Ugadi Rashi Phalalu: విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి ఫలితాలు
2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో నాలుగో రాశి అయిన కర్కాటక రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం..
2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో నాలుగో రాశి అయిన కర్కాటక రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం..
కర్కాటక రాశి ఆదాయం-8, వ్యయం-2, రాజ్యపూజ్యం-7, అవమానం-3
2025 మార్చి31 నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం మొదలౌతుంది.ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులలో నాలుగో రాశి అయిన కర్కాటక రాశి గురించి సవివరంగా తెలుసుకుందాం..
ఈ విశ్వావసు నామ ఉగాది సంవత్సరంలో మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. గురు బలం వల్ల ఆర్థిక, కుటుంబ, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో కొంత అభివృద్ధి జరుగుతుంది. కానీ శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల కొన్ని సవాళ్లు ఎదురౌతాయి. ఈ ఏడాది చాలా కష్టపడితే తప్ప విజయాలు అందుకోలేరు. ముఖ్యంగా ఆర్థిక నిర్వాహణ, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి
ఈ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకించి మే నెల నుంచి అక్టోబర్ వరకు ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ధనలాభం అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణానికి ఇది అనుకూల సంవత్సరం.
విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి ఆరోగ్యం..
ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. శరీరానికి సరైన విశ్రాంతి కల్పించాలి. మధుమేహం, రక్తపోటు, నరాల బలహీనత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చలికాలంలో ఆరోగ్యంపై అధిక శ్రద్ధ అవసరం.
విశ్వావసు నామ సంవత్సరంలో కర్కాటక రాశి ఉద్యోగ, వ్యాపారాల పరిస్థితి..
ఉద్యోగస్తులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్, బదిలీ అవకాశాలు ఉంటాయి. పై అధికారులతో సంబంధాలను మెరుగుపరచుకోవాలి. జూలై-అక్టోబర్ మధ్య ఉద్యోగ మార్పులు ఉండొచ్చు. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది.వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కానీ కొత్త పెట్టుబడులు వేసే ముందు సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలి. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు. వ్యాపార సంబంధాలు మెరుగుపరచుకోవడం వల్ల లాభదాయక ఫలితాలు వస్తాయి.
నెలవారీ ఫలితాలు
ఏప్రిల్ 2025
ఈ నెల ప్రారంభంలో అనుకున్న కార్యాలు నెమ్మదిగా పూర్తి అవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు ఉండొచ్చు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ అవసరం. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
మే 2025
ఈ నెల ఆర్థికంగా లాభదాయకం. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, అయితే పై అధికారుల సహాయంతో సమస్యలు పరిష్కరించుకుంటారు. కుటుంబ విషయాల్లో అనుకోని ప్రయాణాలు ఉండొచ్చు. ఆరోగ్యపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఎదురవొచ్చు.
జూన్ 2025
ఈ నెలలో కొన్ని అనుకోని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు. అనవసరంగా నూతన వ్యయాలు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
జూలై 2025
ఈ నెలలో ఉద్యోగ, వ్యాపారరంగాల్లో కొంత కుదుటపడే అవకాశం ఉంటుంది. నూతన ఒప్పందాలు లభిస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలు రావొచ్చు. అయితే అనవసర రుణాలు తీసుకోకూడదు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవొచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
ఆగస్టు 2025
ఈ నెలలో శుభకార్యాల సూచనలు ఉన్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు రావొచ్చు. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలకు సిద్ధం కావచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన సమయం. కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించాలి.
సెప్టెంబర్ 2025
ఈ నెల ఆర్థికంగా కొంత ఒత్తిడిని తీసుకొస్తుంది. అనుకున్న లాభాలు ఆలస్యంగా అందుతాయి. ప్రయాణాలు అధికంగా ఉండొచ్చు. ఆరోగ్యపరంగా కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు, అపార్థాలు తలెత్తవచ్చు. మిత్రులతో సంబంధాలను మెరుగుపరచుకోవడం అవసరం.
అక్టోబర్ 2025
ఈ నెల వ్యాపారులకు కొంత ఒడిదుడుకులను తీసుకురావచ్చు. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావొచ్చు. కొన్ని అనుకోని మార్పులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగ సాధన చేసుకోవడం మంచిది.
నవంబర్ 2025
ఈ నెల అనుకూలంగా ఉండదు. అనుకోని ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన పెట్టుబడులు చేసేందుకు ఇది అనువైన సమయం కాదు. నిత్యజీవితంలో ఆచితూచి వ్యవహరించాలి.
డిసెంబర్ 2025
ఈ నెలలో కొన్ని అద్భుత అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు జరగవచ్చు. కుటుంబంలో శుభకార్యాల సూచనలు ఉన్నాయి. భూమి, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో లాభదాయకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
జనవరి 2026
ఈ నెలలో ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడతాయి. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, అదనపు బాధ్యతలు రావొచ్చు. ప్రయాణ యోగం ఉంది. అనుకోని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో సంతోషకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.
ఫిబ్రవరి 2026
ఈ నెలలో కొంత స్థిరత్వం ఉంటుంది. వ్యాపార అభివృద్ధికి ఇది మంచి సమయం. ఆరోగ్యపరంగా కొన్ని మార్పులు అవసరం. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు అనుకూల సమయం.
మార్చి 2026
ఈ నెలలో ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకోవచ్చు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రుణభారాలు తగ్గే అవకాశం ఉంది.