Dream Meaning: కలలో ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తే అర్థమేంటి..?

Published : Feb 14, 2026, 12:43 PM IST

 Dream Meaning: స్వప్నశాస్త్రం ప్రకారం మనకు వచ్చే ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. మరి కలలో ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నట్లు కనపడితే అర్థమేంటో తెలుసా? అది మనకు శుభ ఫలితాలను ఇస్తుందా? లేక అశుభమా? 

PREV
13
Dream Astrology

మనం కలలో అపరిచిత ప్రాంతాలకు వెళ్లడం, పర్వాతాలను ఎక్కడం లేదా విమానాశ్రయాల్లో ఉన్నట్లు కనిపిస్తే, అది కేవలం కల మాత్రమే కాదు... అది మీ జాతకంలోని గ్రహాల స్థితికి సంకేతం అని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.

1.ఎదుగుదల,మార్పుకు సంకేతం...

కలలో ప్రయాణం చేయడం అనేది సాధారణంగా మీ జీవితంలో కొత్త మార్పులను కోరుకుంటున్నారని లేదా ఏదైనా ఒక పెద్ద మార్పు మీ జీవితంలో జరగబోతోంది అనడానికి అర్థం. ఇది మీ స్వేచ్ఛ కాంక్షకు నిదర్శనం కూడా.

23
గురు గ్రహ ప్రభావం..

జోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రయాణాలకు గురువు ప్రధాన కారకుడు. ఇది సుదూర ప్రయాణాలు, ఆధ్యాత్మికత, విదేశీ ప్రయాణాలను సూచిస్తుంది. అంతే కాదు మీ జాతకంలో గురు గ్రహం బలంగా ఉన్నప్పుడు లేదా 9, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ఇలాంటి ప్రయాణ సంబంధిత కలలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి ఈ కలల తరచుగా వస్తుంటాయి.

3. రాహువు, చంద్రుడి పాత్ర

రాహువు: ఆకస్మిక ప్రయాణాలు లేదా ఊహించని విదేశీ ప్రయాణాలకు రాహువు కారణం.

చంద్రుడు: మనస్సుకి అధిపతి అయిన చంద్రుడు ప్రయాణాల పట్ల మీకున్న అంతర్గత ఉత్సుకతను ప్రతిబింబిస్తాడు. మీ జాతకంలో రాహువు లేదా చంద్రుడి దశ నడుస్తున్నప్పుడు విదేశీ ప్రయాణాల కలలు వస్తాయి.

33
అడ్డంకులు ఎదురైతే అర్థం ఏమిటి?

కలలో మీరు ప్రయాణం చేసేటప్పుడు ట్రైన్ మిస్ అవ్వడం, బ్యాగేజీ పోగొట్టుకోవడం లేదా రోడ్డు అడ్డంకులు కనిపిస్తే, అది మీ నిజ జీవితంలోని అయోమయాన్ని (Confusion) సూచిస్తుంది.

మీ కెరీర్ లేదా వ్యక్తిగత జీవితంలో ముందుకు వెళ్లడానికి ఏవో అడ్డంకులు ఉన్నాయని, మీరు తీసుకునే నిర్ణయాల్లో జాప్యం జరుగుతుందని దీని అర్థం.

5. ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపిస్తే..

ఎటువంటి ఇబ్బంది లేకుండా కలలో సాఫీగా ఎగురుతున్నట్లు (Flying) అనిపిస్తే, మీరు విజయానికి , ఎదుగుదలకు మానసికంగా సిద్ధంగా ఉన్నారని అర్థం. ఒకవేళ ఎగరడానికి ఇబ్బంది పడుతుంటే, మీ గ్రహ స్థితి ప్రస్తుతం మీ ఓర్పును పరీక్షిస్తోందని తెలుసుకోవాలి.

ప్రయాణ కలలు అనేవి దైనందిన జీవితం నుండి తప్పించుకోవాలనే కోరికను లేదా మీలో ఉన్న అశాంతిని కూడా సూచిస్తాయి. మీ జాతకంలో గురు, చంద్ర లేదా రాహు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి కలలు రావడం సహజం.

Read more Photos on
click me!

Recommended Stories