అంతిమ సంస్కారాల తర్వాత తలస్నానం ఎందుకు చేయాలి? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే?

First Published Jan 5, 2024, 12:12 PM IST

అంతిమ సంస్కారాల తర్వాత తలస్నానం చేయనిదే ఇంట్లోకి అడుగుపెట్టరు. ఈ ఆచారం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. మరణించిన తర్వాత కొన్ని కర్మలు చేస్తారు. దీంతో మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి లభిస్తుంది. ఇందుకోసం నిబంధనలు పాటించడం చాలా ముఖ్యమంటాయి శాస్త్రాలు.
 

అంతిమ సంస్కారాల తర్వాత తలస్నానం ఎందుకు చేయాలన్న డౌట్ ఎంత మందికి వచ్చింది? ఈ ప్రశ్నకు ఆన్సర్.. సైన్సు ప్రకారం అయితే.. చనిపోయిన వ్యక్తి శరీరాన్ని తాకితే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉంది. అందుకే అంత్యక్రియల తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేస్తే ఇన్ఫెక్షన్ వ్యాపించే అవకాశం ఉండదని నమ్ముతారు. 
 

అలాగే జ్యోతిష్యం ప్రకారం.. అంతిమ సంస్కారాల తర్వాత స్నానం చేయడం చాలా అవసరమని భావిస్తారు. జ్యోతిషంతో సహా ఎన్నో సంస్కృతులలో.. అంత్యక్రియల తర్వాత స్నానం చేయడం హాజరైన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పరిగణించబడుతుంది. ఈ సంప్రదాయం జ్యోతిష్య సూత్రాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. 
 

Latest Videos


bath

జ్యోతిషశాస్త్రంలో అంత్యక్రియలు ఎందుకు ముఖ్యమైనవి

అంత్యక్రియలు ఒక వ్యక్తి జీవితంలో చివరి ఆచారంగా పరిగణించబడుతుంది. అలాగే దీని తర్వాతే శరీరానికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అలాగే దీనితర్వాత ఆత్మ మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. అంత్యక్రియలకు కొన్ని ప్రత్యేక నియమాలు రూపొందించారని, వాటిని మరణించిన వారి కుటుంబ సభ్యులు పాటించడం అవసరమని భావిస్తారు. ఈ నియమాలలో ఒకటి అంత్యక్రియల తర్వాత స్నానం చేయాలనే నియమం ఉంది.

అంత్యక్రియల తర్వాత స్నానం చేయడం ఎందుకు ముఖ్యం?

జ్యోతిష్యం ప్రకారం.. అంత్యక్రియలకు హాజరయ్యే వ్యక్తులు.. మరణం, మరణంతో సంబంధం ఉన్న ప్రత్యేక శక్తులను గ్రహిస్తారట. జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఎవరైనా మరణించినప్పుడు గ్రహాల స్థానం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. 
 

దహన సంస్కారాల తర్వాత స్నానం అవసరమని భావిస్తారు. ఎందుకంటే ఇది శుద్ధి సాధనంగా పరిగణించబడుతుంది. ఆధ్యాత్మికత ప్రకారం.. నీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. నీరు స్వచ్ఛత, పరిశుభ్రత, పునరుద్ధరణతో ముడిపడి ఉంటుంది. అంతిమ సంస్కారాల తర్వాత స్నానం చేయడం వల్ల భౌతిక, ఆధ్యాత్మిక మలినాలను కడిగివేసే శక్తి నీటికి ఉందన్న నమ్మకంతో స్నానం చేస్తారు. జ్యోతిషశాస్త్రంలో.. నీటితో సహా ప్రతి మూలకం నిర్దిష్ట లక్షణాలు శక్తులతో సంబంధం కలిగి ఉంటుంది. వాటర్ ప్రతికూల శక్తిని గ్రహిస్తుందని నమ్ముతారు. 

bathing

సైన్స్ దృష్ట్యా.. అంత్యక్రియల తర్వాత స్నానం చేయడం వ్యక్తిగత ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. ఇలా స్నానం చేయడం వివిధ సంస్కృతులు, మత సంప్రదాయాలలో కూడా ప్రబలంగా ఉంది. అలాగే ఒక వ్యక్తిని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో శుద్ధి చేయడానికి ఇది మంచి మార్గం కూడా. 

bath

చనిపోయిన వారి శరీరంలోని ఎన్నో సూక్ష్మక్రిములు ఇతరుల శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే స్నానం చేయడం అవసరమని భావిస్తారు. స్నానం మానసిక,ఆధ్యాత్మిక శుద్ధికి అవసరం. ఇది మానసిక స్థితిని స్థిరీకరించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

అంతే కాదు.. స్నానం ఒక వ్యక్తిని ఎన్నో వ్యాధుల నుంచి రక్షించడానికి కూడా సహాయపడుతుంది. స్నానంలో ఉపయోగించే సబ్బులు,  ఇతర స్నాన పదార్థాల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి సూక్ష్మక్రిములకు వ్యతిరేకంగా మనల్ని రక్షిస్తాయి. 

click me!