Today Horoscope: ఓ రాశివారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి..

First Published Jul 26, 2024, 5:30 AM IST

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..
 

telugu astrology

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- అన్నదమ్ములతో ఉన్న ఆస్థికి సంబంధించిన గొడవలు ఒకరి జోక్యంతో పరిష్కరించబడతాయి. ఈ రోజు ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. వృత్తి  ఉద్యోగులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
 

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- రావు అనుకున్న బకీలు వసూలవడంతో ప్రశాంతంగా ఉంటారు. మొదలుపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రుల నుంచి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. వ్యాపార ఉద్యోగులకు ఆనందంగా ఉంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. 

Latest Videos


telugu astrology

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- ఈ రోజు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఉద్యోగులకు అదనపు పనిబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు నష్టాల్లో కొనసాగుతాయి. ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగుండవు. నిరోగ్యులకు నిరాశే మిగులుతుంది. పిల్లల చదువు విషయంలో ఓ కన్నేసి ఉంచడం మంచిది. 
 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- మొదలుపెట్టిన పనులు ముందుకు సాగక ఒత్తిడికి గురవుతారు. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రమే సాగుతాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో నిరుద్యోగులు విఫలమవుతారు. ఒక విషయంలో బంధుమిత్రులతో వివాదాలు వస్తాయి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- చేతిలో డబ్బు నిలుస్తుంది. ఈ రోజు నిరుద్యోగులు శుభవార్త వింటారు. మొదలుపెట్టిన పనులను విజయ వంతంగా పూర్తి చేస్తారు.  బంధుమిత్రులతో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపారులు నష్టాల నుంచి బయటపడతారు. ఉద్యోగులక ఉన్న సమస్యలన్నీ పోతాయి. 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- బంధుమిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానం అందుకుంటారు. సకాలంలోనే రావాల్సిన డబ్బు వస్తుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. నూతన వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరుతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగులకు ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. 
 

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- పాత అప్పులను తీర్చడానికి కొత్త అప్పులను చేయాల్సి వస్తుంది. జీవిత భాగస్వామితో ఒక విషయం గురించి గొడవ పడతారు.  మొదలుపెట్టిన పనులకు అడుగడుగున అడ్డంకులు కలుగుతాయి. అకస్మత్తుగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. వ్యాపారులు నష్టాలను చవిచూస్తారు. వృత్తి ఉద్యోగులకు ఈ రోజు ఎలాగోలా గడిచిపోతుంది. 

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- ఇంట్లో కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది.  ఉద్యోగులు తమ పనిని సమర్థవంతంగా పూర్తి చేయడంలో విఫలమవుతారు.  వ్యాపారాలు అంతంత మాత్రమే సాగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి వస్తుంది. ఆస్థికి సంబంధించిన గొడవలు వస్తాయి. 
 

telugu astrology

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-ప్రముఖులతో పరిచయాలు లాభాదాయకంగా ఉంటాయి. వ్యాపారులు సమస్యల నుంచి బయటపడతారు.  వ్యాపారులు  తమ సామర్థ్యంతో మంచి లాభాలను అర్జిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీరు అనుకున్న పనులను  పూర్తి చేస్తారు. ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకుంటారు. 

telugu astrology

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- ఇంట్లో వాతావరణం చిరాకు కలిగిస్తుంది. అనవసర ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.  వ్యాపారాలు నష్టాల్లో ఉంటాయి. ఉద్యోగులకు ఈ రోజు కలిసిరాదు. దైవ చింతన పెరుగుతుంది.  ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి. 
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-ఇంటికి సంబంధించి మీరు ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వృత్తి వ్యాపారులకు ఈ రోజు కలిసి వస్తుంది. ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తుకు వస్తాయి. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. ఇంట్లోకి విలువైన వస్తువులను కొంటారు. 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-వ్యాపారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. స్నేహితుల నుంచి సంతోషకరమైన వార్తను వింటారు. మొదలుపెట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులు కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. 

click me!