Ugadi Rashi Phalalu: విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు

Published : Mar 19, 2025, 01:24 PM ISTUpdated : Mar 21, 2025, 02:52 PM IST

2025 మార్చి 31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో మూడో రాశి అయిన మిథున రాశి వారికి ఎలా ఉందో సవివరంగా తెలుసుకుందాం.. 

PREV
15
Ugadi Rashi Phalalu: విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి ఫలితాలు
Ugadi 2025 mithuna rashi phalalu gemini Horoscope Yearly Predictions

మిథున రాశి ఆదాయం-14, వ్యయం-2, రాజ్యపూజ్యం-4, అవమానం-3

2025 మార్చి 31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో మూడో రాశి అయిన మిథున రాశి వారికి ఎలా ఉందో సవివరంగా తెలుసుకుందాం.. 

ఈ ఉగాది సంవత్సరం మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఏడాది తొలి భాగంలో గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఫలితంగా వారు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. కానీ ఏడాది మధ్యలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు.గురు, శని, రాహు, కేతువుల సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మానసిక ఆందోళన, అనుకోని ఖర్చులు, కుటుంబ సంబంధిత సమస్యలు ఎదురౌతాయి.అయితే, సంతానం, ఉద్యోగం, వ్యాపారం వంటి అంశాల్లో మాత్రం పురోగతి సాధించగలరు. ఈ విషయంలో చాలా సంతృప్తి చెందుతారు.
 

25

 విశ్వావసు నామ సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి:
ఆర్థిక వ్యవహారాల్లో ఈ సంవత్సరం ప్రారంభం కొంత మిశ్రమంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు ఆచితూచి వేయడం మంచిది. ఆగస్టు నెల తర్వాత మెరుగైన ధన యోగం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి రియల్ ఎస్టేట్, భూమి కొనుగోలు అవకాశాలు ఉన్నాయి. అప్పులు, రుణప్రయత్నాలు మధ్యభాగంలో విజయవంతం కావచ్చు.
 

విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి ఆరోగ్య పరిస్థితి...

ఈ సంవత్సరం మిథున రాశివారికి ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొలి మూడు నెలల్లో మానసిక ఒత్తిడి, కంటి సమస్యలు, అలసట పెరిగే అవకాశం ఉంది. కాలం మారినప్పుడు జలుబు, దగ్గు, అలర్జీలు చికాకు పెడతాయి. ఆహార నియమాలు పాటించకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. నడుం, మోకాళ్ల నొప్పులు, మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్ మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిది.
 

35

విశ్వావసు నామ సంవత్సరంలో  వ్యాపారం & ఉద్యోగం ఎలా ఉందంటే...
వ్యాపారం చేసే వారికి ప్రారంభంలో కొంత మందకొడిగా సాగినప్పటికీ, మే నెల తర్వాత స్పష్టమైన లాభదాయక పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త పెట్టుబడులు సురక్షితంగా ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం కలసి వస్తుంది. ప్రమోషన్లు, వేతనవృద్ధి అవకాశాలు ఉన్నాయి. అయితే, మధ్య తరగతి ఉద్యోగులకు కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మార్పులు, బదిలీలు ఉండొచ్చు.

45

నెలవారీ రాశి ఫలితాలు
ఏప్రిల్ 2025:
ఈ నెలలో శుభకార్యాలకు అనుకూలం. వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది. ధనవృద్ధి సూచనలు కనిపిస్తాయి. ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. ప్రయాణాలలో లాభం ఉంది.

మే 2025:
ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. కోర్టు వ్యవహారాల్లో నిరాశ కలుగుతుంది. కుటుంబ సమస్యలు చికాకు పెడతాయి. స్నేహితుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.

జూన్ 2025:
ఉద్యోగ రంగంలో ఒత్తిడి పెరిగే అవకాశం. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఖర్చులు పెరిగినా, లాభాలు కూడా కనిపిస్తాయి. రియల్ ఎస్టేట్, భూమి సంబంధిత లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి.

జూలై 2025:
కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ధన యోగం ఏర్పడుతుంది. ఉన్నత అధికారుల సహాయంతో ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి.
 

55

ఆగస్టు 2025:
ఈ నెలలో వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. కుటుంబసభ్యులతో అపార్థాలు దూరం చేయడం మంచిది.

సెప్టెంబర్ 2025:
ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందుకు సాగండి. అనుకోని వ్యయాలు ఉండొచ్చు. ఉద్యోగస్తులకు ఒత్తిడిగా ఉంటుంది.

అక్టోబర్ 2025:
ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. ఊహించని లాభాలు రావచ్చు. కొన్ని విజయవంతమైన ప్రాజెక్టులు పూర్తవుతాయి. సంతానం విషయంలో మంచి వార్త వింటారు.

నవంబర్ 2025:
ఇంటి మార్పులు, భూమి కొనుగోలు, ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన కొన్ని సమస్యలు తలెత్తినా, త్వరగా పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు గట్టి పోటీ ఉంటుంది.

డిసెంబర్ 2025:
ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. కుటుంబ గొడవలు తలెత్తే అవకాశం ఉంది. ధన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతంగా సాగుతాయి.

జనవరి 2026:
ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. వివాహయోగం లభించే సూచనలు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అప్పులు తీరుతాయి.

ఫిబ్రవరి 2026:
కుటుంబంలో శుభకార్యాల యోగం. వ్యాపారులకు మంచి సమయం. విదేశీ అవకాశాలు వస్తాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు.

మార్చి 2026:
ఈ నెలలో ధననష్టం, అనుకోని ఖర్చులు పెరిగే సూచనలు. అనవసరంగా ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు.

click me!

Recommended Stories