Today Horoscope: ఓ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తపడాలి..!

First Published | Jun 25, 2024, 5:06 AM IST

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

telugu astrology


మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆదాయంలో ఎలాంటి మార్పులు కనపడవు.దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. దేవుడి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది.   ఉద్యోగ వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.
 

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.  కుటుంబ సభ్యుల ప్రవర్తన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.  ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.  ఆరోగ్యం విషయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి.

Latest Videos


telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

కొన్ని రోజులుగా పడిన శ్రమ కొలిక్కి వస్తుంది.వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. అనుకోని అవకాశాలు అప్రయత్నంగా లభించును.తలపెట్టిన కార్యక్రమంలో సాధిస్తారు.ఆదాయ మార్గాలు బాగుంటాయి.ఉద్యోగాలలో అధికారులు ఒత్తిడుల నుంచి బయటపడతారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.శ్రమకు తగిన ఫలితం పొందుతారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

కీలకమైన సమస్య కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో పరిష్కారం లభిస్తుంది.ఉద్యోగాలలో అధికారుల ఆదరణ లభిస్తుంది. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వారితో పరిచయం ఏర్పడుతుంది.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు.కొత్త అవకాశాలు అందిపుచ్చు కుంటారు.ఖర్చులు పెరిగినా అందుకు తగిన రాబడి పొందగలరు. స్నేహితులు మరియు బంధు వర్గం తో సఖ్యత పెరుగుతుంది.
 

telugu astrology


సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

శుభవార్తలు వింటారు.ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి రావలసిన బకాయిలను వసూలు అవును.పోయిన వస్తువులు దొరకవచ్చు.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది.కొన్ని సమస్యలు తీరి ప్రశాంతత లభించును

telugu astrology


కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

గత కొన్ని రోజులుగా వివాదాలు పరిష్కారం అవుతాయి.ఆర్థిక ఒప్పందాలు లాభసాటిగా సాగుతాయి.సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.పెద్దల సలహాలను ఆచరణలో పెడతారు.ఉత్సాహంగా గడుపుతారు.పనుల్లో పట్టుదల అవసరం.బంధువర్గంతో వివాదం తలెత్తకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.సమయానుకూల నిర్ణయాలతో సత్ఫలితాలు పొందుతారు.
 

telugu astrology


తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

సమస్యలు వివాదాలు పరిష్కారం అవును.కీలకమైన నిర్ణయాలు లో కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకుని వ్యవహరించాల్సి ఉంటుంది.నూతన విషయాలు తెలుసుకుంటారు.దూరపు బంధువులను కలుసుకుంటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.గృహ సంబంధిత నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఉత్సాహంగా గడుపుతారు.
 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దూరపు బంధువులను కలుసుకుంటారు.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.అనవసరమైన విషయాలు కు వివాదాలకు దూరంగా ఉండాలి.ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వాహనాలు ప్రయాణంలో జాగ్రత్త అవసరం.అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.అనారోగ్య సమస్యలు ఏర్పడగలవు.

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండాలి.ఇతరులతో విరోధం ఏర్పడి నా విజయం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో స్థిరమైన నిర్ణయాలతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.అకారణ కోపం చేత కొత్త సమస్యలు ఏర్పడగలవు.పనిచేయ వారితో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చును. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడిన పట్టుదల తోటి పనులు పూర్తి చేయాలి.

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.ఆరోగ్యం కొద్దిపాటి ఇబ్బందికరంగా ఉంటుంది.ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.శారీరక కష్టం అధికంగా ఉంటుంది.తలచిన పనులు లో అవాంతరాలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కో గలుగుతారు. ముఖ్యుల రాకపోకలు, ఊహించని ఖర్చులు ఎదుర్కోకతప్పదు.దైవ సంబంధిత కార్యాలలో పాల్గొంటారు.ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.ఇతరుల విషయాల్లో జోక్యం తగదు.

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

సమాజంలో గౌరవం తగ్గుతుంది.అనవసర ప్రయాణాలు వలన ధన నష్టం కలుగుతుంది. మానసికంగా శారీరకంగా బలహీనపడతారు.ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తుంది.రావలసిన బాకీలు లౌక్యంగా వసూలు చేసుకోవాలి.ఇంటా బయట ప్రతికూలత వాతావరణం.బంధుమిత్రులతో మనస్పర్థలు.చేసే పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకు కలిగించును.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.
 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

తలపెట్టిన కార్యక్రమం సకాలంలో పూర్తి చేస్తారు.ఆశించిన ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. సమాజంలో ప్రతిభకు తగ్గ గుర్తింపు పొందుతారు. సేవాకార్యక్రమాలు లో పాల్గొంటారు.బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల ఆదర అభిమానం పొందగలరు.శుభకార్యాలలో పాల్గొంటారు

click me!