Today Horoscope: ఓ రాశివారికి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు. పొదుపునకు అవకాశం లేదు

Published : Jan 06, 2024, 05:30 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారు ఈ రోజు తలచిన పనులు పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వృత్తి ఉద్యోగ విషయాల్లో కొంత వివక్షతను ఎదుర్కోవలసి వస్తుంది

PREV
113
 Today Horoscope: ఓ రాశివారికి   ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు. పొదుపునకు అవకాశం లేదు

06-1-2024   ,శని వారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలుతో..)


జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

ప్రతి రాశికి చెందిన నక్షత్రాలకు తారాబలం చూపబడినది. వీటిలో  (జన్మతార విపత్తార ప్రత్యక్తార నైధనతార) దోష ప్రదమైన తారలు
మీ నక్షత్రానికి ఉన్న తారాబలం చూసుకొని వ్యవహరించి శుభ ఫలితాలను పొందండి.
  

213
telugu astrology

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

గృహ సంబంధమైన పనులు కలిసి వస్తాయి.వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.  కీలకమైన వ్యవహారాలు సానుకూలంగా  ఉంటాయి .సమాజం నందు మీ పరపతి పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి చేసుకోగలుగుతారు. కుటుంబం నందు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. పాత బాకీలు వసూలు అవును. వీలైనంతవరకు వివాదాలకు వివాదాస్పద చర్చలు కు దూరంగా ఉండటం మంచిది.  ఈ రాశి వారు ఓం రామచంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

313
telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

సొంత విషయాలు కు మరియు విలాసవంతమైన వస్తువులకు సంబంధించిన విషయాలు లో అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబ పరంగా కొన్ని ముఖ్య సమస్యలు పరిష్కార మగును. ఈరోజు ఆర్థికంగా లాభపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో మీ ప్రతిభకు తగ్గ గౌరవ మర్యాదలు పెరుగుతాయి . గృహంలో సుఖసంతోషాలతో  ఆనందంగా గడుపుతారు. నూతన పరిచయాలు వలన అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందుతాయి. ఈ రాశి వారు ఓం అష్టలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

413
telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

తలచిన పనులు పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వృత్తి ఉద్యోగ విషయాల్లో కొంత వివక్షతను ఎదుర్కోవలసి వస్తుంది.సంఘము నందు కీర్తి ప్రతిష్టలకు ప్రతికూలత వాతావరణ ఏర్పడును. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించ వలెను. శత్రు బాధలు ఉండును. వ్యాపారాలు బాగున్నప్పటికీ ఆదాయం అంతంత మాత్రంగా ఉండును. బంధుమిత్రులతో నిందారోపణలు ఎదురగును.కుటుంబము నందు ప్రతికూలత వాతావరణం ఏర్పడుతుంది. ఈ రాశి వారు ఓం ఏకదంతాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

513
telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

ఉద్యోగాల పరంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కొన్ని విషయాలు లో ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటారు. చేయు వ్యవహారములు లో కోపాన్ని అదుపు చేసుకుంటే మంచిది. ప్రభుత్వ సంబంధిత పనుల్లో కొద్దిపాటి ఇబ్బందులు కలగవచ్చు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పట్టుదలతో చేసే పనులు పూర్తి అగును.ఈ రాశి వారు ఓం రవయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

613
telugu astrology


సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాల్లో ఊహించని ధన లాభం కలుగుతుంది. బంధుమిత్రుల తోటి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది. సమాజంలో అపనిందలు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. అనుకున్న పనులు వెంటనే ఆచరణలో పెట్టండి. సమస్యను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారు ఓం జనార్ధనాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

713
telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు:-(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

వ్యాపార వ్యవహారాలు కలిసివస్తాయి.  ఒక సందర్భంలో విపరీతమైన ఖర్చు చేయాల్సి వస్తుంది. విరోధ వివాదాలకు దూరంగా ఉండవలెను. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. చేసే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.ఈ రాశి వారు ఓం స్కందాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

813
telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

సంఘము నందు అపకీర్తి. అనవసరమైన ఆవేశం, కలహాలు.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.తలపెట్టిన పనులు వాయిదా పడతాయి .జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి . ఆర్థికంగా కొంత మేర ఇబ్బందులు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం కష్టంగా ఉండును. లాభాలు  ఉద్యోగాలలో ప్రతికూలత వాతావరణం ఏర్పడవచ్చు. ఈ రాశి వారు ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

913
telugu astrology

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)

వృత్తి వ్యాపారాలు పరంగా అభివృద్ధి కనబరుస్తారు. ఆరోగ్య వృద్ధి. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించ కొంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులు ప్రతిభా పాటలు కనపరుస్తారు. సమాజంలో మీ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. కీలకమైన సమస్య పరిష్కార మగును. మానసికంగా సంతోషంగా ఉంటుంది. గృహమునందు ప్రశాంతత వాతావరణం . విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం లభించును.ఈ రాశి వారు ఓం నారసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

1013
telugu astrology

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1)
నామ నక్షత్రాలు (యే-యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

ప్రతి విషయంలో మరియు సమాజంలో వ్యతిరేకత ఏర్పడును. ఊహించని సంఘటనల వలన మనసునందు భయాందోళన గా ఉంటుంది.  చేయు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండవలెను. నిష్కారణంగా ఇతరులతో విభేదాలు ఏర్పడును. కుటుంబం లో మార్పులు చేర్పులు జరుగును. కొన్ని సమస్యల వలన ఆందోళన ఏర్పడుతుంది. అనాలోచిత పనుల వలన కొంత ఇబ్బందులు ఎదురవుతాయి.ఈ రాశి వారు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1113
telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలలో బాగా రాణించడంతో ఆదాయం బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఎటువంటి పనులున్నా అవలీలగా సాధిస్తారు.సంఘంలో మీ యొక్క ప్రతిభకు తగ్గ కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా గడుపుతారు. సంతోషకరమైన వార్త వింటారు. తలచిన పనులు అనుకున్న సమయానికి పూర్తి అగును. ఈ రాశి వారు ఓం సదాశివాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1213
telugu astrology

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

కుటుంబ సంబంధించిన విషయాలు లో మీయొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శింప చేస్తారు. ఆర్థికంగా ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదిస్తారు. సమాజంలో ఉన్న నిందలు సమర్థవంతంగా తిప్పి కొడతారు. వ్యవహారాలలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకొనవలెను. శుభకార్యాలకు సంబంధిత విషయాలు ను ఇతరులతో చర్చిస్తారు.శారీరక శ్రమ తగ్గి శరీర సౌఖ్యం లభించును. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారు ఓం శ్రీమాత్రే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1313
telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు (దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చ)

సమాజంలో వాతావరణం మరియు విషయాలు వలన మనస్థాపానికి గురి అవుతారు.మీ ప్రమేయం లేకుండానే వివాదాలు తగాదాలు ఏర్పడతాయి. కుటుంబం నందు గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో మనస్పర్థలు రావచ్చు. సమాజంలో కొద్దిపాటి ఆరోపణలకు గురవుతారు. కీలకమైన సమస్యల్లో  పంతాలు పట్టింపులు వదిలి చర్చలతో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి. ఈ రాశి వారు ఓం చండికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

Read more Photos on
click me!

Recommended Stories