2025 లో అదృష్టమంతా ఈ నాలుగు రాశులదే..!

First Published | Nov 2, 2024, 3:10 PM IST

2025లోకి మరి కొద్ది రోజుల్లో మనం అడుగుపెట్టబోతున్నాం.  మరి ఈ నూతన సంవత్సరం ఏ రాశులవారికి అదృష్టాన్ని తీసుకువస్తుందో ఓసారి చూద్దాం..

2025లో అదృష్ట రాశులు

జోతిష్యశాస్త్రం ప్రకారం శని, గురు, రాహు, కేతువుల గ్రహ సంచారం కారణంగా  12 రాశులపై ప్రభావరం చూపించనుందట. ముఖ్యంగా 2025లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. మరి, ఈ కొత్త సంవత్సరంలో ఏ రాశుల వారికి అదృష్టం కలగనుందో ఇప్పుడు చూద్దాం..

వృషభ రాశి..

2025లో వృషభ రాశివారికి ధనయోగం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఈ సంవత్సరం ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. వ్యాపారాలు బాగా కలిసొస్తాయి. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. విదేశీ యోగం కలుగుతుంది. పెళ్లి కాని వారికి ఈ ఏడాది పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. 


సింహ రాశి..

2025లో సింహ రాశి వారికి ఆర్థికంగా బలంగా:

జ్యోతిషశాస్త్రం ప్రకారం సింహ రాశి వారికి 2025 చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు. ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారం చేసే వారికి విదేశాల్లో వ్యాపార అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి. మాటల్లో మాధుర్యం ఉండాలి. 2025 ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది.

తుల రాశి

2025లో తుల రాశి వారికి శుభప్రదం:

జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 తుల రాశి వారికి చాలా బాగుంటుంది. 2025లో తుల రాశి వారికి గౌరవం పెరుగుతుంది. మీ వృత్తిలో కూడా మంచి విజయం సాధించవచ్చు. ఆదాయం పెరగడం వల్ల ఆర్థికంగా బలపడతారు. 2025లో ఏదైనా కొత్త పని మొదలుపెడితే అందులో గొప్ప విజయం సాధించవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టంగా ఉంటుంది. ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే అందులో విజయం సాధించే అవకాశాలున్నాయి. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది.

వృశ్చిక రాశి

2025లో వృశ్చిక రాశి వారికి అదృష్టం:

వృశ్చిక రాశి వారికి 2025 చాలా బాగుంటుంది. ఆదాయం పెరగడం వల్ల రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఏవైనా ఆర్థిక సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది, కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవుతాయి.

Latest Videos

click me!