స్నేహానికి ఆడ, మగ తేడా ఉండదు. కానీ చాలా కొద్ది మంది అమ్మాయిలకు మాత్రమే అబ్బాయిల్లోనూ స్నేహితులు ఉంటారు. అది కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది అమ్మాయిలు తమ వయస్సులో ఉన్న అబ్బాయిలతో లేదా క్లాస్ మేట్స్‌తో సులభంగా కలిసిపోరు, కానీ కొందరు అమ్మాయిలు అబ్బాయిలతో చాలా సహజంగా కలిసిపోయి అందమైన, బలమైన స్నేహాన్ని ఏర్పరుచుకుంటారు. చాలామంది అబ్బాయిలతో స్నేహం చేయడానికి వెనుకాడతారు, కొందరు కాదు. అది వారి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ గుణం వారి రాశిచక్రం కారణంగా వస్తుంది. పురుషులతో మంచి స్నేహం చేయడంలో కొన్ని రాశుల వారు ముందుంటారు. మేల్ బెస్టీలు ఎక్కువగా ఉండే రాశులేంటో చూద్దాం...