్ నెక్లెస్ ను బహుమతిగా ఇవ్వొచ్చు.
మీన రాశి : ప్రేమికుల రోజున మీ మీన రాశి భాగస్వామికి ఎలక్ట్రానిక్ టేబుల్ క్యాలెండర్, బూట్లు, మంచి డిజైన్ ఉన్న నైట్ వేర్, కార్డ్ హోల్డర్, వాచ్, మొబైల్, ఆడియో బుక్స్, ఇయర్ప్లగ్స్, బ్లూటూత్ మొదలైనవి బహుమతిగా ఇవ్వొచ్చు.