వార ఫలాలు : 04-2-24 నుండి 10-2-24 వరకు
జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది) 'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్: 8523814226 (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్య పెట్టండి ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం
telugu astrology
మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
నామ నక్షత్రాలు
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
కొన్ని విషయాలు లో అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తలచిన పనులు కష్టంతో గాని నెరవేరవు. అకారణంగా అధికారులు తో విరోధాలు రాగలవు.గత కొద్ది కాలంలో చేసిన పొరపాట్లు మనోవేదనకు గురి చేస్తాయి.సంతానమునకు అధికంగా ఖర్చు చేస్తారు.ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు. వ్యాపార విషయాలు లో ఆటుపోట్లు ఉన్నప్పటికీ నిలదొక్కుకుంటారు. అధిక శ్రమ చేత లాభాలు పొందగలరు. ఆరోగ్యం విషయంలో అలసత్వం వహించరాదు ఇబ్బందులు తప్పవు. కోర్టు వ్యవహారాలు ఒక ఇంత పరిష్కారం కావు.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సత్ఫలితాలను పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యపరమైన విషయాలు లో మంచి మార్పులు రాగలవు. ఉద్యోగస్తులు ఉద్యోగాలు లో తమదైన ప్రతిభను కనబరుస్తారు. చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించుకుంటారు.అన్ని వర్గాల వారు తమ స్వశక్తితో అన్నింటా విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సమాజము నందు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా గడుపుతారు.
telugu astrology
మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
నామ నక్షత్రాలు(కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ అభివృద్ధి కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. శత్రువులపై విజయం సాధించగలరు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయ వ్యయములు సమపాళ్లలో ఉండును. ధనాన్ని ఖర్చు చేయడంలో సమతుల్యతను పాటిస్తారు. ఆదాయమును గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. బంధుమిత్రులు సహాయ సహకారాలు ఉంటాయి.సాహసోపేతమైన నిర్ణయాలు అనుకూలిస్తాయి.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 2
తొందరపాటు మాటల వల్ల ఇబ్బందులకు గురి అవుతారు.జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహన ప్రమాదాలు మరియు వాహన ఇబ్బందులు కలుగును. ఉద్యోగాలు లో సహోద్యోగులతో మీ మాట తీరు తో ఇబ్బందులు కలుగుతాయి తలపెట్టిన పనులు లో కొద్దిపాటి ఇబ్బందులు కలిగిన చివరకు పూర్తిగా గలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విషయంలో ఆకస్మిక సంఘటనలు ఎదురవగలవు. ముఖ్యమైన విషయాల్లో నిదానమే ప్రధానం గా ముందుకు సాగాలి.
telugu astrology
సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 1
సమాజంలో ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ పరమైన బరువు బాధ్యతలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో చికాకులు కలుగును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిది. విద్యార్థులు అధిక శ్రమ చేత పరీక్షల్లో విజయం సాధిస్తారు. అనేక సమస్యలు చుట్టుముట్టినప్పుడు కి ధైర్యంగా ముందుకు సాగుతారు. కుటుంబ పోషణ నిమిత్తం అధికంగా కష్టపడాల్సి వస్తుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అనవసర ఖర్చులు పెరగకుండా వ్యవహరించాలి. ఇతరుల సహాయ సహకారాల కోసం ఎదురు చూడవలసి వస్తుంది.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 5
వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతారు. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు.విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైన లావాదేవీలు సంతృప్తినిస్తాయి.ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.తలపెట్టిన పనులు పరిపూర్ణంగా పూర్తి కాగలవు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు
telugu astrology
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 6
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
ఆర్థిక వ్యవహారాల్లో నియంత్రణ అవసరం. తలపెట్టిన కార్యాలలో అతి కష్టం మీద పూర్తిగా గలవు. సమాజంలో ఆచితూచి మాట్లాడుతూ వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శత్రువుల వలన సమస్యలు రాగలవు. వృత్తి వ్యాపారాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ సమస్యల వలన మానసిక ఆందోళన కలుగుతుంది. తలచిన కార్యాలు లో అనుకోని విధంగా ఇబ్బందులు రాగలవు. ఇతరులతో సంభాషణ విషయంలో లౌక్యంగా వ్యవహరించాలి. సంతానం వలన చిన్నపాటి ఇబ్బందులు కలుగుతాయి.
telugu astrology
వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9
వృత్తి పరమైన విషయాలు లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అధిక ఆదాయం కోసం అనేక ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.దూరపు ప్రయాణాలు వలన లాభము కలుగును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు.ఉద్యోగాలలో చిన్నపాటి చిక్కులు ఉన్నప్పటికీ అవి సానుకూలంగా మార్చుకుంటారు. ప్రారంభించిన పనులు పూర్తి కాగలవు. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. ఓర్పు సహనం చేత అనుకున్న పనులు. సాధిస్తారు. ప్రయత్న చేత కార్యాలు అనుకూలిస్తాయి. మానసికంగా ధైర్యంగా ఉంటారు.
telugu astrology
ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
ఆరోగ్య విషయంలో అలసత్వం ప్రదర్శించరాదు. మీ ఆలోచనలకు సక్రమంగా లేక నిరాశ చెందుతారు. న్యాయపరమైన విషయంలో రాజీ పడాల్సి వస్తుంది. ప్రతి పనులు ఆలస్యం అగుట చేత ఒత్తిడి పెరుగుతుంది. సమాజం నుండి అపవాదము నిందలు పడ వలసి వచ్చును. సోదర వర్గంతో లౌక్యంగా ఉండాలి.కుటుంబ సభ్యులు తో భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి. మానసిక చింతన పెరుగుతుంది. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న ఒక వ్యక్తి తో గొడవలు లో చిక్కుకుంటారు.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
వృత్తి ఉద్యోగాలు లో మీదైన తరహా గుర్తింపు లభిస్తుంది. సమాజము నందు గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఆదాయ మార్గం పై ఎక్కువ ఆసక్తి చూపుతారు. గృహమునందు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బాకీలు వసూలు అవుతాయి. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుండి ఒకింత మేలు జరుగుతుంది. అన్నింట సోదర వర్గము నుండి సహాయ సహకారాలు ఉంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతటి కష్టమైన పని అయినా సులభంగా పూర్తి అవుతుంది.
telugu astrology
కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 8
అధికారుల వల్ల లాభము కలుగును. ప్రముఖులతో స్నేహ సంబంధాలు కలుగుతాయి.అన్ని విషయాల్లోనూ అవసరానికి తగినట్లుగా సమర్థించుకుంటారు. నూతనమైన పనులు కొన్నింటిని ప్రారంభించ గలుగుతారు. ఇంకా బయట అనుకూలంగా ఉండును. అవసరానికి సరిపడా ఆదాయం లభిస్తుంది. ఇతరులతో విరోధాలు ఏర్పడిన విజయం లభిస్తుంది. చేసే పనులలో ఆత్మవిశ్వాసం పెరిగే విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
నామ నక్షత్రాలు (దీ--దూఝ-దా-దే-దో-చా-చి)
ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 3
కుటుంబంలో ఎవరికి వారు వారి ప్రవర్తన తో వ్యవహరిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఒక ప్రణాళిక బద్ధంగా చేయడం వలన వ్యవహారాలు పూర్తి కాగలవు.వృత్తి ఉద్యోగాల్లో అంకిత భావంతో చేయడం మంచిది.క్రయ విక్రయాలు విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలను స్తబ్దత ఏర్పడును. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసి వస్తుంది. సోదరుల మూలకంగా ఒకింత చిన్నపాటి కలహములు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యక్రమంలో పాల్గొంటారు.