Latest Videos

Today Horoscope: ఓ రాశివారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి

First Published May 25, 2024, 5:30 AM IST

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

telugu astrology

25-5-2024,  శనివారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..)

మేషం (అశ్విని ,భరణి , కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి (దినపతి కేతువు )
భరణి నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
కృత్తిక నక్షత్రం వారికి  (దినపతి బుధుడు)

దిన ఫలం:-శుభకార్యాల వల్ల  ఖర్చు పెరుగుతుంది.రావలసిన సొమ్ము తిరిగి లభించును.నూతన వ్యాపారానికి శ్రీకారం చుడతారు.ఆదాయ మార్గాలు బాగుంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.ఎలాంటి సమస్యలు నైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు.మీ ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది.చేయు వృత్తి వ్యాపారాలలో సంబంధించిన అభివృద్ధి ప్రయత్నం ఫలిస్తుంది.
 

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
మృగశిర నక్షత్రం వారికి  (దినపతి రాహు)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో ధన నష్టం ఏర్పడవచ్చు.కుటుంబ సభ్యులతో ప్రతికూల వాతావరణం. సమాజంలో  గౌరవ ప్రతిష్టలు తగ్గును.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడికి గురి అవుతారు.అధిక శ్రమ పడాల్సి వస్తుంది.కొన్ని సమస్యలు ఊహించిన దానికంటే ఎక్కువగా బాధించును.వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం. అకారణంగా కోపం ఆవేశానికి లోనవుతారు.
 

telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర , పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినపతి రవి)
పునర్వసు నక్షత్రం వారికి (దినపతి కుజుడు)

దిన ఫలం:-సంఘం నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామితో మనస్పర్థలు తలెత్తే అవకాశం.అనుకోని ప్రయాణాలు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలం.మిత్రుల వలన ధననష్టం.కొన్ని సమస్యల వలన ఇబ్బందులు కలిగిన వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని అనుకూలంగా మార్చుకుంటారు.
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి గురుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినాధిపతి శని)

ణదిన ఫలం:-తలపెట్టిన పనులు నూతన ఉత్సాహంతో పూర్తి చేస్తారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారులకు సామాన్యంగా ఉంటాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.నూతన వస్తు వాహన ప్రాప్తి.ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.విలాసవంతమైన వస్తువులు కోసం అధికంగా ఖర్చు చేస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచనలు ఆచరణలో పెడతారు.
 

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి  (దినపతి కేతువు )
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి  (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.మానసికంగా శారీరకంగా ఆలోచనలతో చికాకుగా ఉంటుంది. ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో అధికారులు తో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.నమ్మిన వారి వలన మోసపోవచ్చు.ఎక్కువగా శ్రమించడం వల్ల అనుకున్నది సాధిస్తారు.
 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
చిత్త నక్షత్రం వారికి  (దినపతి రాహు)

దిన ఫలం:-బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.శుభవార్తలు వింటారు.వృత్తి వ్యాపారాల్లో అనుకూల మైన వాతావరణం.గృహంలో శుభ కార్యాచరణ.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.మానసికంగా శారీరకంగా ఉత్తేజంగా ఉంటారు.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి , విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి  (దినపతి రవి)
విశాఖ  నక్షత్రం వారికి (దినపతి కుజుడు)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.విద్యార్థులు నూతన విద్యల యందు ఆసక్తి చూపిస్తారు.వ్యాపారులకు పెట్టుబడులకు తగిన ధన లాభం కలుగుతుంది.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కీలక నిర్ణయాలు లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవాలి.అన్నదమ్ముల సహాయ సహకారాలు లభిస్తాయి.ఇతరులకు సహాయ పడతారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.నూతన ఆలోచనలు కలసి వస్తాయి.

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి గురుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి  (దినాధిపతి శని)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో లాభాలు.అధిక ఖర్చు చేయాల్సి ఉంటుంది.సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.బంధు మిత్రుల సహాయ సహకారం లభిస్తుంది.మానసిక ఒత్తిడి ఆందోళన గా ఉంటుంది.శారీరక శ్రమ పెరుగుతుంది.అన్ని విధాలుగా కలిసి వస్తుంది.ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు.దూరపు ప్రయాణాలు లభిస్తాయి. తలపెట్టిన పనులు తగిన సమయానికి పూర్తి చేస్తారు.
 

telugu astrology


ధనుస్సు (మూల  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి(దినపతి కేతువు )
పూ.షాఢ నక్షత్రం వారికి(దినపతి చంద్రుడు)
ఉ.షాఢ నక్షత్రం వారికి(దినపతి బుధుడు)

దిన ఫలం:-శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు గురవుతారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.బంధుమిత్రులతో మనస్పర్థలు రాగలవు. గృహంలో కొన్ని సమస్యలు బాధించును.ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి వలన చికాకులు కలుగును.కొత్త సమస్యలు ఏర్పడగలవు.ఖర్చు విషయంలో ఆచితూచి అడుగులు వేయవలెను.
 

telugu astrology


మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి  (దినపతి శుక్రుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి రాహు)

దిన ఫలం:-వృత్తి వ్యాపారాల్లో ధన లాభం. వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.ఉత్సాహంగా గడుపుతారు. నూతన ఆలోచనలు కలసి వస్తాయి.సంతాన విషయంలో అభివృద్ధి కనిపిస్తుంది.గృహంలో శుభకార్యములు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది.
 

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినపతి రవి)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కుజుడు)

దిన ఫలం:-అనవసర ప్రయాణాలు ఏర్పడగలవు.ఆరోగ్యం చేకూరి మానసిక ప్రశాంతత లభిస్తుంది.వృత్తి వ్యాపారాల్లో అధిక శ్రమ.తలపెట్టిన పనులు యందు ఆటంకాలు.కోపంతో  కాకుండా ప్రశాంతంగా మీ యొక్క సమస్యలు ను  పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు.కుటుంబంలో ఆనంద ఆహ్లాదకరంగా ఉంటుంది.భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి మనస్పర్థలు ఏర్పడగలవు.

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి  (దినపతి గురుడు)
రేవతి నక్షత్రం  వారికి  (దినాధిపతి శని)

దిన ఫలం:-ధర్మకార్యాలు ఆచరిస్తారు.మనస్సునందు ఆందోళనగా ఉంటుంది. బంధువర్గం తో అకారణంగా విరోధాలు ఏర్పడవచ్చు.ఉద్యోగాలలో అధికారులు తో సమస్యలు ఏర్పడగలవు.బుద్ధి కుశలత తగ్గి తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

click me!