telugu astrology
మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)
దిన ఫలం:-ఎన్ని అవరోధాలు ఎదురైనా మీరు చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో మీరు మాటలు పడాల్సి వస్తుంది. ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం పెరగడంతో విశ్రాంతి దొరకదు. రుణాల ఒత్తిడి పెరుగుతుంది.
telugu astrology
వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)
దిన ఫలం:-ముఖ్యమైన విషయంలో ఆచీతూచీ నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారో ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. ఇంట్లో వాతావరణం చిరాకు కలిగిస్తుంది. నూతన వాహనం కొనాలనే మీ కళ నెరవేరదు. ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండదు. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి వస్తుంది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.
telugu astrology
మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి (దినపతి కేతువు )
దిన ఫలం:-ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు గట్టెక్కుతారు. పాత అప్పులు తీరడంతో కాస్త ఉపశమనం పొందుతారు. కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు లాభాదాయకంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
telugu astrology
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
దిన ఫలం:- ఒక విషయంలో మీరు ఇంట్లో వారితోనే కాకుండా బయటివారితో కూడా మాటలు పడాల్సి వస్తుంది. ఒక ప్రయాణం ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. స్నేహితులతో వివాదాలు వస్తాయి. ఉద్యోగులు తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. పిల్లల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.
telugu astrology
సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రవి)
దిన ఫలం:-బంధు, మిత్రుల రాకతో మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు ఊహించని విధంగా ధనప్రాప్తి పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగవుతుంది. నూతన వ్యాపారానికి మంచి పెట్టుబడులు అందుకుంటారు. ఒకరి జోక్యంతో స్థిరాస్థికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగులు ప్రమోషన్స్ పొందుతారు.
telugu astrology
కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినపతి కుజుడు)
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)
దిన ఫలం:-పొరుగువారితో గొడవలు జరిగే అవకాశం ఉంది. డబ్బు విషయంలో మీకు కొన్ని సమస్యలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారాలు మీరు ఊహించిన విధంగా ముందుకు సాగవు. ఆదాయానికి మించి ఖర్చు చేయాల్సిన పరిస్థి ఏర్పడుతుంద. ఇతరుల విషయాల్లో కలగజేసుకోవడం మీకు మంచిది కాదు.
telugu astrology
తుల (చిత్త 3 4 స్వాతి విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )
దిన ఫలం:-ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధు, మిత్రుల నుంచి అవసరానికి డబ్బు సహాయం అందుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇష్ట దైవ దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు.
telugu astrology
వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
దిన ఫలం:-బంధువుల వల్ల మీరు ఒక ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్నదమ్ములతో స్థిరాస్తికి సంబంధించిన గొడవలు జరుగుతాయి. గతం కంటే మీ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు పై అధికారుల ప్రశంసలు పొందుతారు.
telugu astrology
ధనుస్సు (మూల, పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)
దిన ఫలం:-మీ సంకల్పంతో మీరు చేపట్టిన పనులన్నింటినీ పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. వ్యాపారులు మంచి లాభాలను అందుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు ఇబ్బందులు ఎదురవుతాయి.
telugu astrology
మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి (దినపతి గురుడు)
దిన ఫలం:-చాలా చిన్న విషయానికే మీరు ఇంట్లో వారితో గొడవకు దిగుతారు. ఆరోగ్యం దెబ్బతినడంతో హాస్పటల్ కు వెళ్లాల్సి వస్తుంది. ఇంట్లోనే కాకుండా బయటి వాతావరణం కూడా చిరాకు కలిగిస్తుంది. అధికారులచే ఉద్యోగులు మాటలు పడాల్సి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి.
telugu astrology
కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )
దిన ఫలం:-ఉద్యోగులకు కాస్త పనిభారం తగ్గడంతో ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణంలో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అప్పులు తీరుస్తారు. ఇంటి పనులను మొదలుపెడతారు. వ్యాపారులు చాకచక్యంగా పనిచేసి మంచి లాభాలను పొందుతారు.
telugu astrology
మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
దిన ఫలం:- సోదరుల అండదండలతో మీరు అనుకున్న పనులను మొదలుపెడతారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. మీ పనికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు లాభాదాయకంగా ఉంటాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి.