నెంబర్ 6 ( 6,15, 24)..
న్యూమరాలజీ ప్రకారం వివాహ జీవితానికి నెంబర్ 6 అనేది అత్యంత అదృష్టకరమైనది. దీనికి అధిపతి శుక్రుడు.
శుక్రుడు ప్రేమ, విలాసం , సంతానానికి కారకుడు. ఈ తేదీల్లో పెళ్లి చేసుకున్న వారి జీవితం రొమాంటిక్ గా, విలాసవంతంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా వీరు త్వరగా ఎదుగుతారు. వీరి ఇల్లు ఎప్పుడూ ఆనందంతో, బంధుమిత్రులతో కళకళలాడుతుంటుంది.
నెంబర్3 ( 3, 12, 21, 30 )
దీనికి అధిపతి గురువు (Jupiter). ఈ తేదీల్లో పెళ్లి చేసుకున్న వారి మధ్య అవగాహన (Understanding) ఎక్కువగా ఉంటుంది. వీరు పిల్లల విషయంలో , కుటుంబ గౌరవం విషయంలో చాలా అదృష్టవంతులు. వీరి బంధం చాలా కాలం పాటు పటిష్టంగా ఉంటుంది.
ఈ తేదీల్లో మాత్రం పెళ్లి చేసుకోకూడదు..
కొంతమంది సంఖ్యా శాస్త్రవేత్తల ప్రకారం 4, 5, 8 నంబర్లు వచ్చే తేదీలను వివాహానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వరు.
4, 8: జీవితంలో ఆకస్మిక మార్పులు లేదా కష్టపడాల్సి రావడం వంటివి ఉండవచ్చు.
5: వీరు ప్రయాణాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు, దీనివల్ల కుటుంబానికి కేటాయించే సమయం తగ్గే అవకాశం ఉంటుంది.