తాబేలు ఉంగరం ఎలా ధరించాలో తెలుసా?

First Published | May 25, 2024, 4:49 PM IST

తాబేలు ఉంగరం ధరించిన చాలా మందిని చూసే ఉంటారు. ఇది ధరించడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అన్న మాటను వినే ఉంటారు. కానీ ఈ ఉంగరం ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం మీరు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అవేంటంటే.. 
 

వాస్తు,  జ్యోతిషశాస్త్రంలో తాబేలును చాలా పవిత్రంగా భావిస్తారు. దీనిని సంపదకు చిహ్నంగా భావిస్తారు. అందుకే తాబేలు ఉంగరాన్ని చాలా మంది ధరిస్తారు. ఈ ఉంగరాన్ని ధరించడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందొచ్చని నమ్ముతారు. దీని వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదటారు. కానీ దీనిని ధరించే ముందు కొన్ని నియమాలను పాటించడం చాలా అవసరం. అప్పుడే దీని ఫలితాలను పొందుతారు.

ఉంగరం పెట్టుకోవడానికి నియమాలు

వెండితో చేసిన తాబేలు ఉంగరాన్ని ధరించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు. తాబేలు ఉంగరం ధరించేటప్పుడు ఆ ఉంగరం తాబేలు మీకు ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. దీనితో పాటుగా ఈ ఉంగరాన్ని నేరుగా చేతి మధ్య వేలు లేదా బొటనవేలు దగ్గర అంటే చూపుడు వేలిక ధరించాలి. 
 


ధరించే ముందు ఈ పనులు చేయండి

తాబేలు ఉంగరాన్ని ధరించే ముందు పాలతో శుద్ధి చేసి ఆ తర్వాత గంగా జలంతో ఉంగరాన్ని శుద్ధి చేయాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ తర్వాత  ఉంగరాన్ని లక్ష్మీదేవి పాదాలకు సమర్పించి శ్రీ సూక్త పారాయణం చేయాలి. ఆ తర్వాతే తాబేలు ఉంగరం ధరించాలి.

ఏ రోజు ధరించాలి

తాబేలు లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉంటుందని నమ్ముతారు. అందుకే శుక్రవారం నాడు తాబేలు ఉంగరాన్ని ధరించడం మరింత పవిత్రంగా భావిస్తారు. ఏ కారణం వల్లనైనా ఉంగరాన్ని తీసేస్తే ఆ ఉంగరాన్ని లక్ష్మీదేవి పాదాలకు సమర్పించిన తర్వాతే ధరించాలి.

తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం.. తాబేలు ఉంగరం ధరించడం వల్ల సహనం, ప్రశాంతతతో పాటుగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీన్ని ధరించడం వల్ల జీవితంలోని ఎన్నో లోపాలు తొలగిపోతాయి. తాబేలు ఉంగరం ధరించడం వల్ల పురోభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని నమ్ముతారు.
 

Latest Videos

click me!