Vastu: ఈ పక్షులు మీ ఇంట్లోకి వచ్చాయా.? మీ రాత మారబోతున్నట్లే..

Published : Mar 19, 2025, 06:46 AM ISTUpdated : Mar 19, 2025, 04:01 PM IST

మన హిందూ సంప్రదాయంలో ఎన్నో విశ్వాసాలు ఉంటాయి. వీటిని ఇప్పటికీ చాలా మంది విశ్వసిస్తుంటారు. అలాంటి వాటిలో పక్షులు ఇంట్లోకి లేదా ఇంటిపైకి రావడం ఒకటి. ఇంతకీ ఎలాంటి పక్షులు వస్తే, ఎలాంటి ఫలితం ఉంటుంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
15
Vastu: ఈ పక్షులు మీ ఇంట్లోకి వచ్చాయా.? మీ రాత మారబోతున్నట్లే..

అదృష్టాన్ని తెచ్చే 3 పక్షులు: హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాస్తు నియమాలు పాటిస్తే జీవితంలో సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయని విశ్వసిస్తారు. అంతేకాకుండా ఇది ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తిని వ్యాప్తి చేయడానికి సహాయపడుతుందని చెబుతారు. ఆ విధంగా వాస్తు శాస్త్రంలో పేర్కొన్న కొన్ని పక్షులు మీ ఇంటి ఆవరణలో లేదా పైకప్పుపై కూర్చుంటే అది చాలా శుభప్రదంగా భావిస్తారు.

25

మీ ఇంటి పైభాగంలో లేదా డాబాపై కూర్చునే పక్షికి ఆహారం అందిస్తే మీ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా మూడు రకాల పక్షులు ఇంటి ఆవరణలోకి లేదా ఇంటిపై వాలితే వాస్తు ప్రకారం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంతకీ ఆ పక్షులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

35
గుడ్లగూబ

నిజానికీ గుడ్లగూబ చాలా అశుభమైన పక్షిగా భావిస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం గుడ్లగూబ మీ ఇంటికి రావడం చాలా శుభప్రదమని పండితులు చెబుతారు. ఎందుకంటే వాస్తు శాస్త్రంలో గుడ్లగూబ సంపద, శ్రేయస్సుకు చిహ్నంగా చెబుతుంటారు. కాబట్టి ఏ ఇంటికి గుడ్లగూబ వస్తుందో ఆ ఇంట్లో సిరిసంపదలు కురుస్తాయని చెబుతారు. అంతేకాదు గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా కూడా చెప్తారు.

45
కాకి

వాస్తు శాస్త్రం ప్రకారం, ఒక కాకి మీ ఇంటి పైకప్పు లేదా ఆవరణకు వస్తే మీ ఇంటికి కొత్త అతిథులు వస్తారని అర్థం. హిందూ మతంలో కాకి ఇంటిపై వాలడం శుభప్రదంగా భావిస్తారు. అయితే కాకి ఇంట్లోకి రావడం మాత్రం మంచిది కాదని అంటుంటారు. సాధారనంగా కాకులకు ఇంట్లోకి వస్తే కొన్ని రోజుల పాటు ఆ ఇంట్లో నివాసం ఉండరు. 

55
చిలక

వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లోకి చిలక రావడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది మీ ఇంటికి సంపదను తీసుకురావడానికి సూచనగా ఉంటుందని చెబుతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయని నమ్ముతారు. హిందూ మతంలో చిలక కుబేరుడికి చిహ్నంగా చెబుతుంటారు. కాబట్టి ఏ ఇంటికి చిలక వస్తుందో ఆ ఇంట్లో సంపద పెరుగుతుందని విశ్వసిస్తుంటారు. 

click me!

Recommended Stories