ఆగస్టు నెలలో ఈ నాలుగు రాశులకు పట్టిందల్లా బంగారమే..!

First Published | Aug 1, 2024, 4:39 PM IST

వృత్తి, ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనాలు అందుకుంటారట. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ నెలలో వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి.. ఆ అదృష్ట రాశులేంటో ఓసారి చూద్దాం...
 

జులై  నెల ముగిసింది. మనమంతా ఆగస్టులో అడుగుపెట్టేశాం. కాగా... జోతిష్యశాస్త్రం ప్రకారం ఆగస్టు నెల ఓ నాలుగు రాశులవారికి మాత్రం శుభాలను తెచ్చిపెడుతుందట.  ఆర్థికంగా ఆ నాలుగు రాశులవారికి బాగా కలిసొస్తుందట. అంతేకాదు... వృత్తి, ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనాలు అందుకుంటారట. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ నెలలో వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. మరి.. ఆ అదృష్ట రాశులేంటో ఓసారి చూద్దాం...
 

telugu astrology

1.మేష రాశి..
మేష రాశివారికి ఆగస్టు నెల బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. వారికి ఈ నెలలో బహుమతులు, గౌరవం, లభిస్తాయి. వారు ఈ నెలలో ఆర్థికంగా ఏ పని చేసినా బాగా కలిసొస్తుంది. కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కారమౌతాయి.


telugu astrology


2.కన్య రాశి...
కన్య రాశి వారికి ఈ నెలలో కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ఆర్థికంగా ఏవైనా సమస్యలు ఉంటే.. అవి తీరిపోతాయి.  కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తీరిపోయే అవకాశం ఉంది. సంతానం లేనివారికి... సంతాన యోగం కలిగే ఉంది. ఆరోగ్య సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి.

telugu astrology

3.వృశ్చికం : వృత్తి, వ్యాపారం తదితర విషయాల్లో ఏదైనా సమస్య ఉంటే పరిష్కారమవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం , సానుకూలత ఉంటుంది.

telugu astrology


4.కుంభం : కుంభ రాశి వారికి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మీరు కార్యాలయంలో గౌరవం పొందుతారు. జీతం పెరగవచ్చు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఎప్పుడూ మధురానుభూతి ఉంటుంది.

ఈ నాలుగురాశులవారికి సంతోషంగానే ఉన్నా... మూడు రాశులవారు మాత్రం.. ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఆగస్ట్ మాసంలో వృషభ, కర్కాటక, ధనుస్సు రాశుల వారికి ఆర్థిక, వృత్తి, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. నష్టం కూడా వస్తుందని గుర్తుంచుకోండి. ఆగష్టు మాసంలో మీకు ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా, సమస్యల నుండి విముక్తి పొందడానికి శివునికి జలాభిషేకం చేయండి. మీ శక్తికి తగినట్లుగా దానం చేయండి. ఇది మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది.
 

Latest Videos

click me!