Today Horoscope: ఓ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి

First Published | Aug 2, 2024, 5:30 AM IST

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..
 

telugu astrology


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆప్తుల నుంచి డబ్బు సహాయం పొందుతారు. కొత్త వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- మొదలుపెట్టిన పనుల్లో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతాయి.అప్పులు పుట్టవు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఖర్చు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. కుటుంబ సభ్యులతో అనుకోని వివాదాలు వస్తాయి. ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.  వృత్తి  ఉద్యోగులు అధికారులతో మాటలు పడతారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. 
 


telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- అవసరానికి కుటుంబ సభ్యులు డబ్బు సహాయం చేస్తారు. వృత్తి  ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. నూతన కార్యక్రమాలను విజయవంతంగా మొదలుపెడతారు. వ్యాపాలు బాగా విస్తరిస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ప్రయాణాల్లో  చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్త అవసరం. ఇంట్లో చిరాకు కలిగించే వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. భూమి క్రయ విక్రయాలు మీరు ఊహించినట్టు జరగవు. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. 
 

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- ఇంట్లో శుభకార్యాలు చేసే ఆలోచన ఉంటుంది.వ్యాపార ఉద్యోగులకు ఈ రోజు కలిసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు లాభాదాయంగా ఉంటాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. మొదలుపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయ నాయకుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారులు మంచి పెట్టుబడులు పొందుతారు. 

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆస్థిని కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోండి. వృత్తి  ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు.  వ్యాపారాలు అనుకున్నట్టు మంచి లాభాలను అర్జిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగ అవకాశం పొందుతారు. 
 

telugu astrology


తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- ఈ రోజు మీరు ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి. దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. వృత్తి  వ్యాపారాలు సాగాలంటే బాగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అప్పులు చేస్తారు. ఉద్యోగులకు ఈ రోజు ఒత్తిడి పెరుగుతుంది. 
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- కుటుంబం విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. మొదలుపెట్టన పనులు నత్తనడకన సాగినా.. చివరకు పూర్తి చేస్తారు. వృత్తి  వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. ఉద్యోగులు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. 

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- ఇంట్లో  ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటికి బంధువులు వస్తారు. సమాజంలో మీ కీర్త ప్రతిష్టలు పెరుగుతాయి. చాలా కాలంగా ఉన్న సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆగిపోయిన పనులను కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు.ఉద్యోగులు గొప్ప పదవి పొందుతారు. 
 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:-  నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. ఒక గొప్ప అవకాశాన్ని పొందుతారు. వృత్తి  వ్యాపారులు మంచి పెట్టుబడులను పొందుతారు. నూతన వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు ఈ రోజు ఆనందంగా గడుస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం: ఇష్ట దైవ దర్శనంతో మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చేతిలో చిల్లి గవ్వ లేక చాలా ఇబ్బంది పడతారు. అప్పులు పుట్టవు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారులు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా తర్వాత ఎంతో నష్టపోవాల్సి వస్తుంది.  ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. 
 
 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- నూతన వ్యాపారం ప్రారంభించాలనే మీ కోరిక ముందుకు సాగదు. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు వస్తాయి. ముఖ్యమైన పనుల జోలికి ఈ రోజు వెళ్లకపోవడమే మంచిది. కొత్త అప్పులు పుట్టవు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. నిరుద్యోగులు ప్రయత్నం సరిగ్గా చేయరు. 

Latest Videos

click me!