ఇంట్లో రామ చిలుకలను పెంచుకోవడం శుభమా? అశుభమా?

First Published | Jul 25, 2024, 1:40 PM IST

చాలా మంది చిలుకలను ఇంట్లో పెంచుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. దీనివల్ల ఏం జరుగుతుంది? చిలుకలు ఇంటికి  శుభాన్ని కలిగిస్తాయా? అశుభాన్ని కలిగిస్తాయా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

వాస్తు శాస్త్రం మనకు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడిస్తుంది. ఏదైనా ఒక పని చేస్తే దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇది వివరంగా చెప్తుంది. ఒక వ్యక్తి పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి, ప్రశాంతంగా ఉండటానికి వాస్తు శాస్త్రం ఎన్నో మార్గాలను తెలియజేస్తుంది. ఈ వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో చిలుకలను పెంచుకోవడం శుభమా? అశుభమా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఇంట్లో చిలుక ఉంటే మంచిదా? 

చిలకలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని ఇంటికి తెచ్చుకుని పెంచుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. చిలుకలను ఇంట్లో ఉంచడం శుభప్రదం. ఇది ఇంట్లో అంతా మంచే జరిగేలా చేస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. 


ఏ దిక్కులో ఉంచాలి? 

అందమైన రామ చిలుకలను ఇంటికి తెచ్చేసి మంచి ప్రదేశంలో చిలుకలను పెంచుతుంటారు. కానీ వాస్తు ప్రకారం.. ఇంట్లో చిలుకలను ఉత్తర దిశలోనే ఉంచాలి. ఈ దిక్కు శుభంగా పరిగణించబడుతుంది. 

parrot

సంతోషంగా..

స్వేచ్ఛగా ఎగిరే పక్షులకు బోనులో పెరగడం చాలా కష్టం. అందుకే మీరు ఇంటికి తెచ్చి వీటిని బోనులో పెంచుతున్నా.. వాటిని సంతోషంగా ఉంచాలి. అవి సంతోషంగా ఉంటేనే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. లేదంటే మీ కుటుంబంలో సమస్యలను ఎదుర్కోకతప్పదు. 
 

విభేదాలు తగ్గుతాయి

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో రామ చిలుకలు సంతోషంగా, కిలకిలరావాలతో ఉంటే.. మీ ఇళ్లు సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. గొడవలు, చికాకులు, కొట్లాటలు కూడా చాలా వరకు తగ్గుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

చిలుక చిత్రం

ఇంట్లో రామ చిలుక కాకపోయినా.. చిలుక బొమ్మను ఉంచడం కూడా శుభమే. వాస్తు ప్రకారం.. ఇంట్లో రామ చిలుకల బొమ్మలు ఉంటే కేతువు, శని దుష్ట దృష్టి తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.
 

Latest Videos

click me!